జ‌గ‌న్ ఇంటి గేటు తాకే స్ధాయి కూడా మ‌హాసేన రాజేశ్‌కి లేదు

వైయ‌స్ జ‌గ‌న్ గారి గురించి నోటికొచ్చిన‌ట్టు మాట్లాడితే తరిమి త‌రిమి కొడ‌తాం

వైయ‌స్ఆర్‌సీపీ  ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయేల్ తీవ్ర హెచ్చ‌రిక‌

మీడియోకు వీడియో విడుద‌ల చేసిన ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయేల్

చంద్ర‌బాబు, లోకేష్‌ ప్రాప్తం కోసం పాకులాట‌

అమ‌లాపురం: ఎమ్మెల్సీ అనంతబాబును మాజీ ముఖ్య‌మంత్రి వైయస్ జ‌గ‌న్ గారు త‌న ఇంట్లో దాచి అరెస్టు కాకుండా కాపాడుతున్నారంటూ ఆధారాలు లేకుండా మ‌హాసేన రాజేశ్ నోటికొచ్చిన‌ట్టు అబ‌ద్ధాలు మాట్లాడుతున్నాడు. తానే ద‌ళిత కుల ర‌క్ష‌కుడినైట్టు చెప్పుకుంటూ వైయ‌స్ జ‌గ‌న్ గారి మీద ఆరోప‌ణ‌లు చేసి సీఎం చంద్ర‌బాబు దృష్టిలో ప‌డ‌టానికి తెగ తాప‌త్ర‌య ప‌డుతున్నాడు. కాకినాడ‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ని టార్గెట్ చేసి మాట్లాడాడు. జ‌గ‌న్‌ని తిడితే చంద్ర‌బాబు ప‌ద‌వులు ఇస్తాడ‌ని త‌పించిపోతున్నాడు. మ‌హాసేన రాజేశ్ గ‌తంలో ఎక్క‌డుండేవాడు, ఏ ప్రాతిపదిక‌న ఏపీలో అడుగుపెట్టాడో ఒక‌సారి పున‌రాలోచించుకోవాలి. క్రైస్త‌వ సోద‌రుల మీద జ‌రుగుతున్న దాడులు అరిక‌ట్టి వారిని ర‌క్షించ‌డానికి వ‌చ్చాన‌ని ఒక‌సారి, చాలాకాలం పాటు చంద్ర‌బాబు భ‌జ‌న చేసిన మ‌హాసేన రాజేశ్ ఆ త‌ర్వాత‌ వైయస్ జ‌గ‌న్ గారే ఈ రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా ఉండాల‌ని కొన్నాళ్లు మాట్లాడాడు. కూట‌మి అధికారంలోకి రాగానే మ‌ళ్లీ చంద్ర‌బాబు భ‌జ‌న మొద‌లుపెట్టాడు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక రెండేళ్లుగా ద‌ళితుల మీద జ‌రుగుతున్న దాడులు, ద‌ళిత యువ‌తులు, చిన్నారులు, మ‌హిళ‌ల మీద జ‌రుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలు క‌నిపించ‌డం లేదా?  రెండేళ్ల‌లో ఒక్క‌సారైనా వాటిని ఖండించావా?  

ద‌ళితుల మీద జ‌రుగుతున్న దాడులు కనిపించ‌డం లేదా?

