కులాల కుంప‌ట్లు రాజేస్తున్న చంద్ర‌బాబే పెద్ద సైకో

వైయ‌స్ జ‌గ‌న్ గురించి నోటికొచ్చిన‌ట్టు వాగితే స‌హించేది లేదు

వైయ‌స్ఆర్‌సీపీ స్టేట్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి ధ్వ‌జం 

క‌డ‌ప జిల్లాలోని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ  స్టేట్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి

చంద్ర‌బాబు ప్రోద్భ‌లంతోనే రాజ్య‌స‌భ‌లో రేణుకా చౌద‌రి క‌మ‌రావతి వ్యాఖ్య‌లు 

కాబ‌ట్టే ఇంత‌వ‌ర‌కు ఆమె మాట‌ల‌ను కూట‌మి నాయ‌కులు ఖండించ‌లేదు   

ప్రాంతాలు, కులాల మ‌ధ్య విద్వేషాలు రెచ్చ‌గొడితే చూస్తూ ఊరుకోం

వ్య‌క్తిగ‌త స్వార్థంతో ప‌నిచేసే చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ప‌నికి రాడు

చంద్ర‌బాబు అవినీతికి కేంద్రంగా అమ‌రావ‌తి మారింద‌ని నిరూపితమైంది

స్ప‌ష్టం చేసిన మాజీ ఎమ్మెల్యే గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి   

అమ‌రావ‌తికే కాదు, రాయ‌ల‌సీమ ప్ర‌జ‌ల‌కూ మ‌నోభావాలున్నాయి

రాయ‌ల‌సీమ ప్రాంతంలో రాముడు, కైలాస వాసుడు కొలువై లేరా?

ఏక‌ప‌క్షంగా రాయచోటి జిల్లాను తీసేస్తే మేం చాలా బాధప‌డ్డాం

తెలంగాణపై ఉన్న ప్రేమ రాయ‌ల‌సీమ ప్రాంతంపై ఎందుకు లేదు? 

అమ‌రావ‌తి అప్పుల‌తో రాష్ట్ర ఆర్థిక వ్యవ‌స్థ చిన్నాభిన్నం

చంద్ర‌బాబుని నిల‌దీసిన గడికోట శ్రీకాంత్ రెడ్డి 

క‌డ‌ప‌: అన్ని ప్రాంతాలు స‌మానంగా అభివృద్ధి చెందాల‌ని భావించి మావిగ‌న్ తో గ్రోత్ ఇంజిన్ గా మార్చాల‌ని సూచించిన మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ గురించి నోటికొచ్చిన‌ట్టు మాట్లాడితే స‌హించేది లేద‌ని వైయ‌స్ఆర్‌సీపీ స్టేట్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి హెచ్చ‌రించారు. క‌డ‌ప‌ లోని పార్టీ జిల్లా కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఏపీ రీఆర్గ‌నైజేష‌న్ యాక్టుకి చ‌ట్ట‌స‌వ‌ర‌ణ సంద‌ర్భంగా రాజ్య‌స‌భ‌లో ఎంపీ రేణుకా చౌద‌రితో అమ‌రావ‌తిని క‌మ‌రావ‌తి అని మాట్లాడించ‌డం ద్వారా చంద్ర‌బాబు కులాల కుంప‌ట్లు రాజేసి రాజ‌కీయ ల‌బ్ధిపొందాల‌ని చూస్తున్నాడ‌ని, కాబ‌ట్టే ఇంత‌వ‌ర‌కు ఆ పార్టీ నాయ‌కులు ఆమె మాట‌ల‌ను ఖండించ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. త‌న రాజ‌కీయ ప్ర‌యోజనాల కోసం కులాలు, ప్రాంతాల మ‌ధ్య వైష‌మ్యాలు రెచ్చ‌గొడుతున్న చంద్ర‌బాబే పెద్ద సైకో అని మండిప‌డ్డారు. వ్య‌క్తిగ‌త స్వార్థంతో, దోపిడీ ఆలోచ‌న‌ల‌తో ప‌నిచేస్తున్న చంద్ర‌బాబు రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా ప‌నికిరాడ‌ని చెప్పారు. అమ‌రావ‌తి కోసం వెనుక‌బ‌డిన ఉత్త‌రాంధ్ర‌, రాయ‌ల‌సీమ ప్రాంత ప్ర‌యోజ‌నాల‌ను ప‌ణంగా పెడుతున్న చంద్ర‌బాబుకి మా ప్రాంత మ‌నోభావాలతో ప‌నిలేదా అని ప్ర‌శ్నించారు. గ‌తంలో ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్‌తో ఇప్పుడు మొబిలైజేష‌న్ అడ్వాన్సుల పేరుతో సంప‌ద‌ను దోచుకుతింటున్నాడ‌ని వివ‌రించారు. చ‌ద‌ర‌పు అడుగు నిర్మాణానికి రూ.14 వేలు ఖ‌ర్చు చేస్తూ వేల కోట్ల అవినీతికి పాల్ప‌డుతున్నాడ‌ని మాజీ ఎమ్మెల్యే గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 
ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే.... 

