గుండెకాయ లేని శరీరంలా 'విశాఖ రైల్వే జోన్'.

కూటమి నేతల చేతగానితనానికి ఇదే నిదర్శనం: మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైర్.

విశాఖపట్నంలో జిల్లా కోర్టుకు హజరై అనంతరం మీడియాతో మాట్లాడిన వైయస్ఆర్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్.

 
విశాఖపట్నం: విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటవుతున్న రైల్వే జోన్ విషయంలో కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్ర ప్రజల ఆశలను వమ్ము చేసిందని వైయస్ఆర్‌సీపీ ప్రాంతీయసమన్వయకర్త, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వాల్తేరు డివిజన్‌కు ఏటా రూ. 2,250 కోట్ల ఆదాయాన్నిచ్చే 'కేకే లైన్'ను ఒడిశాలో కలుపుతుంటే నోరు మెదపలేని చంద్రబాబు ప్రభుత్వం, ప్రజలను మోసం చేస్తూ సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. రైల్వే జోన్ కోసం పోరాడి జైలు శిక్ష పడినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, కేకే లైన్‌ను విశాఖ జోన్‌లో చేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే...

పోరాటం మాది-  జైలు శిక్ష మాకు.. సంబరాలు మీకా?
విశాఖ రైల్వే జోన్ కోసం వైయస్ఆర్‌సీపీ అలుపెరగని పోరాటం చేసింది. నాలుగు దశాబ్దాల విశాఖ ప్రజల కల అయిన రైల్వే జోన్ కోసం వైయస్ జగన్ ఆదేశాల మేరకు వైయస్ఆర్‌సీపీ నేతలతోపాటు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఆరోజు దీక్షలు చేపట్టాను. ఆనాడు టీడీపీ ప్రభుత్వం అక్రమంగా నా పై ఆత్మహత్యా ప్రయత్నం కేసు పెట్టింది. ఈ పోరాటం కారణంగానే పదేళ్ల పాటు కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఇటీవల న్యాయస్థానం 6 నెలల జైలు శిక్ష విధించింది. అయినా ఈ ప్రాంత భవిష్యత్తు కోసం జైలు శిక్షతో పాటు దేనికైనా సిద్ధమే. 

'కేకే లైన్' ఒడిశా పాలు - కూటమి నేతల చేతగానితనం..

ఇదే కేసుపై నెల రోజుల క్రితం న్యాయస్థానం నాకు  6 నెలల జైలు శిక్ష, రూ.5వేలు జరిమానా విధించింది. దీని మీద పై కోర్టులో అప్పీలు చేసుకున్నాం. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు కోసం దేనికైనా సిద్దంగా ఉన్నామని చాలా సార్లు స్పష్టం చేశాం. ఆ రోజు పోరాటం కారణంగానే 2018లో ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన ప్రధాని మోదీ విశాఖ కేంద్రంగా రైల్వో జోన్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. 2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన  ఆరు నెలల్లోనే కోవిడ్ లాంటి విపత్కర పరిస్ధితులను ఎదుర్కున్నాం. అనంతరం రైల్వేజోన్ ఏర్పాటుకు కేంద్రం భూమి కేటాయించమని అడిగితే ముడసర్లోవలో రైల్వే జోన్ కోసం 50 ఎకరాలను 2024 జనవరిలో కేటాయించాం. దానికి సంబంధించిన గెజిట్ ఇటీవల విడుదలైంది. 
కానీ రైల్వే జోన్ గెజిట్‌లో వాల్తేరు డివిజన్‌కు గుండెకాయ లాంటి కేకే లైన్ లేకపోవడం దారుణం. 
వాల్తేరు డివిజన్‌కు ఏటా రూ. 2,250 కోట్ల ఆదాయాన్ని ఇచ్చే కొత్తవలస-కిరండోల్ (కేకే లైన్)ను ఒడిశాలోని ఈస్ట్ కోస్ట్ రైల్వేలో కలపడం ఈ రాష్ట్ర పాలకుల చేతగానితనమే. ఆదాయ వనరులు లేని, మౌలిక సదుపాయాలు పెరగని జోన్ ఇచ్చినా టీడీపీ నేతలు సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదంగా ఉంది.  ఒడిశాలో కూడా బీజేపీ ప్రభుత్వమే ఉన్నందున, కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ధైర్యం చంద్రబాబుకు లేదని విమర్శించారు. రైల్వే మంత్రి విశాఖకు వచ్చినా నోరు మెదపకపోవడం దారుణం. 

విశాఖ ఎంపీపై ధ్వజం - భూకబ్జాలపై విమర్శలు..

స్థానిక టీడీపీ ఎంపీ భరత్ తీరు ఎంపీ పదవికే మచ్చ తెచ్చేదిలా ఉంది. 55 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన ఎంపీ భరత్ వంటి వ్యక్తులు నీతులు చెప్పడం విడ్డూరం. ఎంపీకి రాజ్యాంగ వ్యవస్థలన్నా, కోర్టు తీర్పులన్నా గౌరవం లేదని, ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ఎంపీగా అనర్హుడిని చేయాలి. జోన్ వస్తే విశాఖలోనే రిక్రూట్‌మెంట్ బోర్డు వస్తుంది, తద్వారా మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కానీ ఆదాయం లేని జోన్ ఇస్తే అవేవీ సాధ్యం కావు. 

రైల్వే జోన్ కోసం పోరాటం ఆగదు..

"గుండెకాయ లేని శరీరం లాంటి జోన్ మాకు వద్దని.... కేకే లైన్‌ను విశాఖ జోన్‌లో కలిపే వరకు వైయస్ఆర్‌సీపీ పోరాటం ఆపదని అమర్నాధ్ స్పష్టం చేశారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని శిక్షలు వేసినా విశాఖ భవిష్యత్తు కోసం గళం ఎత్తుతూనే ఉంటాని స్పష్టం చేశారు. . రైల్వే జోన్, ప్రత్యేక హోదా, పోలవరం వంటి అంశాలను చంద్రబాబు అమరావతి రియల్ ఎస్టేట్ కోసం తాకట్టు పెట్టారని ఆయన పునరుద్ఘాటించారు.కే లైన్'ను విశాఖ జోన్‌లో కలిపి, ఈ ప్రాంత యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కే వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విశ్రాంతి లేకుండా పోరాడుతుందని అమర్నాథ్ స్పష్టం చేశారు.                                                                                      అనంతరం పాత్రికేయుల ప్రశ్నలకు బదులిస్తూ... 
విశాఖ ఎంపీకి, కూటమి నేతలు  అంబేద్కర్ రాజ్యాంగంలోని ఏ వ్యవస్థ మీద నమ్మకం లేదు. కోర్టు తీర్పులను కూడా గౌరవించరు. విశాఖ ఎంపీ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి. అయనకు ఎంపీగా కొనసాగే అర్హత లేదు. ఈ నేపధ్యంలో విశాఖలో భూకుంభకోణాలతో పాటు  అన్ని అంశాలమీద పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.

Back to Top