తాడిపత్రి: వైయస్ఆర్‌సీపీ బూత్ లెవల్ ఏజెంట్లు (SIR-2026) అప్రమత్తంగా పనిచేస్తూ ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో కీలక పాత్ర పోషించాలని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సూచించారు. తాడిపత్రి పట్టణంలోని వైయస్ఆర్‌సీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పెద్దపప్పూరు మండల బూత్ లెవల్ ఏజెంట్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ గోపినాథ్ బూత్ స్థాయి నాయకులకు దిశానిర్దేశం చేశారు. శిక్షణ కార్యక్రమంలో ఓటరు జాబితా సవరణలు, కొత్త ఓటర్ల నమోదు, ఇంటింటి పరిశీలన, ఓటర్ల వివరాల ధృవీకరణ వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు. ప్రతి బూత్‌లో పార్టీని మరింత బలోపేతం చేయాలని, ప్రజల సమస్యలను తెలుసుకుంటూ గ్రామ స్థాయిలో పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తలు, అభిమానుల ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, నకిలీ మరియు డూప్లికేట్ ఓట్లపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో బీఎల్‌ఏల పాత్ర అత్యంత కీలకమని పేర్కొంటూ, ప్రతి నాయకుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సమావేశంలో నేతలు కోరారు.