- అప్పట్లో ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్‌.. ఇప్పుడు మొబిలైజేష‌న్ అడ్వాన్సులు

అమ‌రావ‌తి బిల్లును పార్ల‌మెంట్‌లో పెట్ట‌గానే రాష్ట్ర ప్ర‌జల త‌ల‌రాత‌లు మారిపోయిన‌ట్టే కూట‌మి నాయ‌కులు క‌ళ్లబొల్లి క‌బుర్లు చెబుతున్నారు. ఇన్నాళ్లూ గ్రాఫిక్స్ చూపించి అమ‌రావ‌తి రాజ‌ధాని టోక్యో, సింగ‌పూర్‌, కొలొంబో, న్యూయార్క్‌, లండ‌న్ ల మాదిరిగా ప్ర‌పంచ గుర్తింపు తెచ్చుకుంటుంద‌ని ప్ర‌చారం చేశాడు. జిల్లాకో ఎయిర్‌పోర్టు వ‌స్తుందని భ్ర‌మ‌లు క‌ల్పించాడు. కానీ ఇప్పుడు ఇది నిరంతర ప్రక్రియ అంటూ మాటమార్చాడు. ఒక‌రకంగా చెప్పాలంటే అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణం పూర్తి చేయ‌డం త‌న వ‌ల్ల కానిప‌న‌ని ఆయ‌నే అంగీక‌రించాడు. రాజ‌ధాని ముసుగులో భారీ ఎత్తున దోపిడీకి పథ‌క ర‌చ‌న చేసి దోచుకోవ‌డం త‌ప్ప‌, కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన రెండేళ్లుగా జ‌రిగిన ప‌నులు శూన్యం. రాష్ట్ర ప్ర‌జ‌ల భ‌విష్య‌త్తును ప‌ణంగా పెట్టి చంద్ర‌బాబు చేస్తున్న ధ‌న య‌జ్జానికి మిగ‌తా ప్రాంతాలు బలి కాబోతున్నాయ‌ని ప్ర‌జ‌ల్లో భ‌యాందోళ‌న నెల‌కొంది. శ్రీకృష్ణ క‌మిటీ, శివ‌రామకృష్ణ‌న్ క‌మిటీ సిఫార్సుల‌ను తుంగ‌లో తొక్కి రాజ‌ధాని పేరుతో చంద్ర‌బాబు ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్‌కి పాల్ప‌డ్డాడు. బినామీలతో భూములు కొనుగోలు చేయించి ఇప్పుడు వాటిని కాపాడుకోవ‌డం కోసం రాష్ట్ర ప్ర‌జ‌ల భ‌విష్య‌త్తును ప‌ణంగా పెడుతున్నాడు. అమ‌రావ‌తిని త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తు కోసం వాడుకోవాల‌ని చూస్తున్నాడు. 6 కోట్ల మంది ప్ర‌జ‌లను ఇబ్బంది పెడుతున్నాడు. ప‌న్నెండేళ్ల‌యినా అమ‌రావ‌తిలో ప‌ది శాతం ప‌నులు కూడా పూర్తి కాలేదు. చంద్ర‌బాబు పాల‌న‌లో ఏపీలో బీహార్ క‌న్నా దారుణ‌మైన ప‌రిస్థితులున్నాయ‌ని, క‌మీష‌న్లు ఇచ్చుకోలేక మాకీ అసోసియేట్స్ అనే సంస్థ అమ‌రావ‌తి ప్రాజెక్టు నుంచి వైదొలిగింది. చంద్ర‌బాబు అవినీతిలో భాగ‌మైన పాపానికి సింగ‌పూర్ మంత్రి కూడా జైలుపాల‌య్యాడు. 

