మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పేదల ఆరోగ్యంపై గొడ్డలి పెట్టు

కూటమి ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంతవరకు పోరాటం 

ప్రభుత్వాన్ని హెచ్చిరించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్. 

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను పరిశీలించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి మత్యాలనాయుడు, మాజీ ఎమ్మెల్యేలు పెట్ల ఉమాశంకర్ గణేష్, చింతలపూడి వెంకట్రామయ్యలు.  

మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ నిర్ణయం అత్యంత దారుణం

పేదలకు ఉచిత వైద్యం, విద్య అందకుండా కూటమి కుట్ర

15 నెలల్లో రూ.1.95 లక్షల కోట్లు అప్పు చేసిన కూటమి ప్రభుత్వం

మెడికల్ కాలేజీల కోసం కేవలం రూ.5వేల కోట్లు ఖర్చు చేయలేరా ?

చంద్రబాబును సూటిగా నిలదీసిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్

నీ హయాంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టలేదు

పేదలకు మేలు చేసే ఒక్క పథకమూ లేదు

వేరొకరి పనికి క్రెడిట్ తీసుకోవడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య

పేదలకు మేలు చేయడానికి మీకు మనసు రాదు

అప్పగనంగా అయినారికి భూపందేరం

ఎకరా రూ.99 పైసలకే కేటాయిస్తారు

రూ.10 కోట్ల భూమి రూ.50 లక్షలకే అప్పగిస్తారు

ఇది మీ అయ్య జాగీరా  ?

అడ్డగోలు భూకేటాయింపులపై ఆగ్రహం వ్యక్తం చేసిన అమర్నాధ్

అనకాపల్లి: గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో నిర్మాణం మొదలుపెట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రయివేటీకరణ చేయాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పీపీపీ విధానంలో 10 వైద్య కళాశాలను ప్రయివేటీకరణ చేయాలన్న నిర్ణయం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంతవరకు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నేతృత్వంలో కలిసివచ్చే ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలతో వైయస్ఆర్‌సీపీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. వైయస్ఆర్‌సీపీ హయాంలో నిర్మాణం ప్రారంభమైన అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మెడికల్ కాలేజీని వైయస్ఆర్‌సీపీ నేతలతో కలిసి ఇవాళ పరిశీలంచిన అమర్నాద్ అనంతరం మీడియాతో మాట్లాడారు.  ఇన్నేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు తన హయాంలో కనీసం ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణం ఎందుకు చేపట్టలేదని అమర్  నిలదీశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

● వైద్యరంగంలో సంస్కరణలు - వైయస్ఆర్‌, వైయ‌స్ జగన్ హయాంలోనే... 

రాష్ట్రం లోని ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మాణాలు పూర్తిచేసుకుని కొన్ని, ప్రారంభానికి సిద్ధంగా ఉన్న మరికొన్ని కాలేజీలను కూటమి ప్రభుత్వం  పీపీపీ విధానంలో ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో పెట్టాలని నిర్ణయించడం అత్యంత దుర్మార్గం. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పేదలకు నాణ్యమైన ఉచిత విద్య అందకుండా పోయే ప్రమాదం ఉంది. ఈనేపథ్యంలో ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగంలో ప్రజలకు చేస్తున్న అన్యాయాల మీద మా పార్టీ అధ్యక్షుడు జగన్మోన్ రెడ్డి ఇప్పటికే ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.  వాస్తవానికి వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటప్పటికి మన రాష్ట్రంలో కేవలం 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ప్రభుత్వ రంగంలో ఉండగా... వైయస్ఆర్‌సీపీ హయాంలో 26 జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ప్రతి జిల్లాకు కనీసం ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రూ.8,500 కోట్లతో మెడికల్ కాలేజీల నిర్మాణంతో పాటు ప్రతి మెడికల్ కాలేజీకి అనుసంధానంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కూడా నిర్మించాలని ఒక్కో మెడికల్ కాలేజీ కోసం సుమారు రూ.500 కోట్లు వెచ్చించాలని నిర్ణయించింది. 

● మా హయాంలో చురుగ్గా మెడికల్ కాలేజీ పనులు...

