రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు

మాజీ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ ఆగ్ర‌హం

గుడివాడలో జడ్పీ చైర్ పర్సన్ హారిక పై దాడిని ఖండిస్తూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వెలంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిరసన 

విజ‌యవాడ‌: రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంద‌ని మాజీ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గుడివాడలో జడ్పీ చైర్ పర్సన్ హారిక పై దాడిని ఖండిస్తూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వెలంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సంద‌ర్భంగా  మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ..`నిన్న గుడివాడ లో జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. టిడిపి గూండాల అరాచకం రాష్ట్రం మొత్తం చూస్తోంది. బిసి మహిళ జిల్లా జడ్పీ చైర్మన్ గా ఉండడం మీకు ఇష్టం లేదా? కూటమి నేతలు, హోం మంత్రి ఏం చేస్తున్నారు. డిప్యూటీ సిఎం పవన్ ఎక్కడికి పోయారు. కూటమి ప్రభుత్వం బిసి మహిళలకు క్షమాపణ చెప్పాలి. దాడిలో పాల్గొన్న ప్రతి ఒక్కరిపై హత్యానేరం కింద కేసు పెట్టాలి. హోం మంత్రి గా అనిత ఇవాళ ఉన్నారంటే వైయ‌స్ జగన్ దయ వలనే. మహిళల పైన దాడి చేయడం అంటే సుపరిపాలన చేయడమా?  చంద్రబాబు, పవన్, కూటమి నేతలు తక్షణమే క్షమాపణ చెప్పాలి. కూటమి నాయకులకు పోలీసులు అండగా మారారు. ఎపి లో పోలీస్ వ్యవస్ధ విఫలమైంది. పోలీసులు కూటమికి అనుకూలంగా మారడం వలన విధ్వంస పాలన నడుస్తోంది.  పోలీసులు తీరు మార్చుకోకుంటే రాబోయే రోజుల్లో ఇబ్బందుల పాలుగాక తప్పదు. 

మేయర్ రాయన భాగ్యలక్ష్మి కామెంట్స్‌..

  •  బిసి మహిళకు కూటమి నాయకులు క్షమాపణ చెప్పాలి..
  •  మహిళలకు జగన్ ప్రభుత్వంలో అధిక ప్రాధాన్యతనిచ్చారు..
  •  ఇళ్లల్లోంచి బయటకు రాకుండా చేయాలనే ఉప్పల హారిక పై దాడికి పాల్పడ్డారు..
  •  జడ్పీ చైర్ పర్సన్ కే రక్షణ లేదు..
  •  ఇక సామాన్య మహిళలకు ఏం రక్షణ ఉంటుంది..
Back to Top