సంక్షేమ గృహాల్లో వ‌స‌తులు క‌రువు

అనంత‌పురం జిల్లా క‌లెక్ట‌రేట్ ఎదుట వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వ‌ర్యంలో ధ‌ర్నా

అనంతపురం:  జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ హాస్టల్లో క‌నీస సౌక‌ర్యాలు క‌రువ‌య్యాయ‌ని వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్య‌క్షుడు చంద్ర‌శేఖ‌ర్ మండిప‌డ్డారు.  సోమ‌వారం వైయ‌స్ఆర్ విద్యార్థి విభాగం ఆధ్వ‌ర్యంలో క‌లెక్ట‌రేట్ ఎదుట ధ‌ర్నా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌శేఖ‌ర్ మాట్లాడుతూ.. రాష్ట్ర‌ వ్యాప్తంగా ఉన్న హాస్టల్స్ లో ఫుడ్ నిర్వహణ సరిగాలేదని రాష్ట్రంలో సాక్షాత్తు మంత్రి తింటుండగానే వెంట్రుకలు కీటకాలు వస్తున్న పరిస్థితి నెలకొనిందని  విద్యార్థులకు ప్రస్తుత ధరలకు అనుగుణంగా అందవలసిన కాస్మోటిక్ చార్జీలు, మెస్ చార్జీలు కూటమి ప్రభుత్వం పెంచలేదని సకాలంలో వాటిని ఇవ్వకుండా తీవ్ర జాప్యం చేస్తున్నదని హాస్టల్స్ వర్కర్స్ సమస్య అధికంగా ఉన్నదని విద్యార్థుల సంఖ్యను ఆధారంగా చేసుకుని వర్కర్లను పెంచాలని, మూలిక వసతులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని కనీస సౌకర్యాలైన మరుగుదొడ్లు రిపేరు కూడా చేయించలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉన్నదని కొన్ని ప్రాంతాల్లో తలుపులు కిటికీలు లేకుండా కొన్ని వసతి గృహాలు ఉన్నాయని తద్వారా విషపూరితమైన కీటకాలు పాములు వచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయని మరమ్మత్తుల కోసం ప్రభుత్వం అతి తక్కువ నిధులు విడుదల చేస్తే అవి పెయింట్ కూడా సరిపోవడం లేదని కూటమి ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు,  
 కార్యక్రమంలో విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షులు వెంకట్ మంజునాథ్ రెడ్డి, జిల్లా కార్యదర్శి సాయి నితిన్, నగర అధ్యక్షుడు కైలాష్, నగర ప్రధాన కార్యదర్శులు పులి కార్తికేయ, రాహుల్ రెడ్డి,రఫీ,అశోక్ రాయల్,వాసిమ్ నాయకులు నరేందర్ రెడ్డి, ఇమ్రాన్, జస్వంత్, వంశీ నాయుడు,వేణు, అరవింద్, గౌస్,శేఖర్, బ్రహ్మ,మురళి,ఫయాజ్,శివ, రాజేష్, సూర్య, సాయి, అశోక్, రియాజ్,ఖాజా,వీర, సుమన్ తదితరులు పాల్గొన్నారు

Back to Top