ప‌వ‌న్ క‌ళ్యాన్ ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురంలో ద‌ళితుల‌ను సామాజిక బ‌హిష్క‌ర‌ణ చేస్తే ప‌ట్టించుకోలేదు. ఆకివీడులో రామాల‌యం విష‌యంలో స్వ‌యంగా డిప్యూటీ స్పీక‌ర్ ద‌ళిత వాడ‌కి వెళ్లి ద‌ళితుల‌ను భయ‌భ్రాంతుల‌కు గురిచేయ‌డ‌మే కాకుండా సుమారు 58 మంది మీద నాన్‌బెయిల‌బుల్ సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేసి జైళ్ల‌కు పంపితే ఏమ‌య్యాడు?  ఇదే ఆకివీడులో 250 ఇళ్ల‌ను నోటీసులిచ్చి కూల‌గొట్టిస్తుంటే నోరు మెద‌ప‌లేదు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఇలాకాలో ద‌ళిత యువ‌కుల‌ను పోలీసులు న‌డిరోడ్డు మీద బ‌హిరంగంగా అరికాళ్ల మీద కొడుతుంటే ఏమ‌య్యాడు?  ప‌ల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామంలో సాంబ‌య్య ద‌ళిత నాయ‌కుడు ని క‌త్తులు, రాడ్డుల‌తో దారుణంగా హ‌త‌మార్చితే క‌నీసం ఖండించ‌లేదు. చంద్ర‌బాబు, లోకేష్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, డిప్యూటీ స్పీక‌ర్ల నియోజ‌క‌వ‌ర్గాల్లో ద‌ళితుల మీద వ‌రుసుగా దాడులు, దౌర్జ‌న్యాలు జ‌రుగుతున్నా నోరెత్త‌కుండా ఉండేందుకు వారి నుంచి ఎంత ప్యాకేజీ తీసుకున్నాడో చెప్పాలి. 
అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లాలో పి గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం కుందాన‌ప‌ల్లి అనే గ్రామంలో ద‌ళిత యువ‌కుడు చ‌నిపోతే శ్మ‌శానానికి తీసుకెళ్ల‌నీయ‌కుండా అడ్డుకున్న‌ప్పుడు ద‌ళితుల ప‌క్షాన ఎందుకు మాట్లాడ‌లేదు? భీమ‌వ‌రంలో ద‌ళిత యువ‌తిని కూట‌మి కార్య‌క‌ర్త‌లు అత్యాచార య‌త్నం చేస్తే వారిని కాపాడటానికి ప్ర‌య‌త్నం చేసిన డీఎస్పీని హైకోర్టు తీవ్రంగా మందిలించింది. ఆ యువ‌తిని క‌లిసి క‌నీసం సంఘీభావం ప్ర‌క‌టించావా? 

ఎక్క‌డ ప్యాకేజీ దొరికితే అక్కడ వాలిపోతాడు

మ‌హాసేన రాజేశ్ ఎప్పుడెలా మారిపోతాడో ఆయ‌న‌కే స్ప‌ష్టత ఉండ‌దు. కొంత‌కాలం బ్రాహ్మ‌ణుల‌ను సంఘ విద్రోహులుగా చిత్రీక‌రించి అవ‌మానించాడు. కొన్నాళ్లు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని అత్యంత జుగుప్సాక‌రంగా తిట్టాడు. కొన్నాళ్లు చంద్ర‌బాబుని తిట్టాడు. ఇప్పుడు ప్యాకేజీ కోసం అదే చంద్ర‌బాబు భ‌జ‌న చేస్తున్నాడు. వైయ‌స్ జ‌గ‌న్ గారిని విమ‌ర్శించినంత మాత్రాన పెద్దోడివి అయిపోతాన‌ని క‌ల‌లు కంటున్నాడు కావొచ్చు. లోకేష్‌, చంద్ర‌బాబు పిలిచి ప‌ద‌వులు ఇస్తార‌ని ఆశ కావొచ్చు. వైయ‌స్ జ‌గ‌న్ గురించి అవాకులు చవాకులు పేలితే ఊరుకునేది లేదు. వైయ‌స్ జ‌గ‌న్ గారి ఇంటిని కాదు క‌దా, ఆయ‌న ఇంటి గేటును కూడా తాకే స్థాయి రాజేశ్‌కి లేదు. పి గ‌న్న‌వ‌రం టీడీపీ టికెట్ ఇస్తే, ప్ర‌జ‌ల్లో వ‌చ్చిన వ్య‌తిరేక‌త చూసి చంద్ర‌బాబు వెన‌క్కి తీసుకోవాల్సిన ప‌రిస్థితి ఎదురైంది. ఈ సంఘ‌ట‌న గుర్తు చేసుకుంటేనైనా ఆయ‌న స్థాయి ఏంటో తెలిసిపోతుంది. రూ. 2 కోట్ల‌తో ఇళ్లు క‌ట్టుకునే స్థాయి రాజేశ్ మ‌హాసేన‌కి ఎక్క‌డి నుంచి వ‌చ్చిందో చెప్పాలి. వైయస్ జ‌గ‌న్ గారి గురించి ఎక్కువ మాట్లాడితే వైయ‌స్సార్సీపీ కార్య‌క‌ర్త‌లు త‌రిమి తరిమి కొడ‌తారు.

Back to Top