విజయనగరం మెడికల్ కళాశాల సంద‌ర్శ‌న‌

విజ‌య‌న‌గ‌రం:  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిర్మించిన విజయనగరం ప్రభుత్వ మెడికల్ కళాశాలకు రెండేళ్లు పూర్తి అయిన సంద‌ర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు సంబ‌రాలు చేసుకున్నారు. కాలేజీ ప్రారంభించి నేటికి రెండేళ్లు పూర్తి అయిన నేప‌థ్యంలో వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు మెడిక‌ల్ కాలేజీని సంద‌ర్శించారు. కాలేజీ వ‌ద్ద కేక్ క‌ట్ చేసి శుభాకాంక్ష‌లు తెలిపారు. కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సభ్యులు పి.శ్రవణ్ కుమార్, రౌతు ధావన్ కుమార్, ముల్లు తాతి నాయుడు, శాసపు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. 

Back to Top