కదిరి నియోజకవర్గం లో టీడీపీ నేతల దాష్టీకం 

శ్రీ సత్యసాయి జిల్లా: క‌దిని నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ నేత‌ల ఆగ‌డాలు ఎక్కువ‌య్యాయి. రెండు రోజుల క్రితం వైద్య సిబ్బందిపై దాడి చేసిన ప‌చ్చ మూక‌లు, ఇవాళ కదిరి మండలం యాకాలచెరువుపల్లిలో వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘ‌ట‌న‌లో ఐదుగురు వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. క్ష‌త‌గాత్రుల‌కు ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో చికిత్స‌లు అందిస్తున్నారు.  వినాయ‌క నిమ‌జ్జ‌నం సంద‌ర్భంగా టీడీపీ శ్రేణులు  రెచ్చిపోయి భౌతిక దాడుల‌కు పాల్ప‌డ‌టం, ఇళ్లలోని వస్తువులు ధ్వంసం చేయ‌డంతో గ్రామంలో భ‌యాన‌క ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. పోలీసుల స‌మ‌క్షంలోనే ప‌చ్చ‌మూక‌లు దాడికి తెగ‌డ‌బుతున్నా..వారు ప్రేక్షక పాత్ర వ‌హించారు. దాడిలో గాయ‌ప‌డిన కార్య‌క‌ర్త‌ల‌ను వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు ప‌రామ‌ర్శించారు. దాడికి పాల్ప‌డిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నాయ‌కులు డిమాండ్ చేశారు.

Back to Top