షర్మిలకు విశ్వసనీయత లేదు. ఆమె మాటలకు విలువ లేదు

వరుదు కళ్యాణి ఫైర్‌

విశాఖపట్నంలోని వైయ‌స్ఆర్‌సీపీ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడిన పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి.

షర్మిల, సునీత అన్నీ అబద్ధాలు చెబుతున్నారు

అయినా విచక్షణతో వైయ‌స్ఆర్‌సీపీ మాట్లాడలేదు

జగన్‌గారి చెల్లెళ్లుగా మర్యాద ఇచ్చాం. ఓర్పు వహించాం

కానీ, వాళ్లిద్దరూ హద్దులు దాటి మాట్లాడుతున్నారు

ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది

అందుకే ఇప్పుడు మీడియా ముందుకు వచ్చాం

వరుదు కళ్యాణి స్పష్టీకరణ

షర్మిల, సునీతకు అవినాష్‌రెడ్డి, శివప్రసాద్‌రెడ్డి ప్రశ్నలు

వాటికి ఇప్పటి వరకు బదులివ్వని షర్మిల, సునీత

ఆ ప్రశ్నలకు మీరు సమాధానాలు చెప్పలేరా?

గట్టిగా నిలదీసిన వరుదు కళ్యాణి

షర్మిల మాటలకు ఎక్కడా, ఏ లాజిక్‌ లేదు

తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టారు

కడదాకా అక్కడే ఉంటాను అన్నారు

ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణలోనే అన్నారు

కానీ అక్కడ పార్టీని మూసేసి ఇక్కడకు వచ్చారు

అందుకే ఆమె మాటలకు ఎక్కడా విలువ లేదు

గుర్తు చేసిన వరుదు కళ్యాణి

విజయమ్మ‌ గారి లేఖ అసలైనది కాదని మేం అనలేదు

మేం అనని మాటను షర్మిల మాట్లాడితే ఎలా?

వైయస్సార్‌గారి వీలునామా అంటూ చెప్పుకొచ్చారు

ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారు

వైయస్సార్‌గారి పేరు మీద మా పార్టీ పని చేస్తోంది

అలాంటి పార్టీ నాయకులను కుక్కలు అంటారా? 

జగన్‌గారి చెల్లెలు కదా అని సహనంతో ఉన్నాం

పూర్తి సంస్కారంతో వ్యవహరిస్తున్నాం

మేం ఆ స్థాయికి దిగజారి మాట్లాడలేం

దబాయించి, బుకాయిస్తే అబద్ధాలు నిజాలవుతాయా?

షర్మిలకు వరుదు కళ్యాణి సూటి ప్రశ్న

కుటుంబ వ్యవహారం ఇంట్లోనే పరిష్కారం కావాలి

అదే మా అభిప్రాయం. లేకపోతే కోర్టుల్లో తేలాలి

హైదరాబాద్‌ ఎన్‌సీఎల్టీలో జగన్‌గారికి అనుకూల తీర్పు

దానిపై మీరు ఎన్‌సీఎల్‌ఏటీలో అప్పీల్‌కు వెళ్లారు

ఆ తీర్పు వచ్చేంత వరకూ ఆగకపోతే ఎలా?

