దువ్వూరు మునిశేఖర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కాకాని పూజిత

పార్టీకి ఆయన సేవలు చిరస్మరణీయం: వైయ‌స్ఆర్‌సీపీ నేతలు

సూళ్లూరుపేట:  వైయ‌స్ఆర్‌సీపీ స్టేట్ పబ్లిసిటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ దివంగత దువ్వూరు మునిశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ నేత కాకాని పూజిత పరామర్శించారు. ఈ సందర్భంగా సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యతో కలిసి మునిశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మునిశేఖర్ రెడ్డి అకాల మరణం పార్టీకి, కార్యకర్తలకు తీరని లోటని పేర్కొన్నారు. పార్టీ అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి, ప్రజలతో కలిసిమెలిసి పనిచేసిన తీరు ఎప్పటికీ గుర్తుండిపోతాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని దువ్వూరు మునిశేఖర్ రెడ్డికి ఘన నివాళులు అర్పించారు. ఆయన ఆశయాల సాధన కోసం పార్టీ శ్రేణులు మరింత కట్టుబాటుతో పనిచేయాలని నేతలు పిలుపునిచ్చారు.
 

Back to Top