కూటమి ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే అక్రమ అరెస్టులు 

వైయ‌స్ఆర్‌సీపీకి పెరుగుతున్న ప్రజా ఆదరణను ఓర్వలేక వైయస్ భారతమ్మపై అసభ్య పోస్టులు 

వైయ‌స్ఆర్‌సీపీ సోషల్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బాబా సలామ్ 

అనంత‌పురం: కూటమి ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే అక్రమ అరెస్టులు చేస్తున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ సోషల్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బాబా సలామ్ మండిప‌డ్డారు. గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి వైయస్ భారతమ్మపై తీవ్ర అసభ్యకర పదజాలంతో తప్పుడు పోస్టులు చేస్తున్న వారి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని  డిమాండ్ చేశారు. గుంతకల్లు పట్టణ పోలీసులకు ఆయనతో పాటు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి షేక్ రియాజ్ ఫిర్యాదు చేశారు. 

ఈ సందర్భంగా షేక్ బాబా సలామ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నిజాలను ప్రజలకు చేరవేస్తున్న వైయ‌స్ఆర్‌సీపీ సోషల్ మీడియాను అణచివేయాలనే ఉద్దేశంతోనే అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అదే విధంగా సీనియర్ జర్నలిస్ట్, వైయ‌స్ఆర్‌సీపీ మీడియా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అరెస్టుతో రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిస్థితులు దిగజారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలా కొనసాగితే కూటమి ప్రభుత్వానికి భవిష్యత్తులో తీవ్ర రాజకీయ నష్టం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ ప్రచార విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కల్లు రమేష్ గౌడ్, సోషల్ మీడియా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి షేక్ రియాజ్, యువజన విభాగం అధ్యక్షుడు అబ్దుల్ బషీద్, నగర నాయకులు మనోజ్, ఫయాజ్ బాషా, జాఫర్, అలాగే ఫైజల్, ఆషిఫ్, సోహైల్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.
 

Back to Top