షర్మిల తీరును ఎండగట్టిన వరుదు కళ్యాణి

సరస్వతీ షేర్ల విషయంలోనూ షర్మిల అనైతికత

విజయమ్మగారితో ఆమె తప్పు చేయించారు

దాన్ని ప్రశ్నిస్తుంటే కప్పి పుచ్చేకునే ప్రయత్నాలు

ఆ దిశలో మళ్లీ తప్పుడు ప్రకటనలు చేయిస్తున్నారు

ప్రెస్‌మీట్‌లో తేల్చి చెప్పిన వరుదు కళ్యాణి

విశాఖపట్నం: షర్మిల, సునీత ఇద్దరూ నిరంతరం అబద్ధాలు చెబుతున్నారని, అయినా విచక్షణతో వైయ‌స్ఆర్‌సీపీ  ఎప్పుడూ మాట్లాడలేదని, జగన్‌గారి చెల్లెళ్లుగా వారికి మర్యాద ఇచ్చామని, చాలా ఓర్పు వహించామని వైయ‌స్ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి వెల్లడించారు. కానీ, వాళ్లిద్దరూ హద్దులు దాటి మాట్లాడుతున్నారన్న ఆమె, ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత తమపై ఉన్నందున మీడియా ముందుకు వచ్చామని చెప్పారు.
షర్మిల, సునీత ఇద్దరికీ అవినాష్‌రెడ్డి, శివప్రసాద్‌రెడ్డి ప్రశ్నలు వేశారని, అయితే వాటికి ఇప్పటి వరకు ఆ ఇద్దరూ బదులివ్వలేదని తెలిపారు. ఆ ప్రశ్నలకు వారిద్దరూ సమాధానాలు చెప్పలేరా? అని, విశాఖలో మీడియాతో మాట్లాడిన వరుదు కళ్యాణి నిలదీశారు.
ప్రెస్‌మీట్‌లో వరుదు కళ్యాణి ఇంకా ఏం మాట్లాడారంటే..:

షర్మిలగారు యథావిథిగా పచ్చి అబద్ధాలు:
    ఈ (సోమవారం) మధ్యాహ్నం వైయస్‌ షర్మిలగారు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. మళ్లీ మా పార్టీపైనా, మా నాయకుడిపైన అభాండాలు వేసి, యథావిథిగా పచ్చి అబద్ధాలు చెప్పారు. షర్మిలగారు, సునీత గారు ఏమీ మాట్లాడకుండానే.. మా పార్టీ ఏకపక్షంగా స్పందించిందని, వారిపై విమర్శలు చేసిందని, మాకు వారి గురించి మాట్లాడడం తప్ప, మరే పని లేదన్నట్లుగా షర్మిలగారు కామెంట్స్‌ చేశారు. 
    ఈ విషయంలో షర్మిలగారికి చాలా స్పష్టంగా క్లారిటీ ఇస్తున్నాం. మీరు మాట్లాడకుండా ఉండి ఉంటే, మీరు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ.. అసత్యాలు మాట్లాడక పోయి ఉంటే.. మేం ఏ మాత్రం స్పందించాల్సిన పని లేదు. అసలు మాకు ఆ అవసరం కూడా లేదు.
    రాష్ట్రంలో ఏ చిన్నపిల్లాడిని అడిగినా చెబుతారు.. షర్మిల అయినా, సునీత అయినా.. ఆస్తుల విషయంలో అయినా, వివేకానందరెడ్డిగారి హత్య కేసు విషయంలోనైనా పచ్చి అబద్ధాలు చెబుతున్నారని. ఈ విషయం ఇప్పటికే ప్రజలందరికీ స్పష్టంగా అర్ధమైంది. 

ఆ మాటలు మేము అనకపోయినా..!:
    విజయమ్మగారి లేఖ అబద్ధమని, ఆ లేఖ అసలైనది కాదని మేం అన్నట్లుగా షర్మిలగారు చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఆ లేఖ అసలు కాదని, నకిలీదని ఎవరన్నారు? మేము ఆ మాట అనలేదే?. మా నాయకులు అలా అస్సలు చెప్పలేదే? మీకు మీరుగా ఊహించుకుని మా మీద నింద వేయడం ఏమిటి? అలా విమర్శించడం ఏమిటి? ఈరోజు ప్రెస్‌మీట్‌లో మీరు రాష్ట్రానికి 12 లక్షల కోట్ల అప్పు అన్నప్పుడే ప్రజలకు అర్థమైంది. మీకు స్క్రిప్టు ఎక్కడ నుంచి వస్తుందో.

మేం స్పందించడం తప్పా?:
    వైయస్‌ వివేకానందరెడ్డి గారి హత్య జరిగి ఏడేళ్లైనా , ఆ కేసు ముందుకు వెళ్లకుండా, ట్రయల్‌కు రానీయకుండా, అసూయతోనూ, కుట్రలతోనూ ద్వేషం పెంచుకుని, అమాయకులను ఆ కేసులో ఇరికించి, తద్వారా చంద్రబాబునాయుడుకు రాజకీయ లబ్ధి చేకూర్చడానికి సునీతగారు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. చివరకు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా ఈ కేసులో దర్యాప్తు పూర్తైందని స్వయంగా చెప్పిన తర్వాత, సునీతగారి పిటిషన్లు అన్నీ తిరస్కరించిన తర్వాత కూడా మళ్లీ కడపలో ప్రెస్‌మీట్‌ పెట్టి, గంటసేపు పూర్తి అవాస్తవాలు, పచ్చి అబద్ధాలు మాట్లాడితే.. మా పార్టీ మీద, మామీద బురద జల్లితే, మేం రియాక్ట్‌ కావడం తప్పు అవుతుందా?.
    చంద్రబాబు ఆదేశాల మేరకు వివేకానందరెడ్డిగారి హత్యకేసును ఒక రాజకీయ అజెండా మార్చి, ఆమేరకు అబద్ధాలను పోగు చేస్తూ అదే పనిగా బురద జల్లుతున్న మీది తప్పా? లేకపోతే వాస్తవాలను ప్రజలకు చెప్పే మాది తప్పా?. ఒక్కసారి గుండె మీద చేయి వేసుకుని ఆలోచించండి.  

