పోలవరం జిల్లా: రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలం మొల్లేరు గ్రామంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో ఇళ్లు పూర్తిగా దగ్ధమై, పశువులు మృతి చెందిన బాధిత కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే, వైయస్ఆర్‌సీపీ నియోజకవర్గ ఇంచార్జి నాగులపల్లి ధనలక్ష్మి పరామర్శించారు. మొల్లేరు గ్రామానికి చెందిన తలారి నాగ శ్రీను, అప్పికొండ కాట్రాజ్, అప్పికొండ దొంగయ్య కుటుంబాలను కలిసి వారి పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులకు బియ్యం, నిత్యావసర సరుకులు, ఆర్థిక సహాయం అందజేసి పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు గుల్ల ఏడుకొండలు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పలాల కృష్ణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు ఎజ్జు వెంకటేశ్వరరావు, రంపచోడవరం వైస్ ఎంపీపీ కొమ్మిశెట్టి బాలకృష్ణ, స్థానిక మాజీ సర్పంచ్ లక్ష్మి, బొట్టు వీరబాబు, బోధ సత్తిబాబు, యూత్ ప్రెసిడెంట్ సతీష్, గోపాలకృష్ణ, బండి నూకరాజు, మెడిశెట్టి చంటి, బండి అప్పలరాజు, ఏడుకొండలు, జగదీష్, త్రిమూర్తులు, తలారి కాటమస్వామి, మేడిశెట్టి శ్రీను, ఈపీ సూరిబాబు, గోపాల్, తలారి కోటి, తలారి ప్రభ, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.