తాడేపల్లి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి సందర్భంగా అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం, హ్యూస్టన్ నగరంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైయస్ఆర్ చిత్రపటానికి వైయస్ఆర్‌సీపీ ఎన్ఆర్ఐ విభాగం నేతలు పూల మాలలు వేసి స్మరించుకొని నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి జయంతి వేడుకను ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. ‘వైయస్ఆర్ అమర్ రహే.. మరుపురాని నేత వైయస్ఆర్..’ అంటూ నినాదాలు చేశారు.వేడుకలో వైయస్ఆర్‌సీపీ నాయకులు రాఘవ్ గౌడ్ బత్తుల, అశోక్ రెడ్డి మార్ రెడ్డి, మనోజ్ రెడ్డి ఏకులా, నవీన్ రెడ్డి, అరవింద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.