బీఆర్ నాయుడు వ్య‌వ‌హార‌శైలిపై పులివెందులలో  నిరసన 

వైయస్ఆర్ జిల్లా: పులివెందులలో టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహార శైలిపై వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని వెంకటేశ్వర ఆలయంలో 101 టెంకాయలు కొట్టి శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. టిటిడి పవిత్రతను దెబ్బతీస్తున్నారని ఆరోపిస్తూ, బీఆర్ నాయుడుకు మంచి బుద్ధి ప్రసాదించాలని ప్రార్థించారు. ఆయన అనైతిక కార్యకలాపాలు, వ్యవహార శైలి కారణంగా టిటిడి ప్రతిష్ట దెబ్బతింటోందని వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు విమర్శించారు.

టిటిడి చైర్మన్ పదవి నుంచి వెంటనే తొలగించి, సంస్థ పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చిన్నప్ప, పట్టణ అధ్యక్షుడు హల్ గంగాధర్ రెడ్డి తదితర వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
 

Back to Top