శ్రీ‌కాకుళంలో బూడి ముత్యాల నాయుడికి ఘన స్వాగతం 

శ్రీకాకుళం: వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ పరిశీల‌కుడి హోదాలో జిల్లాకు తొలిసారి విచ్చేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి, పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్ బూడి ముత్యాల నాయుడుకు జిల్లా నాయకత్వం ఆత్మీయ స్వాగతం పలికింది.
ఈ సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రి, శ్రీకాకుళం జిల్లా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ స్వయంగా కలిసి బూడి ముత్యాల నాయుడును ఆహ్వానించారు. నాయకులు పరస్పరం ఆత్మీయంగా పలకరించుకుంటూ, జిల్లా రాజకీయ పరిస్థితులు, పార్టీ కార్యకలాపాలపై చర్చించారు. జిల్లాలో పార్టీ బలోపేతం, కేడర్ సమన్వయం, రాబోయే కార్యక్రమాలపై సమగ్రంగా చర్చించినట్లు సమాచారం. గ్రామ స్థాయి నుంచి పార్టీ నిర్మాణాన్ని మరింత బలపర్చడం, ప్రజా సమస్యలపై వేగంగా స్పందించడం వంటి అంశాలపై కూడా దృష్టి సారించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఇతర పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. పార్టీని జిల్లాలో మరింత బలోపేతం చేసే దిశగా ఈ పర్యటన కీలకంగా మారనుందని నాయకులు అభిప్రాయపడ్డారు.

Back to Top