తుర‌క‌పాలెంలో ద‌ళితులకు మంచినీరూ క‌రువే

ఎస్సీ కాల‌నీకి సుర‌క్షిత నీటి స‌ర‌ఫ‌రాలోనూ ప్ర‌భుత్వం వివ‌క్ష 

వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుల బృందం స్ప‌ష్టీక‌ర‌ణ  

మృతుల కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించిన అనంత‌రం తుర‌క‌పాలెం గ్రామంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి డాక్ట‌ర్ సీదిరి అప్ప‌ల‌రాజు, మాజీ ఎమ్మెల్యే మొండితోక జ‌గ‌న్‌ మోహ‌న్‌ రావు 

ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం కార‌ణంగానే గ్రామంలో వ‌రుస మ‌ర‌ణాలు 

ఎందుకు మ‌ర‌ణిస్తున్నారో ప్ర‌భుత్వం చెప్ప‌డానికి భ‌య‌ప‌డుతోంది

అలా చెబితే ఎస్సీ కాల‌నీకి క‌లుషిత నీరు స‌ర‌ఫ‌రా చేస్తున్న విష‌యం ప్ర‌పంచానికి తెలుస్తుంద‌ని వారి భ‌యం 

కలుషిత నీటి స‌ర‌ఫ‌రా పై పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాన్ స్పందించాలి

త‌క్ష‌ణం తుర‌క‌పాలెం గ్రామాన్ని సంద‌ర్శించి మృతుల కుటుంబాల‌ను ఆదుకోవాలి 

వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు డిమాండ్ 

గుంటూరు రూర‌ల్‌ (తుర‌క‌పాలెం):   గ‌త రెండు నెల‌లుగా తురక‌పాలెం గ్రామంలో అంతుచిక్క‌ని వ్యాధితో చోటుచేసుకుంటున్న వ‌రుస మ‌ర‌ణాల నేప‌థ్యంలో వైయ‌స్సార్ కాంగ్రెస్‌ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గారి ఆదేశాల మేర‌కు గుంటూరు రూర‌ల్ మండ‌లం తుర‌క‌పాలెం గ్రామంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుల బృందం మ‌రోసారి ప‌ర్య‌టించింది. మాజీ మంత్రి డాక్ట‌ర్ సీదిరి అప్ప‌ల‌రాజు, మాజీ ఎమ్మెల్యే డాక్ట‌ర్‌ మొండితోక జ‌గ‌న్‌మోహ‌న్‌రావు, డాక్ట‌ర్ గ‌జ్జ‌ల నాగ‌భూష‌ణం రెడ్డి త‌దిత‌రులు మ‌రికొంత‌మంది స్థానిక వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుల‌తో క‌లిసి గ్రామంలో పర్య‌టించి మృతుల కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించి వారితో మాట్లాడారు. అనంత‌రం వారు అక్క‌డే ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో వారు మాట్లాడుతూ తుర‌క‌పాలెం గ్రామంలో ఎస్సీ కాల‌నీకి మంచినీటి స‌ర‌ఫ‌రాలోనూ కూట‌మి ప్ర‌భుత్వం వివ‌క్ష చూపుతోంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వైద్యారోగ్య‌, పంచాయ‌తీ రాజ్‌ శాఖ‌లు ఫెయిల్ అయ్యాయ‌ని, గ్రామంలో రెండు నెల‌లుగా 45 మంది క‌లుషిత నీటి కార‌ణంగా మృత్యువాత ప‌డినా వారి కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించ‌డానికి కూడా మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాన్‌కి స‌మ‌యం లేదా అని వారు ప్ర‌శ్నించారు. త‌క్ష‌ణం ప‌వ‌న్ క‌ళ్యాన్ తుర‌క‌పాలెం గ్రామంలో పర్య‌టించి ఎస్సీ కాల‌నీకి సుర‌క్షిత మంచినీటిని ఉచితంగా స‌ర‌ఫ‌రా చేయ‌డంతో పాటు మృతుల కుటుంబాల‌ను ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఆదుకోవాల‌ని డిమాండ్ చేశారు. భ‌విష్య‌త్తులోనూ తుర‌క‌పాలెం గ్రామంలో దుష్ప్ర‌భావాలు రాకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరారు. 
వారు ఇంకా ఏమ‌న్నారంటే...  

మృతుల్లో 18 మంది ద‌ళితులే : మాజీ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు
గ్రామంలో ఏర్పాటు చేసిన ప్ర‌భుత్వ మెడిక‌ల్ క్యాంపును ఈ రోజుతో తీసేయాల‌ని నిర్ణ‌యించ‌డంతో గ్రామ‌స్తుల్లో భ‌యాందోళ‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి. దీంతో ఆ మెడిక‌ల్ క్యాంపును సంద‌ర్శించి డాక్ట‌ర్ల‌తో మాట్లాడారు. జ్వ‌రంతో మొద‌లై ఒళ్లు నొప్పులు, కండ‌రాలు నొప్పులు, ఆ త‌ర్వాత మ‌ల్టీ ఆర్గాన్‌ ఫెయిల్యూర్‌తో ఇప్ప‌టికే 45 మందికి పైగా మ‌ర‌ణించారు. చ‌నిపోయిన వారిలో 18 మంది ద‌ళిత కుటుంబాల‌కు చెందిన వారే ఉండటం అంద‌ర్నీ విస్మ‌యానికి గురిచేస్తోంది. క్వారీ వ్య‌ర్థాల‌తో నిండిన సంజీవ‌రావు కుంట లోని నీటిని ఓవ‌ర్‌ హెడ్ ట్యాంకుకి ఎక్కించి అక్క‌డ్నుంచి ద‌ళిత కాల‌నీకి స‌ర‌ఫ‌రా చేస్తున్నారని మృతుల కుటుంబాలు చెబుతున్నాయి. ఆ కలుషిత నీటి కార‌ణంగానే వ‌రుస మ‌ర‌ణాలు సంభ‌వించినా ప్ర‌భుత్వంలో చ‌ల‌నం రాలేదు. గ్రామ‌స్తుల నుంచి 1500 శాంపిల్స్ తీస్తే 300 మందిలో లివ‌ర్ ఫెయిల్యూర్ ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. అందులో నిజానిజాలేంటో ప్ర‌భుత్వమే తెలియ‌జేయాలి. 

చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల మీద అట్రాసిటీ కేసు పెట్టాలి