వాస్తవాలు చెప్పొద్దా? నిజాలు మాట్లాడొద్దా?:
    ఇక ఆస్తుల విషయంలో కూడా అంతే. హైరాబాద్‌లోని ‘నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌’ (Nఇఔఖీ) జగన్‌గారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. మీరు దానిపై చెన్నైలోని ‘నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌’ (Nఇఔఅఖీ)లో అప్పీలుకు వెళ్లారు. మీరు వేసిన కౌంటర్‌ను కోర్టు అధికారికంగా గుర్తించక ముందే, మీరు చంద్రబాబుకు, అక్కడ నుంచి ఈనాడుకు పంపి, మా జగన్‌గారి వ్యక్తిత్వాన్ని హననం చేసేలా కథనాలు రాయిస్తే, ఆ వార్తలు ప్రధాన కథనాల రూపంలో ప్రజలందరినీ తప్పుదోవ పట్టిస్తుంటే, మేం ప్రజలకు వాస్తవాలు చెప్పకూడదా? నిజాలు మాట్లాడకూడదా?. 
    పైగా ఆ కథనంలో వైయస్సార్‌గారి వీలునామా.. అంటే అసలు లేని వీలునామా గురించి మీరు ప్రస్తావిస్తే, వాటి మీద నిజాలు చెప్పడం తప్పు అవుతుందా?. అన్నీ అసత్యాలు చెబుతున్న మీది తప్పా? లేక నిజాలు ఇవీ అని ప్రజలకు వివరిస్తున్న మాది తప్పా?. ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగండి.

అనివార్యంగా మాట్లాడుతున్నాం. అదీ హద్దుల్లోనే:
    మీరు చంద్రబాబుతోనూ, జగన్‌గారి శతృమూకల్లో ఒకరిగానూ మారి, మా మీద నిరంతరం అబద్ధాలతో, అసత్యాలతో బురద జల్లుతూ, మా ప్రతిష్టకు భంగం కలిగిస్తుంటే.. మేం కదలకుండా, మెదలకుండా ఉంటూ.. మీరు వేస్తున్న అభాండాలు భరించాలా?. నిజానికి మేము చాలా రోజుల ఓపిక పట్టాం. ఎందుకులే.. జగన్‌గారి చెల్లెళ్లు కదా.. అని మీరు ఎన్ని మాటలన్నా, ఎన్ని విమర్శలు చేసినా, నిందలు వేసినా.. మేం ఓర్పుతో, సహనంతో, ఒక్క మాట అనకుండా చాలా రోజులు మౌనంగా ఉన్నాం. మా నాయకుడు కూడా మౌనంగా ఉన్నారు.
    అలా మేం ఓర్పుగా ఉండడం, మౌనంగా ఉండడం మాకు చాలా నష్టం చేసింది. మా సంస్కారాన్ని, మా ఓర్పుని మీరు మా బలహీనతగా తీసుకున్నారు. కానీ, ఇది సమాజంలో తప్పుడు సంకేతాలను తీసుకు వెళ్తుందని, అబద్ధాలు వ్యాపిస్తున్నాయని, ఇది మంచిది కాదన్న ఉద్దేశంతో, జగన్‌గారికి ఇష్టం లేకపోయినా, ఆయన వారిస్తున్నా, ఆయన్ని కాదని, మా పార్టీ నాయకులు బయటకు వచ్చి నిజాలు చెప్పాల్సి వస్తోంది. అది కూడా హద్దుల్లోనే. 

