దర్శిలో డీఎస్సీ అక్రమాలపై రౌండ్ టేబుల్ సమావేశం

 నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి

వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి

దర్శి: డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలు, నిరుద్యోగ యువత సమస్యలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై దర్శిలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దర్శి ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పాల్గొన్నారు.

నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలి

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డీఎస్సీ నియామక ప్రక్రియలో తలెత్తినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి అర్హులైన ప్రతి అభ్యర్థికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు.

హామీలు అమలు చేయాలి

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి అమలు చేయాలని, విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత హక్కుల పరిరక్షణ కోసం వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

Back to Top