స్వాతంత్ర్యం వ‌చ్చిన నాటి నుంచి రాష్ట్రంలో 84 ల‌క్ష‌ల ట్యాప్ క‌నెక్షన్లు ఉంటే వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలోనే ఐదేళ్ల‌లో 45 ల‌క్ష‌ల ట్యాప్ కనెక్ష‌న్లు ఇవ్వ‌డం జ‌రిగింది. కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన 15 నెల‌ల్లో ఎన్ని ట్యాప్ క‌నెక్ష‌న్లు ఇచ్చారో పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌మాధానం చెప్పాలి. ఇవ‌న్నీ ప్ర‌భుత్వం సృష్టించిన మార‌ణ‌హోమం. ద‌ళిత కాల‌నీల‌పై ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం కార‌ణంగానే ఈ ఆక‌స్మిక మ‌ర‌ణాలు సంభ‌వించాయి. ఎందుకు చ‌నిపోతున్నామో కూడా తెలియ‌కుండానే ప్రాణాలు పోతుంటే ఇంత‌క‌న్నా దారుణం ఏముంటుంది? కోవిడ్ లాంటి విపత్కర ప‌రిస్థితుల్లో చంద్ర‌బాబు సీఎంగా ఉండుంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్ అనే ఒక రాష్ట్రం ఉండేది అని మాట్లాడుకోవాల్సి వ‌చ్చేదేమో. విజ‌య‌వాడ కార్పొరేష‌న్ ప‌రిధిలో డ‌యేరియాతో దాదాపు 200 మంది విరేచ‌నాల‌తో అల్లాడిపోతున్నారు. ద‌ళిత కాల‌నీలో మంచినీటి స‌మ‌స్య ఉంద‌ని గ్రామ‌స్తులు క‌లెక్ట‌ర్‌కి ఫిర్యాదు చేసినా పట్టించుకున్న‌ పాపాన పోలేదు. దీన్ని వివ‌క్ష కాక ఇంకేమ‌నాలి? ద‌ళిత కాల‌నీల మీద ప్ర‌భుత్వం చూపుతున్న వివ‌క్ష‌కి సీఎం చంద్ర‌బాబు, పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ప‌వ‌న్ కళ్యాన్ మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలి. వైద్యారోగ్య శాఖ మంత్రికి సేల్స్ మీదున్న శ్ర‌ద్ద, ప్ర‌జ‌ల సేఫ్టీ మీద లేదు. మెడిక‌ల్ కాలేజీలు అమ్ముకోవ‌డం పైనే ఆ దృష్టంతా ఉంది. వ‌ర్షాకాలం వ‌స్తున్న నేప‌థ్యంలో పంచాయ‌తీ రాజ్, వైద్యారోగ్య‌శాఖ‌లు స‌మ‌న్వ‌యంతో గ్రామాల్లో పారిశుద్ధ్య ప‌రిస్థితుల‌పై దృష్టిసారించాలి. సీజ‌న‌ల్ వ్యాధులు ప్ర‌బ‌ల‌కుండా చూసుకోవాలి. కానీ ఈ రెండు శాఖ‌లు నిద్ర‌మ‌త్తులోనే ఉన్నాయి. గ్రామాల‌కు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వ‌డం లేదు. తుర‌క‌పాలంలో 45 మంది చనిపోయినా ద‌ళితుల క‌ష్టాలు చూడ‌టానికి మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి టైం లేదా?  వైయ‌స్ జ‌గ‌న్ సీఎంగా ఉన్న‌ప్పుడు కార్ టాప్ మీద ప్ర‌యాణించి హైద‌రాబాద్ నుంచి వ‌చ్చిన ప‌వ‌న్ క‌ళ్యాన్ కి, చంద్ర‌బాబు సీఎంగా ఉంటే విజ‌య‌వాడ నుంచి రావ‌డానికి కూడా టైం స‌రిపోవ‌డం లేదా?  హెలిక్యాప్ట‌ర్‌ల‌కు ప‌ర్మిష‌న్ దొర‌క‌డం లేదా? వైయ‌స్ఆర్‌సీపీహ‌యాంలో మాదిరిగా విలేజ్ క్లీనిక్‌లు, ఫ్యామిలీ డాక్ట‌ర్లు ఉంటే ఈ ప‌రిస్థితి వ‌చ్చేదా? కూటమి ప్ర‌భుత్వం వ‌చ్చాక వైద్య‌రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఆర్ఎంపీ మీద నెపాన్ని నెట్టి ప్ర‌భుత్వం త‌ప్పించుకోవాల‌ని చూడ‌టం సిగ్గుచేటు. ఈ ప్ర‌భుత్వం ఇప్పటికైనా క‌ళ్లు తెరిచి శాస్త్రీయ‌మైన విధానంలో నిజాయితీగా ప‌నిచేయాలి. పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ప‌వ‌న్ కళ్యాన్ త‌క్ష‌ణం గ్రామాన్ని సంద‌ర్శించాలి. మృతుల కుటుంబాల‌కు ప్ర‌భుత్వం రూ.5 ల‌క్ష‌ల చొప్పున ప‌రిహారం చెల్లించాలి. 

