హద్దులు మీరి కూటమి ఎమ్మెల్యేల అరాచకాలు

మహిళలపై అకృత్యాలు, అధికారులపై వేధింపులు

పీఠం కోసం పోరులో చంద్రబాబు, లోకేష్ బిజీ

మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ఫైర్

తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు

బరి తెగిస్తున్న కూటమి ఎమ్మెల్యేలు

మహిళలు, అధికారులపై వేధింపులు

రెడ్ బుక్ తో రాజ్యాంగానికి లోకేష్ తూట్లు

వారి బాటలోనే ఎమ్మెల్యేల అకృత్యాలు

మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఆక్షేపణ

టోల్ ప్లాజాల వద్ద ఎమ్మెల్యేల అనుచరుల దాడులు

ఎమ్మెల్యే స్టికర్లున్న కార్లతో అనుచరుల ఆగడాలు

టోల్ ప్లాజా సిబ్బందిపై దాడులు, కిడ్నాప్ లు

అయినా మొద్దునిద్ర పోతున్న ప్రభుత్వం 

మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు మండిపాటు

మహిళలతో ఎమ్మెల్యేల అక్రమ సంబంధాలు 

వీడియోలతో అడ్డంగా దొరికినా చర్యల్లేవు

అధికారులపైనా ఎమ్మెల్యేల దాడులు

అధికారం పీఠం కోసం చంద్రబాబు, లోకేష్ పోరు

 మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ధ్వజం

తాడేపల్లి: రాష్ట్రంలో కూటమి పార్టీల ఎమ్మెల్యేల్లో రోజురోజుకూ బరి తెగింపు ధోరణి పెరిగిపోతోందని, తాజాగా టోల్ ప్లాజాల వద్ద ఎమ్మెల్యేల అనుచరుల ఆగడాలు, కిడ్నాప్ లు, మహిళలపై వేధింపులు, అధికారులపై దాడులే ఇందుకు నిదర్శనమని వైయ‌స్ఆర్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్లో మండిపడ్డారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఇంత నిస్సిగ్గుగా, బహిరంగంగా దాడులకు, వేధింపులకు దిగుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ, ఆయన కుమారుడు లోకేష్ కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ పల్లెత్తు మాట మాట్లాడటం లేదని సుధాకర్ బాబు ఆక్షేపించారు. చంద్రబాబు, లోకేష్ అధికార పీఠం కోసం పోటీ పడుతూ బిజీగా ఉంటే, పోలీసులు కూడా దీన్ని సాకుగా భావించి తప్పు చేసిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. 
ప్రెస్ మీట్ లో మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ఇంకా ఏమన్నారంటే..

హద్దు మీరుతున్న కూటమి ఎమ్మెల్యేల అకృత్యాలు

కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు బరితెగించి నీచమైన పనులకు పాల్పడుతున్నారు. కూటమి నడుపుతున్న పెద్దలే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి బాబా సాహెబ్ అంబేద్కర్ తెచ్చిన రాజ్యాంగానికి తూట్లు పొడుస్తుంటే, ఎమ్మెల్యేలు కూడా వారి బాటలోనే నడుస్తున్నారు. ఎమ్మెల్యేల్ని అదుపుచేయాల్సిన ముఖ్యమంత్రితో పాటు మంత్రి అయిన ఆయన కుమారుడు లోకేష్, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ .. తాము ప్రజలకు కస్టోడియన్ గా ఉన్నాం, రాచరికంలో లేమన్న విషయాన్ని పోలీసులు, అధికారులకు నేర్పించడంలో పూర్తిగా విఫలమయ్యారు. మీరు ఎలాగైనా వ్యవహరించండి, మహిళల్ని అసభ్యంగా వ్యవహరించండి, టోల్ గేట్ల వద్ద గూండా గిరీ చేయండి, దళిత బిడ్డల్ని రేప్ లు చేయండి, డప్పు కళాకారుల్ని చెంపదెబ్బలు కొట్టండి.. మేం ఉన్నామన్న భరోసా వారికి ఇస్తున్నారు. సెక్యులర్ రాష్ట్రంలో డిప్యూటీ స్పీకర్ మత స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ పదే పదే దళితుల్ని అవమానిస్తున్నా ఏం ఫర్వాలేదు అంటున్నారు. రాయలసీమలో అధికారుల్ని బెంబేలెత్తిస్తూ రౌడీయిజం చేస్తున్నా, నరసరావుపేట ఎమ్మెల్యే ఎస్పీ ఆఫీసు బాత్ రూంలోకి వెళ్లి గడియపెట్టుకున్నా చర్యల్లేవు. 