కనీసం అప్పటి వరకు ఆగలేకపోయారు!:
    మా జగనన్న ఎందుకు మాట్లాడలేదో తెలుసా? ఇలాంటి వ్యవహారాలు నాలుగు గోడల మధ్య పరిష్కారం కావాలి. లేదంటే న్యాయస్థానాల్లో పరిష్కారం కావాలి అనుకున్నారు. కానీ, మీరు నాలుగు గోడలు దాటి విషయాన్ని బయటకు తెచ్చారు. చట్ట విరుద్ధంగా, అక్రమంగా మీరు సరస్వతీ షేర్లు బదిలీ చేశారు. అందుకనే కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. ఆ కోర్టు కూడా జగన్‌గారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దానిపై మీరు అప్పీల్‌కు వెళ్లారు. కనీసం దానిపై తీర్పు వచ్చే వరకైనా మీరు ఆగాలి కదా?.
    సరస్వతీ షేర్ల అక్రమ బదిలీ విషయంలో విజయమ్మగారితో తప్పు చేయిస్తారు.. దాన్ని ప్రశ్నిస్తే.. మళ్లీ ఆమెతో మళ్లీ తప్పుడు ప్రకటనలు చేయిస్తారు. షర్మిలైనా, సునీత అయినా.. ప్రస్తుతం చేస్తున్నది ఇదే. తప్పుడు ప్రకటనలు, అబద్ధాలు, అసత్యాలు. ఏ మాత్రం రుజువులు, ఆధారాలు, లాజిక్‌ లేని స్టేట్‌మెంట్లు.

మాకు విచక్షణ ఉంది. అందుకే మీలా మాట్లాడలేం:
    అయినా షర్మిలగారి మాటలు చూస్తే.. ఆమె ఏమీ అననట్టుగా, సునీతగారు ఎలాంటి ఆరోపణలు చేయనట్టుగా, కేవలం వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మాత్రమే అన్నీ మాట్లాడుతున్నట్టుగా మళ్లీ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి. ఇంకా నోరు జారిన షర్మిలగారు వైయస్సార్‌సీపీ వాళ్లని ‘కుక్కలు’ అన్నారు. మాకు సంస్కారం ఉంది. విచక్షణ ఉంది. అందుకే మేము మీలా నోరు జారం. నోటికి ఏది వస్తే అది మాట్లాడం. 
    వైయస్సార్‌గారి పేరు మీద ఏర్పడిన పార్టీ మాది. ఆయన భక్తులు కార్యకర్తలుగా, నాయకులుగా ఉన్న పార్టీలో ఉన్న వారిని పట్టుకుని అంత మాట ఎలా అనగలుగుతున్నారు. బహుషా సైతాన్‌ మూకతో మీరు ఒక భాగస్వామిగా మారడం వల్ల, చంద్రబాబుగారి మార్గదర్శకత్వంలో ఉండడం వల్ల, అలాంటి మాటలు అనగలుగుతున్నారు. కాని మాకు సంస్కారం ఉంది. మేం హద్దులు దాటి అలాంటి మాటలు అనలేం. కారణం.. మీరు జగన్‌గారి చెల్లెలు. ఆ మర్యాదతోనే సంస్కారంతో వ్యవహరిస్తు్తన్నాం. ఈసారి మళ్లీ అలాంటి మాటలు వద్దని, సున్నితంగా చెబుత్తున్నాం. మళ్లీ అలా మాట్లాడితే ఎలాంటి మినహాయింపులు ఉండవని కూడా స్పష్టం చేస్తున్నాం.

