లారీ ప్రమాదంపై వైయ‌స్‌ జగన్‌ దిగ్భ్రాంతి 

మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి 

గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలి

తాడేప‌ల్లి: ఉమ్మడి వైయ‌స్ఆర్‌ జిల్లాలోని పుల్లంపేట మండలం రెడ్డిపల్లి చెరువు కట్టపై ఆదివారం రాత్రి మామిడి కాయల లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా పడిన ఘటనపై వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో సెట్టిగుంట ఎస్టీ కాలనీకి చెందిన తొమ్మిది మంది చనిపోవడం, 13 మంది తీవ్రంగా గాయ పడటం అత్యంత బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వీరంతా నిరుపేదలని, మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించడంతో పాటు వారిని కూడా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వైయ‌స్ జ‌గ‌న్‌ కోరారు. 

Back to Top