టోల్ ప్లాజాలపై దాడులు, మహిళలపై వేధింపులు

రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, వారి అనుచరుల ప్రవర్తనకు గుండబోయినపల్లి టోల్ ప్లాజా ఘటన నిదర్శనంగా నిలిచింది. టీడీపీ ఎమ్మెల్యే సురేంద్రబాబు అనుచరులు టోల్ ప్లాజా మేనేజర్, మహిళా సిబ్బందిపై దాడి చేసి కారులో ఎత్తుకెళ్లిపోయారు. ఎమ్మెల్యే అక్కడే ఉన్నా కారు దిగి వారించలేదు. నంద్యాల జిల్లా రుద్రవరం టోల్ ప్లాజా వద్ద ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అనుచరులు టోల్ కట్టమన్నందుకు ఇలాగే దాడి చేశారు. సాధారణంగా ఎమ్మెల్యేలు కారులో ఉంటే టోల్ ప్లాజాల్లో ఉచితంగానే అనుమతిస్తున్నారు. కానీ ఎమ్మెల్యేలు లేకపోయినా స్టిక్కర్లు వేసుకుని అనుచరులు ప్రయాణిస్తూ.. అడిగితే టోల్ గేట్ సిబ్బందిపై దాడులు చేయడం, కిడ్నాప్ లు చేస్తున్నారు.  టీడీపీ ఎమ్మెల్యేల రాసలీలలు హద్దుమీరుతున్నాయి. చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలితో రాసలీలలు జరుపుతూ వీడియోల్లో దొరికినా ఏమాత్రం చర్యలు తీసుకోలేని దుస్దితి ఈ ప్రభుత్వానిది. ఆ మహిళతో  స్వయంగా ముఖ్యమంత్రే రాజీ చేయించారని పత్రికల్లో చదివి ఆశ్చర్యపోయాం. 

చంద్రబాబు, పవన్ ఏం చేస్తున్నారు ?

