అల్లు క‌న‌క‌ర‌త్న‌మ్మ మృతి ప‌ట్ల వైయ‌స్ జ‌గ‌న్ సంతాపం

తాడేప‌ల్లి: దివంగ‌త సీనియర్ న‌టుడు అల్లు రామ‌లింగ‌య్య గారి స‌తీమ‌ణి, ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ గారి మాతృమూర్తి అల్లు క‌న‌క‌ర‌త్న‌మ్మ మృతి ప‌ట్ల వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గన్‌మోహ‌న్‌రెడ్డి సంతాపం తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న త‌న ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. `క‌న‌క‌ర‌త్న‌మ్మ  గారు మృతి చెందడం బాధాక‌రం. ఆమె ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ స‌భ్యుల‌కు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను` అంటూ వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు.

Back to Top