క్రెడిట్ చోరీలో  చంద్ర‌బాబును మించినోడు ఈ భూమండలంపై ఉంటాడా?

ఆర్డీటీ‌కి అనంతపురం జిల్లా వైయస్‌ఆర్‌సీపీ నేతలు అవిశ్రాంత పోరాటంతో ఎఫ్‌సీఆర్ఏ అనుమ‌తులు

ఆ ఘనతను కూడా తన ఖాతాలో వేసుకునేందుకు నిర్లజ్జగా చంద్రబాబు ప్రయత్నాలు 

అనంత‌పురం:  అనంతపురం జిల్లాలో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న Rural Development Trust (ఆర్డీటీ) సంస్థకు ఎఫ్‌సీఆర్ఏ (FCRA) అనుమతులు పునరుద్ధరించబడటం జిల్లా ప్రజల్లో ఆనందాన్ని కలిగించింది.  వైయ‌స్ఆర్‌సీపీ అవిశ్రాంత పోరాటమే ఇందుకు కారణం. ముఖ్యంగా మాజీ ఎంపీ తలారి రంగయ్య జిల్లాలో పాద‌యాత్ర‌, ప‌లు నిర‌స‌న కార్య‌క్ర‌మాలు, ఢిల్లీలో కేంద్ర స్థాయిలో చేసిన నిరసనలు,కేంద్ర మంత్రుల‌కు విన‌తులు ఇచ్చి ఎఫ్‌సీఆర్ఐ అనుమ‌తులు సాధించ‌డంలో కీలక పాత్ర పోషించారు. ఆర్డీటీకి విదేశీ నిధుల అనుమతులు నిలిచిపోయిన సమయంలో వేలాది మంది విద్యార్థులు, రైతులు, అనాథల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆయన పలుమార్లు పోరాటాలు చేశారు.  అయితే, ఈ మొత్తం ప్రక్రియలో తమ పాత్ర ఏమీ లేకపోయినా, ఈ విజయాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు సీఎం చంద్ర‌బాబు ప్రయత్నాలు మొద‌లుపెట్టారు. ప్రజల సమస్యలపై నిజంగా పోరాడిన వారిని అభినందించాల్సింది పోయి, రాజకీయ ల‌బ్ధి కోసం క్రెడిట్ చోరికి పాల్ప‌డుతున్నాడని వైయ‌స్ఆర్‌సీపీ ఆక్షేపించింది. ఈమేర‌కు ఎక్స్ ఖాతాలో చంద్ర‌బాబు తీరును ఎండ‌గ‌డుతూ, ఆర్డీటీ కోసం చేసిన పోరాటాన్ని గుర్తు చేస్తూ వైయ‌స్ఆర్‌సీపీ ట్వీట్ చేసింది.    

వైయ‌స్ఆర్‌సీపీ ఎక్స్ వేదిక‌గా..

క్రెడిట్ చోరీలో చంద్ర‌బాబును మించినోడు ఈ భూమండలంపై ఉంటాడా?

అనంతపురం ప్రజల గుండెచప్పుడు ఆర్డీటీ‌కి అనంతపురం జిల్లా వైయస్‌ఆర్‌సీపీ నేతలు అవిశ్రాంత పోరాటంతో లైన్ క్లియర్ అయ్యింది 

కానీ.. సిగ్గులేకుండా ఆ ఘనతను కూడా తన ఖాతాలో వేసుకునేందుకు నిర్లజ్జగా చంద్రబాబు ప్రయత్నాలు

ఏ జిల్లానైతే కరువు రక్కసి వేధిస్తుందో..ఏ ప్రజలకైతే ఆకలి కేకలు అలవాటయ్యాయో.. ఆ పేద ప్రజల కళ్లలో వెలుగులు నింపే RDT (రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్) సంస్థపై పడిన నీలి నీడలు నేటితో తొలగిపోయాయి. కేంద్ర ప్రభుత్వం FCRA రెన్యూవల్ మంజూరు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులతో జిల్లా అంతటా పండగ వాతావరణం నెలకొంది. ఈ విజయం కేవలం ఒక సంతకం వల్ల రాలేదు..దీని వెనుక మాజీ ఎంపీ తలారి రంగయ్య గారి మొక్కవోని దీక్ష, కంటతడి పెట్టించే కృషి దాగి ఉన్నాయి.

Image

అనంత గొంతుకగా ఢిల్లీలో గర్జన..

ఆర్డీటీ సంస్థకు విదేశీ నిధుల అనుమతులు నిలిచిపోయినప్పుడు, వేలాది మంది అనాథలు, రైతులు, విద్యార్థుల భవిష్యత్తు అంధకారమవుతుందని రంగయ్య గారు ఆవేదన చెందారు. రాష్ట్రాల సరిహద్దులు దాటి, ఢిల్లీ వేదికగా దశలవారీగా ఉద్యమించారు. పార్లమెంటు ఆవరణలో వైయస్ఆర్ సీపీ ఎంపీలతో కలిసి ఆయన చేసిన నిరసన, కేంద్ర పీఠాన్ని కదిలించింది.

నేరుగా అమిత్ షా గారి వద్దకు గుండె లోతుల్లోంచి విన్నపం.. నిరసన తెలిపిన అదే రోజే, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారిని కలిసి, ఫైళ్లలోని లెక్కలు కాదు.. అనంతపురం జిల్లా ప్రజల కన్నీటి గాథలను వివరించారు. RDT అంటే కేవలం ఒక సంస్థ కాదు.. అది మా జిల్లా పేదల జీవనాధారం అని ఆయన చెప్పిన మాటలు హోంమంత్రిని కదిలించాయి. ఫలితంగా, జిల్లా ప్రజల చిరకాల వాంఛ నెరవేరుస్తూ నేడు FCRA ఉత్తర్వులు వెలువడ్డాయి. రాజకీయాలకు అతీతంగా, కేవలం సేవా దృక్పథంతో తలారి రంగయ్య గారు చేసిన ఈ పోరాటం జిల్లా చరిత్రలో నిలిచిపోతుంది. సామాన్యుల పక్షాన నిలబడి, అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన రంగయ్య గారిపై ప్రజలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆర్డీటీ మళ్లీ పూర్తిస్థాయిలో సేవలు అందించే మార్గం సుగమం కావడంతో జిల్లా ప్రజల ముఖాల్లో చిరునవ్వులు వికసిస్తున్నాయి. 

Image

Back to Top