నగరి: వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను చూపించడానికి సిద్దంగా ఉన్నానని, కూటమి ప్రభుత్వంలోని మంత్రులకు దమ్ముంటే తనతో వాటిని పరిశీలించేందుకు రావాలని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మంత్రి ఆర్కె రోజా సవాల్ విసిరారు. నగరిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ... పేద విద్యార్ధులకు మెడికల్ విద్యను, పేదలకు మెరుగైన వైద్యంను అందించాలనే గొప్ప సంకల్పంతో సీఎంగా వైయస్ జగన్ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకువస్తే, నేడు చంద్రబాబు వాటిని తనకు కావాల్సిన వారికి తెగనమ్మేందుకు సిద్దపడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వైయస్ జగన్ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, సమాధానం చెప్పలేక కూటమి మంత్రులతో ఆయనపై దూషణలకు తెగబడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజల నమ్మకాన్ని అమ్ముకుంటున్న దౌర్భాగ్యపు ప్రభుత్వమిదని అన్నారు. ఇంకా ఆమె ఏమన్నారంటే... రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసే కుట్ర జరుగుతోంది. నాలుగుసార్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఏనాడైనా తన హాయంలో ప్రభుత్వ హయాంలో మెడికల్ కాలేజీలను నిర్మించాలనే ఆలోచన చేశారా? తొలిసారి సీఎం అయిన వైయస్ జగన్ గారు పేదల వైద్య విద్య కలను సాకారం చేయడంతో పాటు, పేదలకు మెరుగైన సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఏకంగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వైయస్ జగన్ గారి హయాంలో ఏడు కాలేజీల నిర్మాణం పూర్తయ్యింది. వాటిల్లో గత ఏడాదితో కలిపి ఆరు కాలేజీల్లో ఇప్పటికే మెడికల్ విద్య ప్రారంభమయ్యింది. పులివెందుల మెడికల్ కాలేజీ ప్రారంభానికి సిద్దంగా ఉన్నా కూడా దానిని అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసిందో ప్రజలందరికీ తెలుసు. అసంపూర్తిగా ఉన్న మిగిలిన పది మెడికల్ కాలేజీలను పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నెలకు కనీసం రూ.100 కోట్ల చొప్పున కూడా కేటాయించకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ప్రభుత్వ రంగంలో ప్రారంభించాల్సిన మెడికల్ కాలేజీలను తనకు కావాల్సిన వారికి దారాదత్తం చేసేందుకు సీఎం చంద్రబాబు తెగబడ్డారు. భవిష్యత్తులో రూ.లక్షల కోట్ల విలువ చేసే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులతో సహా పప్పూబెల్లాల్లా చంద్రబాబు తన బినామీలకు కట్టబెడుతుంటే, ప్రతిపక్ష నేతగా వైయస్ జగన్ గారు దానిని ప్రశ్నించారు. ఆయన ప్రశ్నలకు సమాధాన చెప్పాల్సిన సీఎం చంద్రబాబు బదులివ్వకుండా, తన మంత్రులను రెచ్చగొట్టి, వైయస్ జగన్ గారిపై దూషణలకు ప్రోత్సహిస్తున్నారు. 