మీ మాటలకు విలువ, విశ్వసనీయత లేదు:
    షర్మిలగారూ.. మీరు మాట్లాడిన మాటలకు విలువ ఏముంది? , విశ్వసనీయత ఏముంది? తెలంగాణలో పార్టీ పెట్టారు. బతుకంతా తెలంగాణాతోనే అన్నారు. నా ప్రాణం ఉన్నంతవరకూ తెలంగాణాతోనే అన్నారు. నా మెట్టినిల్లు తెలంగాణ అన్నారు. నా జీవితం తెలంగాణకే అంకితం అన్నారు. మరి ఏమైంది? ఎందుకు సడన్‌గా వదిలేశారు? ఎందుకు మీరు ఆంధ్రాకు వచ్చారు? అంటే మీరు చెప్పే మాటలు నిజాలు కాదనేగా? వాస్తవాలు కాదనేగా? బలంగా అవాస్తవాలను, అసత్యాలను చెప్తున్నారనే కదా? ఇవాళకూడా అంతే. అంతే బలంగా, అదే గట్టిగా అబద్ధాలను, అసత్యాలను చెబుతున్నారు.
    జగన్‌గారికి దమ్ము , ధైర్యం ఉంటే సమాధానాలు చెప్పాలి అని అంటున్నారు. రక్తం పంచుకు పుట్టిన అన్నను ఉద్దేశించి మాట్లాడే తీరు ఇదేనా? ఇదేనా మీ పద్దతి?. ఆయన దమ్ము, ధైర్యం గురించి దేశంలో ఏ ఒక్కరిని అడిగినా చెప్తారు.
 
అందుకే బుకాయించే ప్రయత్నం:
    మీరెందుకు ఇలాంటి అనుచితమైన మాటలు, తప్పుడు మాటలు మాట్లాడుతున్నారో తెలుసా.. వివేకానందరెడ్డిగారి హత్య కేసులోనైనా, ఆస్తుల వ్యవహారంలోనైనా మేం అడుగుతున్న ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం లేదు. మీరు మాట్లాడుతున్న మాటలకు లాజిక్‌ లేదు, సహేతుకత లేదు, ఇసుమంతైనా నిజం లేదు. అందుకనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడి బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. దబాయించే ప్రయత్నం చేస్తున్నారు. చేసిన తప్పుడు ప్రకటనలను మళ్లీ కప్పి పుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. 
    ఇప్పటికైనా ఆస్తుల వ్యవహారంలోనైనా, వివేకానందరెడ్డిగారి కేసు విషయంలోనైనా సూటి ప్రశ్నలు అడుగుతున్నాం. షర్మిలగారు, సునీతగారు ఇద్దరూ సమాధానం చెప్పగలరా? మా ఎంపీ అవినాష్‌రెడ్డిగారు, మా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డిగారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? మళ్లీ ఓసారి ఆ ప్రశ్నలను గుర్తు చేస్తున్నాం.

వీటికి సమాధానం చెప్పగలరా?:
– వివేకానందరెడ్డిగారు గుండెపోటుతో మరణించారంటూ ఏబీఎన్, టీవీ5 కూడా ఆరోజు బ్రేకింగ్స్‌ వేశాయి కదా? మరెందుకు వాటిని ప్రస్తావించడం లేదు?
– వివేకానందరెడ్డిగారు గుండెపోటుతో చనిపోయాడు అంటూ ఆయన బావమరిది శివప్రకాష్‌రెడ్డి  చెప్పినట్టుగా, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి చెప్పిన వీడియోలు ఉన్నాయి కదా? ఆ కోణంలో దర్యాప్తును ఎందుకు కోరడం లేదు?
– తానే వివేకాందరెడ్డిగారిని హత్య చేశానంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చిన, టీవీ లైవ్‌షోలో చెప్పిన దస్తగిరి బెయిల్‌ రద్దు చేయాలని సునీత, షర్మిలమ్మ, ఎందుకు గట్టిగా పోరాడడం లేదు? అతని బెయిల్‌ రద్దు చేయాలని ఎందుకు కోరడం లేదు?
– దస్తగిరి, సునీత, చంద్రబాబు తరఫున ఒకే లాయర్‌ సిద్దార్థ లూథ్రా ఎందుకు వాదిస్తున్నారు?
– వివేకా లేఖను వెంటనే పోలీసులకు ఎందుకు ఇవ్వలేదు?ఎందుకు దాచిపెట్టమని చెప్పారు?
– ఆ లేఖపై రెండు రకాల స్టేట్‌మెంట్లు ఎందుకు ఇచ్చారు? రెండు నెలల వ్యవధిలో సునీత ఎందుకు స్టేట్‌మెంట్లు మార్చారు?
– వివేకా హత్యకు ముందు అటెండర్‌ను కాణిపాకం ఎందుకు పంపించారు?
– రౌండ్‌ సీల్‌ డాక్యుమెంట్లు ఏమిటి? వాటి వెనుక ఏముంది? 
– ‘మర్డర్‌ ఫర్‌ గెయిన్‌’ కోణంలో విచారణ ఎందుకు మీరు కోరడం లేదు?
– వివేకానందరెడ్డిగారు, షమీమ్‌ చాటింగ్స్‌ను ఎందుకు బయట పెట్టడం లేదు? ఆస్తుల కోసం షమీమ్‌ను బెదిరించిన మాట వాస్తవం కాదా?
– వివేకానందరెడ్డిగారి చెక్‌పవర్‌ను ఎందుకు రద్దు చేశారు? ఆయన్ని అసహాయ స్థితిలోకి ఎందుకు నెట్టేశారు? 
– షమీమ్‌ కుమారుడికి డీఎన్‌ఏ టెస్టుకు సిద్ధమా?
– సాక్షులపై ఒత్తిడి చేసి తప్పుడు స్టేట్‌మెంట్లు ఎందుకు ఇప్పించారు?
    వీటన్నింటికీ సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం మీకుందా? ఉంటే ఇప్పుడైనా మీరు, సునీత ఇద్దరూ నోరు విప్పండి.

