అనంతపురం: తాడిపత్రి వెళ్లేందుకు అనుమతించాలని కోరుతూ వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనంతపురం జిల్లాఎస్పీ జగదీష్‌కు లేఖ రాశారు. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని తాడిపత్రి నియోజకవర్గంలో నిర్వహించాలి.. అందుకు తాను తాడిపత్రికి రావాల్సి ఉందని.. అనుమతి ఇవ్వాలని ఎస్పీని లేఖలో కోరారు. అయితే, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు ఏప్రిల్ 30వ తేదీన హైకోర్టు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లినప్పుడు తగిన భద్రత కల్పించాలని పోలీసు శాఖకు హైకోర్టు సూచించింది. కానీ, అనంతపురం పోలీసులు మాత్రం హైకోర్టు ఆదేశాలను అమలు చేయడం లేదు. ఈ నేపథ్యంలో మరోసారి ఎస్పీకి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి లేఖ రాశారు.