'బాబు' హయాంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ అయినా నిర్మించారా? తాజాగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై హోంమంత్రి అనిత ఇచ్చిన ప్రజంటేషన్ చూస్తే, ఆమెకు ఉన్న ఫ్రష్టేషన్ కనిపిస్తోంది. మీడియా సమావేశంలో ఆమె ప్రదర్శించిన ఫోటోలు, వీడియోలను పరిశీలిస్తే, అవ్వన్నీ కూటమి ప్రభుత్వం తయారు చేయించిన ఫేక్ వీడియోలు, ఫోటోలు అని అర్థమవుతోంది. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులు, అఘాయిత్యలను ఆపేందుకు తీసుకున్న చర్యలపై ఏనాడు ఆమె ఒక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వలేదు. రాష్ట్రంలో శాంతిభద్రతలను ఎలా కాపాడుతుందో ఇలాంటి ప్రజెంటేషన్ ఏనాడు చేయలేదు. కేవలం చంద్రబాబు ప్రయోజనాలను కాపాడటానికే ఆమె ముందుకు వచ్చింది ఈ రోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసే విషయాన్ని సమర్థించుకునేందుకు తంటాలు పడుతున్నారు. సీఎం వైయస్ జగన్‌కు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిర్మించడం చేతకాలేదు, అదే చంద్రబాబు హయాంలో ఈ రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకువచ్చారు, ఎన్నింటిని నిర్మించారో హోంమంత్రి అనిత తన ప్రజెంటేషన్ లో అద్భుతంగా వివరిస్తారని ప్రజలంతా ఎదురుచూశారు. కానీ ఆమె చెప్పిన దానిలోనే నాలుగుసార్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీని కూడా నిర్మించలేదు, కనీసం అలా ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మించాలనే ఆలోచనే చేయలేదని స్పష్టంగా తేలిపోయింది. పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు అని హోమంత్రి అనిత చెబుతోంది. అంటే పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాకపోతే, రౌడీషీటర్లకు ఇచ్చే పెరోలా? అనిత సమాధానం చెప్పాలి. పీపీపీ కానప్పుడు, డబ్బులు లేక ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఇస్తున్నామని ఎందుకు జీఓ ఇచ్చారు? అనిత చెప్పేదే నిజమైతే ఆ జీఓను రద్దు చేయాలి. ఏఐజీలో ప్రతి 15 రోజులకు ఒకసారి మందులు వాడేది ఎవరో అనిత చెప్పాలి వైయస్ జగన్ లండన్ మందులు వేసుకోకపోవడం వల్ల పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారంటున్న హోమంత్రి అనిత ఒకసారి హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వెళ్ళి ఎవరు మందులు వేసుకుంటున్నారో తెలుసుకోవాలి. అబద్దాలను కళ్లార్పకుండా ఎలా చెప్పాలో అనే దానికి మందులు కనిపెట్టి, మంత్రులందరికీ చంద్రబాబు ఇస్తున్నాడు. ఆ మందులు వాడుతూ మీరు కూడా చంద్రబాబులా అబద్దాలు వల్లె వేస్తున్నారు. మంత్రులకు దమ్మంటే రాజమండ్రి, విజయనగరం, మచిలీపట్నం, నంధ్యాల, పాడేరు మెడికల్ కాలేజీలక వస్తారా? మెడికల్ కాలేజీలు ఎంటే ఎలా ఉంటాయి? ఎలా కట్టాలో ఈ మంత్రులకు చూపించడానికి సిద్దం. అనిత హోంమంత్రిగా ఉన్నారా? యాంకర్‌గా ఉన్నారా? ఆమె హావభావాలు నవ్వుకునేలా ఉన్నాయి. మంత్రుల దివాలాకోరు మాటలకు ప్రజలు నవ్వుకుంటున్నారు చంద్రబాబు కంటే వయస్సులో చాలా చిన్న అయిన వైయస్ జగన్ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని ఆలోచన చేశారు. ఈ ఏడాది ప్రారంభమైన కాలేజీతో కలిపి మొత్తం ఆరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను రన్నింగ్ లోకి తీసుకువచ్చారు. అసంపూర్తిగా ఉన్న మిగిలిన మెడికల్ కాలేజీలను పూర్తి చేసి, వెంటనే వాటిని కూడా నిర్వహణలోకి తీసుకురావాలనే ఆలోచన ఈ సీఎం చంద్రబాబుకు ఎందుకు రాలేదో హోమంత్రి అనిత చెప్పాలి. అలా కాకుండా జగన్ గారు 17 కాలేజీలకు శ్రీకారం చుట్టారు, ఆరు కాలేజీలు పూర్తయ్యి, తరగతులు కూడా ప్రారంభమయ్యాయి, మిగిలిన 10 కాలేజీలను పూర్తి చేయలేకపోయారంటూ వైయస్ జగన్‌ను కూటమి నేతలు తిడుతుంటే, వారి దివాలాకోరుతనంను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. విజనరీ ఉంది, సీనియారిటీ ఉందని చెప్పుకునే చంద్రబాబు తన హయాంలో కనీసం ఒక్క మెడికల్ కాలేజీని కూడా ప్రభుత్వపరంగా ఎందుకు నిర్మించలేకపోయారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దమ్ముంటే ముందు దానికి సమాధానం చెప్పాలి. కూటమి ప్రభుత్వ పదిహేను నెలల్లోనే దాదాపు రూ.2 లక్షల కోట్లు అప్పులు తెచ్చిన సీఎం చంద్రబాబు, అసంపూర్తిగా ఉన్న మెడికల్ కాలేజీలను పూర్తి చేసేందుకు కనీసం రూ.5వేల కోట్లు ఎందుకు కేటాయించలేకపోయారో ప్రజలకు చెప్పండి? నిర్మాణంలో ఉన్న పది మెడికల్ కాలేజీలను పూర్తి చేయలేక, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అనిత, అచ్చెన్నాయుడు, సవిత ఇలా మాట్లాడుతున్న వారిని చూసి ప్రజలు ఛీకొడుతున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉంటే పేదలకు మెడికల్ వైద్య విద్య, పేదలకు వైద్యం అందుబాటులోకి వస్తుంది, దానిని పట్టించుకోకుండా వైయస్ జగన్ చేసిన మంచిపైన వీరు బురదచల్లుతున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. చంద్రబాబు అసమర్థత కారణంగా కోవిడ్ సమయంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందక ఎంత మంది పొరుగు రాష్ట్రాలకు వెళ్ళారో అర్థం చేసుకోవాలి. ఆనాడు వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం ప్రకడ్భందీ ప్రణాళికతో ప్రజలకు వైద్యం అందించింది. ఇటువంటి పరిస్థితి మళ్ళీ రాకూడదనే ఉద్దేశంతోనే వైయస్ జగన్ 17 ప్రభుత్వ మెడికల్ వైద్య కాలేజీలకు శ్రీకారం చుట్టారు. వాటితో వచ్చే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ద్వారా మెరుగైన వైద్యం అందించవచ్చని భావించారు. వారాంతాల్లో సీఎంతో సహా మంత్రులు ఎక్కడ ఉంటున్నారు? ఒక రౌడీషీటర్‌కు డబ్బు తీసుకుని పెరోల్ ఇచ్చారంటూ హోంమంత్రి అనితను సొంతపార్టీ వారే ఎలా ఆక్షేపించారో ప్రజలు చూశారు. అలాంటి ఆమె వైయస్ జగన్ బెంగుళూరులో ఉంటారని దీర్ఘాలు తీసి మాట్లాడుతున్నారు. సీఎంగా వైయస్ జగన్ అయిదేళ్ళపాటు రాష్ట్రంలోనే ఉన్నారు. ఆ సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లు ఎక్కడ ఉన్నారో అనిత చెప్పగలరా? ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న రెడ్‌బుక్ రాజ్యాంగం వల్ల ఇబ్బంది పడుతున్న వారికి వైయస్ జగన్ అండగా నిలుస్తున్నారు. రైతుల పక్షనా నిలబడి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలోని పెద్దలు రాష్ట్రంలో ఎంత వరకు అందుబాటులో ఉంటున్నారు? శుక్రవారం రాగానే హైదరాబాద్‌కు పరుగులు పెడుతున్నారు. స్టార్ హోటళ్ళలో కూటమి మంత్రులు మకాం వేసి ఎలా సెటిల్‌మెంట్లు చేస్తున్నారో పచ్చపత్రికల్లోనే కథనాలు వస్తున్నాయి. ఆరోజు విజయవాడ మునిగిపోవడానికి కారణం కూటమి మంత్రులు హైదరాబాద్‌లో ఉండి, ప్రజలను పట్టించుకోకపోవడం వల్లే. ఈ రోజు రైతులు యూరియా కోసం, గిట్టుబాటు ధరల కోసం అల్లాడుతున్నారంటే దానికి కారణం ఈ మంత్రుల అసమర్థతే. అడ్డదిడ్డంగా పెరిగిన మంత్రి అచ్చెన్నాయుడు తన శాఖను గాలికి వదిలేసి, రైతుల గోడు పట్టించుకోకుండా చంద్రబాబు చెప్పాడని వైయస్ జగన్ పై నోరు పారేసుకుంటున్నాడు. వ్యవసాయశాఖ మంత్రిగా రైతులను పట్టించుకోలేని అచ్చెన్నాయుడు, యూరియా బ్లాక్ దందాలో వాటాలు తీసుకుంటున్నందుకు అచ్చెన్నాయుడు నుయ్యో-గొయ్యో చూసుకోవాలి. ఆయన నియోజకవర్గంలోనే ఇచ్ఛాపురం గణపతి అనే రైతు యూరియా దొరక్క తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ వీడియో విడుదల చేశాడు. ఆయన శాఖలోని సిబ్బంది రైతులకు సమాధానం చెప్పలేక కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. ప్రజల నమ్మకాన్ని, వారి అమ్మకం కోసం వాడుకుంటున్నారు. తన జిల్లాలో మెడికల్ కాలేజీని అమ్మేందుకు తలూపిన సవిత అనితతో పాటు మరో మంత్రి సవిత తయారయ్యారు. తొలిసారి మంత్రి అవ్వగానే కొత్త బిచ్చగాడు...పొద్దెరగడు అన్న చందంగా ఆమె వ్యవహరిస్తున్నారు. తన జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీని సీఎం చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి పూర్తి చేయించుకునే సత్తా ఆమెకు లేదు. అమరావతిలో వర్షాలకు నీటిని తోడుతున్నామని కోట్లాధి రూపాయలు ఖర్చు చేస్తున్నారు. దానిలో కొంత తీసుకువస్తే అనంతపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీ పూర్తవుతుంది. వెనుకబడిన అనంతపురం జిల్లాలో తలమానికంగా ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీని తీసుకురావాలని చంద్రబాబు చేయని ఆలోచనను సీఎంగా వైయస్ జగన్ చేస్తే, ఆ మెడికల్ కాలేజీని పూర్తి చేసుకోకుండా, దానిని అమ్మకానికి కేబినెట్‌లో పెడితే సిగ్గులేకుండా సవిత ఎలా సంతకం పెట్టారు? ఏ అర్హత ఉందని వైయస్ జగన్ పై ఆమె మాట్లాడుతున్నారు. ఓట్లు వేసిన ప్రజలకు వెన్నుపోటు పొడిచి, చంద్రబాబు చెప్పే దానికి గంగిరెద్దులా తల ఊపుతున్నారు. విద్య-వైద్య రంగాల్లో వైయస్ జగన్ విప్లవాత్మక నిర్ణయాలు ప్రజలను నమ్ముకుని రాజకీయాల్లోకి వచ్చిన నేత వైయస్ జగన్. మేనిఫేస్టోలో చెప్పినవన్నీ 99 శాతం అమలు చేశారు. అవినీతి లేకుండా లబ్ధిదారుల ఖాతాలకు సంక్షేమ పథకాల సొమ్మును జమ చేశారు. స్కూళ్ళు, కాలేజీలు, హాస్పటల్స్, పోర్ట్‌లు ఇలా అనేక అభివృద్ది కార్యక్రమాలను నిర్వహించారు. చంద్రబాబు మాత్రం తన పాలనలో