తాడిపత్రిలో అర్ధ‌రాత్రి ప‌చ్చ‌మూక‌ల అరాచ‌కం

వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుల ఇళ్ల‌పై టీడీపీ శ్రేణుల దాడి

అనంత‌పురం: కూటమి ప్రభుత్వంలో తాడిప‌త్రిలో అరాచ‌కాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఇటీవ‌ల అర్ధరాత్రి పచ్చమూకలు రెచ్చిపోయిన ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగు చూసింది. వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తల ఇళ్లపై టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయి.  `వైయ‌స్ఆర్‌సీపీనాయకులను తన్ని తరిమేస్తే ఎవ్వర్రా మీకు దిక్కు' అని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే పచ్చమూకలు ఈ దాడులకు దిగడం గమనార్హం. ముందుగా తాడిపత్రి మండలం చుక్కలూరు ఎంపీటీసీ సభ్యురాలు మేరీ ఇంటిపై దాడికి చేశారు. బూతులు తిడుతూ బెదిరింపులకు దిగారు. ఇంటి ముందు ఉన్న రెండు బైకులు, సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఆ సమయంలో ఇంటిపై నిద్రిస్తున్న ఎంపీటీసీ భర్త భాస్కర్ ప్రాణ భయంతో కిందకు దూకడంతో కాలికి గాయమైం ది. ఆయన్ను కుటుంబ సభ్యులు కర్నూలు ఆస్ప త్రికి తీసుకెళ్లారు.

Back to Top