నేడు వైయస్‌ జగన్ కర్నూలు పర్యటన

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ ఈ రోజు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి, 11 గంటలకు కర్నూలు ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి పంచలింగాల వద్ద ఉన్న జిల్లా జైలుకు వెళ్లి, అక్రమ కేసులో అరెస్టై జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని ములాఖత్‌లో కలిసి పరామర్శించనున్నారు. ఆయనకు ధైర్యం చెప్పనున్నారు. అనంతరం మధ్యాహ్నం కర్నూలు నుంచి తిరుగు ప్రయాణమవుతారు.

Back to Top