చెప్పుకునేందుకు ఒక్క మంచి పని అయనా చేశారా? దీనిపై ప్రశ్నించిన వారి నాలుక మందం అంటాడు. తన మంత్రులతో మాట్లాడిన వారిపై బూతులు మాట్లాడిస్తారు. ఆనాడు ఎన్టీఆర్ తీసుకువచ్చిన వాటిని అయినా చంద్రబాబు సక్రమంగా ముందుకు తీసుకువెళ్ళలేదు. వైయస్ఆర్, వైయస్ జగన్ హయాంలో ప్రజల కోసం మంచి చేసిన వాటిని కూడా ముందుకు తీసుకువెళ్ళకుండా, వాటిని నిర్వీర్యం చేస్తున్నారు. తనకు విజన్ ఉంది, విస్తరాకుల కట్ట ఉందని చెప్పుకునే చంద్రబాబు నాలుగుసార్లు సీఎం అయి ఒక్క మెడికల్ కాలేజీలను కట్టలేదు. నిర్మాణం పూర్తి చేయాల్సిన పది కాలేజీలపై దృష్టి సారించి, నిధులు కేటాయించి ఉంటే అవ్వన్నీ పూర్తయ్యి ఉండేవి. దాని గురించి మాట్లాడకుండా వైయస్ జగన్ పై దూషణలకు దిగడమే మంత్రులు పనిగా పెట్టుకున్నారు. ఒక మెడికల్ కాలేజీ పెట్టాలంటే ముందుగా దానికి అనుబంధంగా ఆసుపత్రిని నడపాలి. తరువాత ఎన్‌ఎంసీ వారు దానిని పరిశీలించి, ఓకే అనుకుంటేనే అనుమతి ఇస్తారు. అనుమతి ఇచ్చిన తొలి ఏడాది అడ్మీషన్లు ప్రారంభిస్తారు. ఆ మొదటి ఏడాదికి అవసరమైన మౌలిక వసతులను సిద్దం చేస్తారు. రెండో ఏడాది కూడా పరిశీలిన చేస్తారు, దానికి అనుగుణంగా కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పిస్తారు. మూడు, నాలుగు, అయిదు సంవత్సరాల పాటు ప్రతి ఏటా ఎన్‌ఎంసీ పరిశీలిస్తుంది. అంటే ఒక మెడికల్ కాలేజీ పూర్తి స్థాయిలో నడవాలంటే దాదాపు ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాలు పడుతుంది. మంగళగిరి ఎయిమ్స్ కూడా ప్రారంభించే సమయంలో విజయవాడ సిద్దార్థ మెడికల్ కాలేజీలో నడిచింది. అది మంగళగిరిలో నిర్మాణంను పూర్తి చేసుకోవడానికి దాదాపు 9 సంవత్సరాలు పట్టింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఎలా అనుమతులు తెచ్చుకుని, పూర్తి చేసుకోవాలో కనీస అవగాహన లేనివారందరూ మంత్రులుగా ఉన్నారు. ఎంతసేపు చంద్రబాబు, లోకేష్‌లను మెప్పించడానికే సిగ్గులేకుండా, దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు. ఈ మంత్రులను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కాపాడుకునేందుకు ప్రజలు, విద్యార్ధులు, పౌరసమాజంతో కలిసి ఆందోళనలు చేస్తాం. న్యాయపరంగా పోరాటం చేస్తాం. మీడియా ప్రతినిధుల ప్రశ్నకు స్పందిస్తూ... పవన్ కళ్యాణ్ షూటింగ్‌లు చేసుకోవడానికి, ప్రభుత్వ ధనంతో స్పెషల్ ఫ్లైట్‌లు ఎక్కి ఎంజాయ్ చేయడానికి కాదు ప్రజలు అధికారాన్ని ఇచ్చింది. చంద్రబాబు పాలనలో తప్పులు జరుగుతుంటే, సరిచేయాలి. పిఠాపురంలో బాలికపై అఘాయిత్యం జరిగితే పట్టించుకోరు. రైతుల యూరియా బాధ పట్టదు. తన ప్యాకేజీ కరెక్ట్‌గా ఇస్తే చాలు. చంద్రబాబు సమకూర్చిన హెలికాఫ్టర్‌లో ఎక్కి తిరగడమే తప్ప రాష్ట్రం గురించి పవన్ ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా మాట్లాడుతున్నారా? 17 మెడికల్ కాలేజీలను అమ్మకానికి పెడితే సిగ్గులేకుండా దానికి తలాడిస్తున్నాడని మాజీ మంత్రి ఆర్కె రోజా మండిపడ్డారు.