వైయస్ఆర్ జిల్లా: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడిని తొలగించాలని డిమాండ్ చేస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కడప నగరంలోని దేవుని కడప తొలి గడప “శ్రీ వెంకటరమణ స్వామి” ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమం పూర్తిగా శాంతియుతంగా, ప్రజాస్వామ్య విలువలను కాపాడే ఉద్దేశంతో నిర్వహిస్తున్నామని వైయస్ఆర్‌సీపీ నేతలు స్పష్టం చేశారు. అయితే ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ముందస్తుగా నోటీసులు ఇవ్వడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప నియోజకవర్గం వైయస్ఆర్‌సీపీ సమన్వయకర్త, మాజీ డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజాద్‌బాషా కు పోలీసులు నోటీసులు జారీ చేయడం అన్యాయమని ఖండించారు. ప్రజాస్వామ్య హక్కులను హరించే చర్యలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.