తోపుదుర్తి భాస్క‌ర్‌రెడ్డి మృతి ప‌ట్ల వైయ‌స్ జ‌గ‌న్ దిగ్భ్రాంతి

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంత‌పురం జిల్లా సీనియ‌ర్ నాయ‌కుడు తోపుదుర్తి భాస్క‌ర్‌రెడ్డి ఆక‌స్మిక మ‌ర‌ణం ప‌ట్ల వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఈ మేరకు త‌న ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.

ఎక్స్ వేదిక‌గా వైయ‌స్ జ‌గ‌న్‌..
మా పార్టీకి చెందిన అనంతపురం జిల్లా సీనియ‌ర్ నాయ‌కుడు తోపుదుర్తి భాస్క‌ర్‌రెడ్డిగారి ఆక‌స్మిక మ‌ర‌ణం దిగ్భ్రాంతికి గురి చేసింది.  క్ర‌మ‌శిక్ష‌ణ క‌లిగిన నాయ‌కుడిగా పార్టీకి ఆయ‌న అందించిన సేవ‌లు మ‌రిచిపోలేనివి. ఈ క‌ష్ట స‌మ‌యంలో ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు దేవుడు ధైర్యం ప్ర‌సాదించాల‌ని, ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్థిస్తున్నాను.

Back to Top