- పోల‌వ‌రం నాశ‌న‌మైంది చంద్ర‌బాబు వ‌ల్లే

2004 వ‌ర‌కు ముఖ్య‌మంత్రిగా ఉండి పోల‌వ‌రం ప్రాజెక్టు అవ‌స‌రం లేద‌ని చెప్పిన చంద్ర‌బాబు, ఇప్పుడు త‌న ఘ‌న‌తేన‌ని చెప్పుకోవ‌డం సిగ్గుచేటు. వైయ‌స్సార్ ప్రారంభించి అనుమ‌తులు తీసుకురాక‌పోయుంటే పోల‌వ‌రం ఎప్ప‌టికీ క‌ల‌లాగే మిగిలిపోయేది. పోల‌వ‌రం పూర్తి చేసే అవ‌కాశం వ‌చ్చినా చంద్ర‌బాబు త‌న ధ‌న దాహంతో ప్రాజెక్టును ప్ర‌శ్నార్థకం చేశాడు. విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం పోల‌వ‌రం ప్రాజెక్టు కోసం తెలంగాణ‌లోని ఏడు మండ‌లాల‌ను ఆంధ్ర‌లో క‌లిపితే అది కూడా త‌న వ‌ల్లేన‌ని చంద్ర‌బాబు చెప్ప‌డం హాస్యాస్ప‌దం. 2014-19 మ‌ద్య అధికారంలో ఉండ‌గా చంద్ర‌బాబు చేసిన త‌ప్పుల‌ను స‌రిదిద్ది ప్రాజెక్టును గాడిలో పెట్ట‌డానికి వైయ‌స్ఆర్‌సీపీకి ఐదేళ్ల స‌మ‌యం ప‌ట్టింది.  రెండేళ్లుగా అధికారంలో ఉన్నా పోల‌వ‌రం పూర్తి చేసే కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌డం లేదు. మెడిక‌ల్ కాలేజీలు, పోర్టులు క‌ట్టి రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముంద‌కు తీసుకెళ్లే ప్ర‌య‌త్నం వైయ‌స్ జ‌గ‌న్ గారు చేస్తే, చంద్ర‌బాబు వాటిని ప్రైవేటీక‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. అమ‌రావ‌తిలో విట్‌, ఎస్ఆర్ఎం వంటి ప్రైవేట్ యూనివ‌ర్సిటీల‌ను తీసుకొచ్చాన‌ని గొప్ప‌గా చెప్పుకోవ‌డం సిగ్గుచేటు. అక్ర‌మ నిర్మాణమైన ప్ర‌జావేదిక‌ను కూల్చేస్తే దాన్ని కూడా చంద్ర‌బాబు రాజ‌కీయంగా వాడుకున్నాడు. అన్ని ప్రాంతాలు స‌మానంగా అభివృద్ది చెందాల‌ని ఆలోచించే జ‌గ‌న్ ఎక్క‌డ‌, అమ‌రావ‌తిలో త‌న బినామీలే బాగుండాల‌ని కోరుకునే చంద్ర‌బాబు ఎక్క‌డ‌?  మావిగ‌న్ రాష్ట్రానికి ఇన్‌కం జ‌న‌రేట్ చేసే గ్రోత్ సెంట‌ర్ అవుతుంద‌ని జ‌గ‌న్ చెబుతుంటే ఆయ‌న్ను తుగ్ల‌క్ అనడం చంద్ర‌బాబు దిగ‌జారుడుస్థాయిని సూచిస్తోంది. 