మరో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనను వాడుకుని మోసం చేశాడని ఓ మహిళ పదే పదే మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ ను న్యాయం చేయమని అడుగుతోంది. ఆ బాధిత మహిళను కాపు కులానికి చెందిన వ్యక్తి నడి రోడ్డు మీద కర్రలతో కొడుతుంటే పవన్ కళ్యాణ్ ఎక్కడికి పోయారు ? ఈ రోజు వరకూ మీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చేసిన దారుణంపై పార్టీ తరఫున ఎందుకు చర్యలు తీసుకోలేదు ? కనీసం ఆ మహిళపై మీ కార్యకర్త చేసిన దాడిని ఎందుకు ఖండించలేదు, ఇప్పటివరకూ అతనిపై ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలి. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఓ మహిళతో అసభ్యంతా వ్యవహరిస్తూ వీడియోల్లో దొరికితే ఇప్పటికీ చర్యల్లేవు. విజయనగరం జిల్లాలో మహిళా మంత్రి గారి కొడుక్కి.. నీ మీద మనసుందంటూ ఓ మహిళతో  స్వయంగా ఆమె పీఏ మాట్లాడిన ఆడియో బయటికి వస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు. గతంలో ప్రభుత్వ ఛీఫ్ విప్ గా పనిచేసిన మరో ఎమ్మెల్యే కూన రవికుమార్ శ్రీకాకుళం జిల్లాలో కేజీబీవీ ప్రిన్సిపాల్ పై వేధింపులకు దిగితే, ఆమె ఫిర్యాదును పట్టించుకోకపోతే పురుగుల మందు తాగి చనిపోతానని హెచ్చరించడం నిజం కాదా ? ఇంత మంది మహిళల్ని కూటమి ఎమ్మెల్యేలు చెరబడుతుంటే, వేధింపులకు దిగుతుంటే.. ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారో అర్దం కావడం లేదు. 
    రాష్ట్రంలో మహిళల్ని ముఖ్యమంత్రి తన అక్కా చెల్లెళ్లుగా ఎందుకు భావించడం లేదు ? మీరే స్వయంగా నేరాల్ని ప్రోత్సహిస్తారు కాబట్టే ఈ మౌనం అని అర్దమవుతోంది. రాష్ట్రంలో రాజకీయ ప్రత్యర్దులు ఉండకూడదని కక్షపూరితంగా వ్యవహరిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. ప్రజా పాలన గాలికొదిలేశారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు దళిత సామాజిక వర్గానికి చెందిన డప్పు కళాకారుడ్ని చెంప చెళ్లుమనేలా కొట్టి, అత్యంత హీనంగా అవమానించారు. తెల్లవారే సరికి ఆ అమాయకుడిని భయపెట్టి..  ఏం జరగలేదని చెప్పించారు. ఎందుకు టీడీపీ ఇలాంటి స్పీకర్ ను భరిస్తోంది ? ఇలాంటి స్పీకర్ రాజ్యాంగ పదవిలో కూర్చోవడానికి పూర్తిగా అనర్హుడు. అలాగే రాజమండ్రి ఎమ్మెల్యే వాసుకు ముఖ్య అనుచరుడు సత్యదేవ్ అనే వ్యక్తి మరో మైనర్ బాలికను వంచించి గర్భవతిని చేశాడు. న్యాయం చేయమని అర్థిస్తే, ఈ దుష్ట ప్రభుత్వం డబ్బులిస్తాం సర్దుకోమని చెప్పింది. జగన్మోహన్ గారి కంటే బాగా పాలిస్తాను, నేను మారిపోయాను, నాకు అనుభవం ఉందని మోసపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఈ అరాచకాల్లోనే మీ అనుభవం ఉందని అర్థమవుతోంది. 

పరిశ్రమల్నీ వదలని కూటమి ఎమ్మెల్యేలు

రాష్ట్రంలో పరిశ్రమలపై సైతం వేధింపులకు దిగుతున్నారు. రామాయపట్నం పోర్టు నిర్మాణ సంస్థకు వెళ్తున్న లారీల్ని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆపి తనకు కప్పం  కట్టాల్సిందే అని హుకుం జారీ చేస్తున్నారు. ఎందుకు ఇలాంటి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోలేదు ? కింగ్ ఫిషర్ కు ఏడాదికి  18 కోట్లు కట్టాలని స్వయంగా మంత్రి అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. ఆయనే డిమాండ్ చేసి సమస్యలు సృష్టించి, తన దగ్గరకు వస్తే పంచాయతీ చేసి పంపించారు. టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ సిమెంట్ పరిశ్రమలకు తన నియోజకవర్గం నుంచి వెళ్లాలంటే లారీలు కప్పం కట్టాల్సిందే అంటున్నారు. అల్ట్రాటెక్ అనే సిమెంట్ కు ఫ్లైయాష్ సరఫరా చేస్తామని కూటమిలో ఇద్దరు ఎమ్మెల్యేలు కొట్టుకుంటున్నారు. స్వయంగా బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అల్ట్రాటెక్ వాళ్లను బెదిరించి సున్నపురాయి రవాణాను అడ్డుకున్నారు. కలెక్టర్ కు యాజమాన్యం ఫిర్యాదు చేస్తే కేసు నమోదైంది. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తప్పతాగిన మైకంలో అటవీ సిబ్బందిపై దాడులకు దిగారు. పత్రికల్లో రోజూ ఈ ఘటనలపై వార్తలు వస్తున్నా ప్రభుత్వం నుంచి చర్యలు శూన్యం. కియా కాంట్రాక్టుల్నీ మాకే కావాలని మంత్రి సవిత అనుచరులు దౌర్జన్యాలు చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి అనుచరులు స్వయంగా దోపిడీలకు పాల్పడుతుంటే ప్రభుత్వం మొద్దునిద్ర పోతోంది. టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్ గిరిజనులను బాస్టర్డ్ అని తిట్టారు. తర్వాత పంచాయతీకి వెళ్లి దాన్ని సరిచేసుకున్నారు. ఈ ఘటనలన్నీ వాళ్ల అనుకూల పత్రికల్లోనే హెడ్ లైన్స్ లో కనిపిస్తున్నాయి. దీనిపై చర్చకు ఎక్కడైనా మేం సిద్దం. 

