తాడేపల్లి : శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా భక్తులందరికీ వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వైయస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా భక్తులందరికీ శుభాకాంక్షలు. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సఖ్యత, సంతోషాలు మరియు అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’అని పేర్కొన్నారు.