- రాయ‌ల‌సీమ‌లో దేవ‌తులు లేరా?  మాకు మ‌నోభావాలు లేవా? 

మొబిలైజేష‌న్ అడ్వాన్సుల పేరుతో తీసుకుంటున్న క‌మీష‌న్ల‌కు ఎక్సెస్ కి టెండ‌ర్లు క‌ట్ట‌బెట్టే విధానాల గురించి స‌మాధానం చెప్పే ద‌మ్ము చంద్ర‌బాబుకి లేదు. రాజ‌ధాని పేరుతో చ‌ద‌ర‌పు అడుగుకి రూ. 14 వేల ఖ‌ర్చు చేస్తున్న చంద్ర‌బాబు అవినీతిని బ‌య‌ట‌కు తీస్తుంటే స‌మాధానం చెప్పుకోలేక త‌న మీడియాను పుర‌మాయించి చంద్ర‌బాబు వ్య‌క్తిత్వ హ‌న‌నం చేస్తున్నాడు. వ్య‌క్తిగ‌త స్వార్థం, సొంత ఖ‌జానా నింపుకోవాల‌న్న ఆలోచ‌నే త‌ప్ప ప్ర‌జ‌లు, నిపుణులు, ప్ర‌తిప‌క్ష పార్టీ సూచ‌న‌ల గురించి చంద్ర‌బాబు ఆలోచించ‌డం లేదు. వెనుక‌బ‌డిన రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర ప్రాంతాల అభివృద్ధి గురించి, ఈ ప్రాంత ప్ర‌జ‌ల మ‌నోభావాల గురించి చంద్ర‌బాబుకి ప‌ట్టింపు లేదు. రాయ‌ల‌సీమ ప్రాంతం రాజ‌ధానిని వ‌దులుకుంది. హైకోర్టును కోల్పోయింది. అమ‌రావ‌తేనా దేవ‌త‌లు న‌డ‌యాడిన నేల?  శ్రీశైల మ‌ల్లిఖార్జునుడు కొలువై ఉన్న క‌ర్నూలు, ఒంటిమిట్ట‌లో శ్రీరాముడు ఉన్నారు. వాళ్లంతా దేవ‌త‌లు కారా? మాకు మ‌నోభావాలు లేవా?  హైకోర్టును త‌ర‌లిస్తే, లా యూనివ‌ర్సిటీని తీసేస్తే, ఎయిమ్స్‌ని త‌ర‌లిస్తే మాకు బాధ ఉండ‌దా?  రాయ‌ల‌సీమ లిప్టు ఇరిగేష‌న్ ని రేవంత్‌రెడ్డికి తాక‌ట్టు పెట్టి ఎడారిగా మార్చే కుట్ర జ‌రుగుతోంది. రాయ‌ల‌సీమ ప్ర‌జ‌లు బాగుప‌డ‌టం చంద్ర‌బాబుకి న‌చ్చ‌డం లేదా?  తెలంగాణపైన ఉన్న ప్రేమ రాయ‌ల‌సీమపై లేదా?  

