శ్రీ అన్నమయ్య జిల్లా: రైల్వే కోడూరు నియోజకవర్గంలో రాజకీయంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈరోజు ఉదయం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో, మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఊర్లగట్టుపోడు పంచాయతీ ఎగువపల్లి గ్రామానికి చెందిన సుమారు 20 కుటుంబాల సభ్యులు టిడిపిని వీడి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం విశేషం. ఈ సందర్భంగా వారందరికీ పార్టీ శాలువాలు కప్పి, కొరముట్ల శ్రీనివాసులు గారు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల సంక్షేమం, అభివృద్ధి పట్ల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబాట్లు చూసి ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారని తెలిపారు. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఓబులవారిపల్లి మండల కన్వీనర్ సాయికిషోర్ రెడ్డి, సీనియర్ నాయకులు పంజం వేణుగోపాల్ రెడ్డి, జడ్పీటీసీ రత్నమ్మ, పట్టణ అధ్యక్షుడు సిహెచ్ రమేష్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ నందా బాల, ఎంపీటీసీలు గని (రాజ్), బండారు మల్లికార్జున, స్టేట్ ఎస్సీ సెల్ కార్యదర్శి లింగం లక్ష్మికర్, నారాయణమ్మ, రత్తయ్య, శివకుమార్ రాజు, అమరేశ్వర్ రాజు తదితరులు పాల్గొన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో సురేష్ కుమార్ రాజు, మురళి రాజు, నవీన్ కుమార్, సాయి, అనిల్, అరుణ్, శంకర్, పవన్ కుమార్, కళ్యాణ్, వెంకటేష్, కృష్ణయ్య తదితరులు ఉన్నారు.