మా ప్రభుత్వ హయాంలోనే విజయనగరం, మచిలీపట్నంతో సహా 5 మెడికల్ కాలేజీలను ప్రారంభించాం. తరగతులు కూడా నడుస్తున్నాయి. ఒక్కో మెడికల్ కాలేజీలో 150 చొప్పున 750 మెడికల్ సీట్లు పేద విద్యార్ధులకు అందుబాటులోకి వచ్చాయి. మెడిసిన్ లాంటి ఉన్నత విద్య పేదలకు కూడా అందుబాటులోకి తీసుకురావడం పాటు వాటికి అనుసంధానంగా ఉన్న ఆసుపత్రుల ద్వారా పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలన్న లక్ష్యంతోనే వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఈ కాలేజీలు ఏర్పాటు చేశారు. గతంలో దివంగత నేత వైయస్సార్ పేద పిల్లలకు ఉచిత విద్యను అందించాలన్న లక్ష్యంతో ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం ప్రవేశపెట్టారు. తద్వారా వేలాదిమంది పేద పిల్లలకు ఇంజనీరింగ్ వంటి ఉన్నత విద్య ఉచితంగా సాకారమైంది. అదే తరహాలో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కూడా మెడిసిన్ లాంటి ఖరీదైన విద్యను పేదలకు అందుబాటులోకి తీసుకురావాలన్న తరహాలోనే వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రభుత్వ రంగంలో ఏకంగా 18 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కేవలం 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండగా.... 2019 కంటే ముందు మూడు దఫాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబునాయుడుకి తన హయాంలో ప్రభుత్వరంగంలో ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఎందుకు రాలేదు ? పేద పిల్లలకు వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచన ఎందుకు చేయలేదు?  ఇవాళ వైద్య విద్య కోసం రష్యా, చైనా వంటి దేశాలకు అధిక మొత్తాలను వెచ్చించి వెళ్తున్న పరిస్థితుల్లో... వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఏకంగా 18 మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటి నిర్మాణం కోసం నాబార్డు వంటి సంస్థల సహకారంతో ఫండింగ్ కూడా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హయాంలోనే ఏర్పాటు చేశారు. ప్రస్తుత ప్రభుత్వానికి ఆ మెడికల్ కాలేజీల నిర్మాణానికి నిధుల సమస్య లేకుండా చేసినా.. కూడా ప్రయివేటు రంగంపై మొగ్గుచూపే చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీలను ప్రయివేటీకరణ చేయాలన్న నిర్ణయం తీసుకోవడం దారుణం. 

● మీ పేరు చెప్తే గుర్తొచ్చే ఒక్క పథకమన్నా ఉందా చంద్రబాబూ ?

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 30 డిసెంబరు 2022లో  ముఖ్యమంత్రిగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఈ ప్రాంత ప్రజలకు అత్యాధుని వైద్యం అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో మెడికల్ కాలేజీ పనులకు శంకుస్థాపన చేశారు.  మెడికల్ కాలేజీ మూడు అంతస్థులు, ఆసుపత్రి రెండు అంతస్థులు నిర్మాణం పూర్తి చేసుకోగా.. హాస్టల్ భవనాలు నిర్మాణంలో ఉండగా... ఎందుకు ఈ కాలేజీ నిర్మాణాన్ని ప్రభుత్వం పూర్చి చేయడం లేదు?  పేదలంటే ఎందుకంటే చిన్నచూపు చంద్రబాబూ?  వాళ్లు ఉన్నతమైన మెడికల్ విద్యకు అనర్హులా? మీ ఉద్దేశ్యంలో సీఎం అంటే మీరు బయటకు చెబుతున్న కామన్ మ్యాన్ కాదు, మీరు కేపిటలిస్ట్ మ్యాన్. మీరు క్యాప్టలిస్టులు, కార్పొరేట్ వ్యక్తులకే వత్తాసు పలుకుతారు.  మీ మొత్తం రాజకీయ జీవితంలో మీ పేరు చెప్పగానే గుర్తుకు పేదలకు మేలు చేసే ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ లాంటి  ఒక్క పథకం పేరు చెప్పగలరా చంద్రబాబూ? 

● వేరొకరి పనికి క్రెడిట్ తీసుకోవడం బాబు నైజం.

 2014 లో అమరావతి నిర్మాణం కోసం మీ ప్రభుత్వ హయాంలో అంచనా వ్యయం రూ.1.09 లక్షల కోట్లు కాగా... 2019లో మీరు అధికారంలో నుంచి దిగిపోయేటప్పటికి మీరు చేసిన ఖర్చు కేవలం 4 శాతం అంటే రూ.4-5 వేల కోట్లు మాత్రమే. ఇవాళ మీరు దానిమీద ఎంత పెట్టుబడి పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నారు. మీరు డబ్బులు సంపాదించుకోవడానికి, మీ కార్పొరేట్ వ్యవహారాల కోసం మాత్రం ఎంత డబ్బు ఖర్చుపెట్టడానికైనా సిద్ధంగా ఉంటారు కానీ.. పేదలకు మేలు చేసే వైద్య విద్య కోసం మాత్రం కనీసం రూ.8,500 కోట్లు ఖర్చు పెట్టడానికి మాత్రం మీకు మనసు రాదు. 15 నెలల కూటమి ప్రభుత్వం రూ.1.95 లక్షల కోట్లు అప్పు చేసింది. అందులో రూ.5వేల కోట్లు ఖర్చు చేస్తే అన్ని మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తవుతుంది. 2024 లో మా ప్రభుత్వ హయాలంలోనే  పులివెందుల మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తయింది. మెడికల్ అసెస్ మెంట్ అండ్ రేటింగ్ బోర్డు అనే సంస్థ అనుమతిలు ఇచ్చే ముందు కాలేజీ వసతులు, భూమి లభ్యత, ఇతర సౌకర్యాలు వంటి అంశాలపై తనిఖీ చేసి... లెటర్ ఆఫ్ పర్మిషన్ కూడా జారీ చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అత్యంత అన్యాయంగా పులివెందులలో మాకు మెడికల్ సీట్లు అవసరం లేదు మీరిచ్చిన అనుమతలు వెనక్కి తీసుకోవాలని లేఖ రాసింది. ఇది ప్రభుత్వమా ?  వీళ్లు ప్రజా సంక్షేమం కోసం పనిచేసే నాయకులా? ఇంత చేసి నిన్నటి అనంతపురం సభలో మెడికల్ కాలేజీలు నేనే తీసుకొచ్చానని చెప్పుకుంటున్నావు. ఎవరో చేసిన పనికి మీరు క్రెడిట్ తీసుకోవడం మీకు మొదట నుంచీ అలవాటు.  