అధికార పీఠం కోసం చంద్రబాబు, లోకేష్ మధ్య పోరు

రైల్వే అభివృద్ధి పనుల్లో 70 లక్షలు కమిషన్ కావాలని మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం అడుగుతున్నారు. కూటమి ఎమ్మెల్యేలకు మీడియాతో పాటు ఎవరన్నా లెక్కలేదు. మల్లన్న సన్నిధిలోనూ దోపిడీలు తప్పడం లేదు. దేవస్థానంలో ఏ టెండరైనా 7 శాతం బీ ట్యాక్స్ చెల్లించాల్సిందేనట. శ్రీశైలం మండలంలో ఇసుక, కంకర టన్నుకు పంద చొప్పున బీ ట్యాక్స్, సున్నిపెంటలో మద్యం దుకాణాల నుంచి నెలకు రెండు లక్షలు వసూలు చేస్తున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఏందిరా నీ ఓవర్ యాక్షన్, నువ్వేం పీకలేవు అంటూ అధికారుల్ని బెదిరిస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ గూండాలు, రౌడీలు, రేపిస్టులతో నిండిపోయి గబ్బు పట్టిపోయింది. స్వయానా ముఖ్యమంత్రి కక్షసాధింపు రాజకీయాలకు తెరలేపినప్పుడు, ఆయనకు ఇది ప్రజారాజ్యమని గుర్తులేనప్పుడు, తాను ప్రజల నుంచి ఎన్నికైన ముఖ్యమంత్రి అనే స్పృహలే లేనప్పుడు, కొడుక్కీ, ఆయనకూ ముఖ్యమంత్రి పీఠంపై ఘర్షణ జరుగుతున్నప్పుడు ఇలాంటి ఘటనలే జరుగుతుంటాయి. చంద్రబాబు పీఠం వదిలేస్తే లోకేష్ ఎక్కేందుకు సిద్దంగా ఉన్నారు. పీఠం కోసం చంద్రబాబు, లోకేష్ కొట్టుకుంటున్నారు, పవన్ అనారోగ్యంతో ఉన్నారు.. ఇవన్నీ చూస్తున్న పోలీసులు కూడా వీళ్లేమీ పట్టించుకోరని నిర్ధారించుకుని, కూటమి ఎమ్మెల్యేల దాష్టీకాలపై చర్యలు తీసుకోవడమే మానేశారు. మనకేం పట్టిందని పోలీసులు చేతులెత్తేస్తున్నారు. అందుకే డ్రగ్స్, గంజాయి, మద్యం రాష్ట్రంలో ఏరులై పారుతున్నా వాళ్లు పట్టించుకోవడం లేదు. మళ్లీ ఈ రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే ఇలాంటి దారుణాలు ఆగేలా ఉన్నాయి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా ఎమ్మెల్యేలు తప్పు చేస్తే ఏ రోజూ ఉపేక్షించలేదని టీజేఆర్ సుధాకర్ బాబు గుర్తుచేశారు.

Back to Top