Image

నీటి స‌ర‌ఫ‌రాలోనూ దళితుల‌పై వివ‌క్ష‌

మాజీ ఎమ్మెల్యే డాక్ట‌ర్ జ‌గ‌న్‌మోహ‌న్‌రావు 
గ‌తంలో వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో బోర్ల ద్వారా నీటిని స‌ర‌ఫ‌రా చేస్తే, కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక ఎస్సీ కాల‌నీకి క్వారీ గుంట‌లోని నీటిని స‌ర‌ఫరా చేస్తోంద‌ని, ఆ క‌లుషిత నీటిని తాగ‌డం వ‌ల్లే ఇన్ఫెక్ష‌న్ కార‌ణంగా మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయ‌ని బాధిత కుటుంబాల‌తో మాట్లాడితే తెలుస్తోంది. వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలో ఇంజ‌నీరింగ్ అసిస్టెంట్ల వ‌ద్ద వాట‌ర్ టెస్టింగ్ కిట్లు ఇచ్చి ఏడు ర‌కాల టెస్టులు చేసి సుర‌క్షిత మంచినీటిని మాత్ర‌మే స‌ర‌ఫ‌రా చేసేవాళ్లం. ఊర్లో వారికి సుర‌క్షిత మంచినీటిని స‌ర‌ఫ‌రా చేస్తూ ఎస్సీ కాల‌నీకి మాత్రం క్వారీ నుంచి నీటిని స‌ర‌ఫ‌రా చేస్తున్నార‌ని దళితులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఆఖ‌రుకి మంచినీటి స‌ర‌ఫ‌రా విష‌యంలోనూ ఈ ప్ర‌భుత్వం ద‌ళితుల మీద వివ‌క్ష చూపిస్తోంది. స్వాతంత్ర్యం వ‌చ్చిన‌ 70 ఏళ్ల త‌ర్వాత కూడా ద‌ళిత కుటుంబాలు మంచినీటి కోసం అడుక్కోవాల్సిన ప‌రిస్థితులు ఉన్నాయంటే ఇంత‌క‌న్నా దారుణం ఇంకోటి ఉంటుందా?  మూడు నెల‌లుగా వ‌రుస మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నా ఫ‌లానా కార‌ణంతో చ‌నిపోతున్నార‌ని ఈ ప్ర‌భుత్వం చెప్ప‌లేక‌పోతోంది. మ‌ర‌ణాల‌కు కార‌ణాలు చెబితే ద‌ళిత కాల‌నీకి క‌లుషిత నీటిని స‌ర‌ఫరా చేస్తున్న అంశం ప్ర‌చారంలోకి వ‌స్తుంద‌నే భ‌యంతోనే ప్ర‌భుత్వం ఆ విష‌యం చెప్ప‌లేక‌పోతుంది. కనీసం మృతుల కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించ‌డం కానీ, వారికి ప‌రిహారం ఇవ్వ‌డం కానీ ప్ర‌భుత్వం చేయ‌డం లేదు. ఇప్ప‌టికైనా తుర‌క‌పాలెం ఎస్సీ కాల‌నీకి సుర‌క్షిత మంచినీటిని స‌ర‌ఫ‌రా చేయాలి. మృతుల కుటుంబాల‌ను ప్ర‌భుత్వం ప‌రిహారం ఇచ్చి ఆదుకోవాలి. రాబోయే రోజుల్లోనూ దుష్ప్ర‌భావాలు క‌న‌ప‌డ‌కుండా ఉండాలంటే ఈ గ్రామంపై ప్ర‌త్యేకంగా దృష్టిసారించాలి. ప్ర‌భుత్వం త‌ర‌ఫున ప‌రిహారం ఇప్పించ‌కుండా చందాలు వేసుకుని ఆదుకుంటామ‌ని ఎమ్మెల్యే చెప్ప‌డం చూస్తుంటే దళితులంటే ఈ ప్ర‌భుత్వానికి ఎంత చిన్న‌చూపో తెలిసిపోతుంది.

Image

Back to Top