- ఎమ్మెల్యేల‌ను క‌ట్ట‌డి చేయ‌లేని అస‌మ‌ర్థుడు చంద్ర‌బాబు

త‌న 17 ఏళ్ల పాల‌న‌లో రాయ‌ల‌సీమ ప్రాంతానికి చంద్ర‌బాబు చేసింది శూన్యం. అమ‌రావ‌తి గురించి అంతలా వ‌ర్రీ అవుతున్న చంద్ర‌బాబు, రాయ‌చోటి జిల్లాను తీసేస్తే ఇక్క‌డి ప్ర‌జ‌లు బాధ‌ప‌డ‌తార‌ని ఎందుకు ఆలోచించ‌లేదు? చంద్ర‌బాబు మాదిరిగా వైయ‌స్సార్‌, వైయ‌స్ జ‌గ‌న్‌ల‌కు సంకుచిత ఆలోచ‌న ఉంటే రాష్ట్రం అన్ని ప్రాంతాల‌కు న్యాయం జ‌రిగేదా? ఓటుకునోటు కేసుకు భ‌య‌ప‌డి ప్ర‌త్యేక హోదాని తాక‌ట్టు పెట్టిన చంద్ర‌బాబు రాష్ట్రానికి ఎంతో చేసేసిన‌ట్టు క‌ల‌రింగ్ ఇచ్చుకుంటున్నాడు. అడ్డ‌గోలు దోపిడీ, రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలే ధ్యేయంగా ఏపీని రాజ‌ధాని లేని రాష్ట్రంగా మార్చే కుట్ర‌కు చంద్ర‌బాబు తెర‌లేపాడు. రాష్ట్రంలో మ‌ళ్లీ విభ‌జ‌న వాతావ‌ర‌ణం రాకూడ‌ద‌ని వైయ‌స్ఆర్‌సీపీ త‌ప‌న ప‌డుతుంటే, రాజ్యస‌భ‌లో క‌మ‌రావ‌తి అని మాట్లాడించి చంద్ర‌బాబు కులాల కుంప‌ట్లు రెచ్చ‌గొడుతున్నాడు. క‌నీసం ఇప్ప‌టివ‌ర‌కు రేణుకా చౌద‌రి మాట‌ల‌ను ఎంద‌కు ఖండించ‌లేదు?  వైయ‌స్ఆర్‌సీపీహ‌యాంలో విశాఖ అభివృద్ది చెందుతుంటే ఓర్వ‌లేక కోర్టులో కేసులు వేయించి దుర్మార్గంగా చంద్ర‌బాబు అడ్డుకున్నాడు. వ్య‌క్తిగ‌త అజెండాలున్న చంద్ర‌బాబు రాజకీయాల‌కు ప‌నికిరాడు. రాజ‌కీయ ల‌బ్ధికోసం కులాల కుంప‌ట్లు రెచ్చ‌గొడుతున్న చంద్ర‌బాబే నిజ‌మైన సైకో. నిజాయితీగా ప‌నిచేస్తానంటే వైయ‌స్ఆర్‌సీపీ కూడా చంద్ర‌బాబుకి స‌హ‌క‌రిస్తుంది. అంతేకానీ ప్ర‌జ‌ల మ‌ధ్య వ్య‌క్తిగ‌త వైష‌మ్యాల‌ను రెచ్చ‌గొడితే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదు. చంద్ర‌బాబు పాల‌న మీద పూర్తిగా ప‌ట్టు కోల్పోయాడు. త‌న పార్టీ ఎమ్మ‌ల్యేలు చేసే అరాచ‌కాల‌ను అడ్డుకోలేక‌పోతున్నాడు. ఎస్పీ ఆఫీసులో చొర‌బ‌డి ఎమ్మెల్యే దౌర్జ‌న్యం చేస్తే ఇంత‌వ‌ర‌కు చ‌ర్య‌లు తీసుకోలేపోయాడు. స్పీక‌ర్ ఏకంగా ఒక దళితుడిని అంద‌రూ చూస్తుండ‌గానే చెంప దెబ్బ కొట్టాడు. మ‌హిళ‌ల‌ను న‌డిరోడ్డు మీద కొడుతున్నారు. కాళ్లూ చేతులూ క‌ట్టేసి అత్యాచారాలు చేస్తున్నారు. ఏ ఒక్క ఘ‌ట‌న‌లోనూ నిందితుల‌కు శిక్ష‌లు ప‌డింది లేదు. ఇలాంటి వ్య‌క్తి రాష్ట్రానికి ముఖ్య‌మంత్రి కావ‌డం రాష్ట్ర ప్ర‌జ‌ల దౌర్భాగ్యం. ఇంకోసారి వైయ‌స్ జ‌గ‌న్ గారి గురించి నోటికొచ్చిన‌ట్టు మాట్లాడితే స‌హించేది లేదని శ్రీకాంత్ రెడ్డి హెచ్చరించారు.

Back to Top