ఎన్టీఆర్ జిల్లా: వత్సవాయి మండలం, పెంట్యాల వారి గూడెం గ్రామానికి చెందిన కౌలు రైతు తూనం రమేష్ గత రెండు రోజుల క్రితం అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు గారు స్థానిక నాయకులతో కలిసి గ్రామంలో వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించి, పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వంలో పంటకు సరైన గిట్టుబాటు ధరలు లేక మరియు రైతులకు ప్రతి సంవత్సరానికి 20వేల రూపాయలు పెట్టుబడి సహాయం ఇస్తా అన్నారు, ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడుస్తున్నా కానీ ఇంతవరకు ఆర్థిక సహాయం అందించలేదు. రైతులు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధరలు లేవు, ఎరువులు రేటు చూస్తేనే ఆకాశాన్ని అందుతున్నాయి, ఇవన్నీ పెనుభారం గా అవ్వటం కారణం చేత రైతులు దిగులు చెంది అప్పుల పాలే ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనపడుతుంది. దేశానికి అన్నం పెట్టే రైతు వెన్నెముక అంటారు నోటి మాటలే తప్ప చేతల్లో చేసింది ఏమీ లేదు. ఈ ప్రభుత్వం. కౌలు రైతులకి కౌలు కార్డులు సక్రమంగా అందించారని, ఈ సంవత్సరం మిర్చి, పత్తి వేసి రైతులు తీవ్ర అప్పులు పాలయ్యారు, రైతులకు విత్తనాలు ఎరువులు సకాలంలో అందటం లేదు. చనిపోయిన కౌలు రైతు తూనం రమేష్ గారి కుటుంబ సభ్యులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించారు. పండించిన పంట చేతికి రాక నష్టాలపాలయ్యాడు. అయినప్పటికీ ఈ ఏడాది కూడా ఏడెకరాలు కౌలుకు తీసుకుని మిర్చి, పత్తి సాగు చేపట్టాడు. వరుస నష్టా లతో సుమారు రూ.12 లక్షల వరకు అప్పుల పాలయ్యాడు. గత సోమవారం పొలం వద్ద పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రికి, మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించగా, చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. మృతుడికి భార్య, వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గూత్తా శంకర్రావు, ఎంపిపి గొలుసు రమాదేవి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మండవ శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి నంబురి రవి, జిల్లా రైతు విభాగ అధ్యక్షులు ఏలూరి శివాజీ, జిల్లా కార్యదర్శి రూప్లా నాయక్, నియోజకవర్గ రైతు విభాగ అధ్యక్షులు కనగాల రమేష్, నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షులు నర్మనేని వెంకటేష్, జగ్గయ్యపేట మండల రైతు విభాగా అధ్యక్షులు గూడపాటి శేషయ్య, వత్సవాయి మండలం రైతు విభాగ అధ్యక్షులు చిరుమామిళ్ల శ్రీనివాసరావు, జిల్లా రైతు విభాగ కార్యవర్గ సభ్యులు మోరే దుర్గాప్రసాద్, మాజీ మార్కెట్ డైరెక్టర్ బాలు వీర రాఘవ, గ్రామ సర్పంచ్ వడ్డే పరమయ్య, సీనియర్ నాయకులు కాటేపల్లి రవి, మండల యువజన విభాగ అధ్యక్షులు నగేష్, బాలు రమేష్, ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ బాజీ, గ్రామం పార్టీ అధ్యక్షులు మండి శ్రీనివాసరావు, గంగం మేరీ, తదితరులు పాల్గొన్నారు.