● అయిన వారికి కారుచౌకగా భూపందేరం...

అమరావతితో పాటు విశాఖపట్నం, కర్నూలు లాంటి వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చేయాలని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అంటే అమరావతి రాజధాని తొలగించారంటూ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని సైకో అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడారు. మరి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హయాంలో ప్రారంభమైన మెడికల్ కాలేజీలను ప్రయివేటీకరణ చేస్తున్న మిమ్నల్ని ఏమనాలి ? అంతకంటే నీచమైనది మీరు, మీ పేరే కనిపిస్తున్నాయి. ఇక మీ కుమారుడు గురించి చెప్పాల్సిన అవసరమే లేదు... ఉత్తర కొరియా తరహాలో ఆంధ్రాలో నియంతృత్వ పరిపాలన సాగిస్తున్న లోకేష్ ఆంధ్రా కిమ్.. వైయస్ఆర్‌సీపీ నేతలను ఎవరిని అక్రమంగా అరెస్టు చేయాలి? , ఎవరిపై తప్పుడు కేసులు బనాయించాలి? అని కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు ఆయన అజెండాగా మారింది. వీటికి తోడు 99 పైసలకే ఎకరా భూమి కట్టబెడతారు? ప్రభుత్వ రంగంలో ఉన్న వైద్య కళాశాలను ప్రయివేటు వ్యక్తులకు అప్పగిస్తారు ? ఆర్టీసీ భూములను లూలూ లాంటిసంస్ధలు చౌకగా కట్టబెడతారు, ఎకరా రూ.10 కోట్ల ఖరీదు చేసే భూములను కేవలం రూ.50 లక్షలకే అప్పగిస్తారు,  ప్రభుత్వ భూములంటే  మీ అబ్బ జాగీరా? రాష్ట్ర ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి నుంచి కిందస్ధాయి ప్రజాప్రతినిధి వరకు ప్రభుత్వ, ప్రజల ఆస్తులకు మీరు కస్టోడియన్ లే తప్ప, మీకు జీపీఏ రాసివ్వలేదు. మీకు నచ్చిన వ్యక్తులకు కట్టబెట్టడానికో, మీరు స్కామ్ లు చేయడానికో, పేదల పొట్ట కొట్టడానికో మీకు ప్రజలు అధికారం అప్పగించలేదు. ఇంత దారుణాలు చేసి సూపర్ హిట్ అని చెప్పుకుంటున్నారు. మీ అన్యాయమైన, అరాచకమైన పరిపాలనలో పేదవాడికి రాష్ట్రంలో చోటు లేకుండా పోతుంది.
మీరిచ్చిన రెండు, మూడు స్కీమ్ లలో ఒక్కటీ మీ సొంత ఆలోచన కాదు. మీరిచ్చిన తల్లికి వందనం, రేపు ఇస్తామంటున్న ఆటోడ్రైవర్లకు సాయం ఏ ఒక్కటీ మీ సొంత ఆలోచన కాదు. ఇక ఇప్పటికే రైతులు ఇచ్చామని చెప్పుకుంటున్న మీరు ఒక్కో రైతుకు రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చి 2024-25 ఎగరగొట్టారు. గతేడాది రూ.20వేలు, ఈ ఏడాదిలో   రూ.5వేలు ఇచ్చినది మినహాయిస్తే మరో రూ.15 వేలు కలిపి మొత్తం రూ.35 వేలు అన్నదాతలకు ఈ ప్రభుత్వం బాకీ పడింది. రైతులకు యూరియా లేదు అంటే సమాధానం చెప్పడు కానీ.. నిరంతరం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పడి ఏడవడం మినహా ఈ ప్రభుత్వానికి మరో ప్రాధాన్యత లేదు.

● ప్రైవేటీకరణ ఆపేవరకు పోరాటం...

ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై మీరు ఏ నిర్ణయం తీసుకున్నా... ఏ ప్రయివేటు వ్యక్తులు ఆ మెడికల్ కాలేజీలను తీసుకున్నా వాటిని రద్దు చేస్తాం. ఈ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధీనంలో పేదలకు అందుబాటులో ఉండాల్సిన కార్యక్రమం చేస్తాం. అంతవరకు ప్రభుత్వం చేస్తున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పై ఉద్యమం చేస్తాం. మా పార్టీ అధ్యక్షుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిఆదేశాల మేరకు... ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ప్రజలు, కలిసివచ్చే రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలను కలుపుకుని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్యాచరణ రూపొందిస్తామని అమర్నాథ్ స్పష్టం చేశారు.

Back to Top