తాడేపల్లి: 'వారం రోజులైంది. మంత్రి నారా లోకేశ్ ఎక్కడున్నారో... ఎక్కడకెళ్లారో కూడా తెలియడం లేదు. మన హయాంలో ఏ మంత్రి అయినా విదేశాలకు వెళ్లాలంటే అవసరమా అని ఆలోచించేవారు. కానీ.. ఇప్పుడు బాధ్యతాయుత మైన మంత్రి రహస్యంగా విదేశీ పర్యటనలకు వెళ్తు న్నారు. మంత్రుల రహస్య పర్యటనల వెనుక ఆం తర్యమేమిటో ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదా అని వైయస్ఆర్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. వైయస్ఆర్‌సీపీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు అధ్యక్ష తన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం దళిత గళ సమ్మేళనం జరిగింది. ముఖ్యఅతి దిగా హాజరైన సజ్జల మాట్లాడుతూ.. అంబేడ్కర్ వారసత్వాన్ని వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ ఎలా ముందుకు నడిపించారనే విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. చంద్రబాబు పాలన మొదలై రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ జగన్ పేరెత్తకుండా మాట్లాడలేకపోతు న్నారని ఎద్దేవా చేశారు. ప్రతి పనిలో కమీషన్లు, వాటాలు, దోపిడీనేనని మండిపడ్డారు. సొంత ఆదాయం ఎలా పెంచుకోవాలనే దానిపై పీహెచ్ఎ చేశారని, సంక్షోభం వస్తే ఆనందం, దానిని అడ్డం పెట్టుకుని దోచుకోవడం రివాజుగా మారింద న్నారు. టీడీపీ నేతల దోపిడీకి పోలీసులు అందగాఉంటున్నారని ఆరోపించారు. ఇప్పుడు కొత్తగా వాంగ్మూలం పేరుతో వేధింపులకు గురిచేస్తున్నార న్నారు. చంద్రబాబు చేస్తున్న మాయాయుద్ధాన్ని దీటుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహారం పక్కనపెట్టారని, ఇప్పుడు కొత్తగా మహిళా రిజర్వేషన్ల బిల్లు విషయంలో ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలంటున్నారని సజ్జల పేర్కొన్నారు. మహిళా బిల్లును రాష్టంలో ఎవరు వ్యతిరేకించారని సమావేశాలు నిర్వ హించాల నుకుంటున్నారో తెలియడం లేదన్నారు. ఇలాంటి విన్యాసాలు చేయడం ఒక్క చంద్రబాబుకు తప్ప ఎవరికీ సాధ్యం కాదన్నారు. ఏపీలో బలమైన ప్రతిపక్షంగా మనం ఒకవైపు ఉంటే.. మరోవైపు ప్రభుత్వం, దానికి వంత పాడుతున్న ఎల్లో మీడియా ఉన్నాయని చెప్పారు. వైఎస్ జగన్ హయాంలో కులం మతం, ప్రాంతం చూడకుండా అర్హులైన ప్రతి ఒక్క రికీ సంక్షేమం అందేలా చేశారన్నారు. కానీ బాబు మాత్రం వడబోసి పథకాల లబ్దిదారులకు కోతలు విధిస్తున్నారని మండిపడ్డారు. కట్టుకథలు అల్ల డం, ఎక్కడో జరిగిన చిన్న ఘటనను రాష్ట్రమంతా ఇలాగే ఉందని ప్రచారం చేయడంలో చంద్రబాబును, టీడీపీ నేతలను మించినవారు లేరన్నారు. రెండేళ్లలో పదుల సంఖ్యలో హత్యలు, గ్రామ బహిష్కరణలు జరుగుతూనే ఉన్నాయని.. ఇవేవీ ఎక్కడా బయటికి రావడం లేదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను పార్టీ శ్రేణులు గట్టిగా ఎండగట్టాలన్నారు. ఆస్పత్రుల్లో మం దులు లేకపోవడం, ఆరోగ్యశ్రీ నిర్వీర్యమైన తీరు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయిన తీరు, పంటలకు మద్దతు ధరలు లేని తీరును ప్రజలు అడగ కుండా చేసేందుకు పెద్ద దస్తగిరి హత్యపై దుష్ప్ర చారాలు చేస్తున్నారని చెప్పారు. మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ.. దళితులకు సమా జంలో గౌరవం హోదా తీసుకొచ్చింది నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అయితే.. ఆ తరువాత వైఎస్ జగన్ పాలనలోనే ఇదంతా పొందగలిగామన్నారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ.. ఏపీలో ఎప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చినా దళితులపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. సమావేశంలో మాజీ మంత్రులు మేరుగు నాగార్జున, తానేటి వనిత, సాకే శైలజానాధ్, ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పి రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలూరు సాంబశి వారెడ్డి తదితరులు పాల్గొన్నారు.