చంద్రబాబును ఒప్పించగలరా?:
    మరి చంద్రబాబు తన అక్కాచెల్లెళ్లు రాజేశ్వరి, హైమావతిలకు ఎన్ని ఆస్తులు ఇచ్చాడు. చంద్రబాబు పేరుమీద ఉన్న ఆస్తి, చంద్రబాబు భార్య సంపాదించిన ఆస్తి, చంద్రబాబు కొడుకు సంపాదించిన ఆస్తిలో వారు వాటాలు అడిగితే సబబేనా? పోనీ మీరు వాదిస్తున్నట్టుగా చంద్రబాబుతో వాదించి ఇప్పించగలరా?.

మరి దీనికేమంటారు?:
    జగన్‌ కంపెనీలలో మీలో ఎవరైనా పెట్టుబడులు పెట్టారా? ఆ కంపెనీలు చేసిన అప్పులకు పర్సనల్‌ గ్యారెంటీలు ఇచ్చారా? ఆ కంపెనీలు నష్టాలలో ఎపుడైనా పాలు పంచుకున్నారా? ఆ కంపెనీల నష్టాలలోనూ, కోర్టు కేసులలోనూ ఏ రోజైనా పాలు పంచుకున్నారా? ఏ రోజైనా భాగం అయ్యారా? కేసులు ఎపుడైనా పట్టించుకున్నారా? ఎవరైనా ఎవరి ఆస్తిలోనైనా లేదా ఎవరి వ్యాపారాలలోనైనా భాగం లేదా వాటా ఎప్పుడు అడగగలుగుతారు?
    ఇంకా మీ ఆస్తులను ఎపుడైనా సీబీఐ లేదా ఈడీ అటాచ్‌ చేసిందా?.. ఉమ్మడి ఆస్తులు కాదు కాబట్టే.. అవి జగన్‌ ఆస్తులు కాబట్టే దర్యాప్తు సంస్థలు అటాచ్‌ చేశాయి.
    రాజశేఖరరెడ్డిగారు 2004 ఎలక్షన్‌ కమిషన్‌కు సమర్పించిన  అఫిడవిట్, 2009 లో సమర్పించిన అఫిడవిట్‌ చూసినా ఎవరికైనా అర్థమవుతుంది. ఆ మధ్య కాలంలో ఆయన సంపాదించిన ఆస్తులు, ఆయన పంపకాలు చేశారని తెలుస్తుంది. ఆయనకు సంబంధం లేని ఆయన కొడుకు ఆస్తిలో, కొడుకు కంపెనీలో లేక కూతురు ఆస్తులో లేక కూతురు కంపెనీలో ఆయన పంపకాలు చేయలేరు కదా? మరి ఆయన రాయని వీలునామాను, లేని వీలునామాను, ఉన్నట్టుగా ఎలా చెప్పగలుగుతున్నారు.

ఇవి నిజాలు కావా?:
    అయినా వైయస్సార్‌గారు మరణించిన 10 ఏళ్ల తర్వాత, మీకు పెళ్లైన 25 ఏళ్ల తర్వాత మీ అన్న ప్రేమతో, అభిమానంతో తన కష్టార్జిత ఆస్తుల్లో కొంత భాగాన్ని ఇస్తానంటూ ఎంఓయూ రాయడం నిజం కాదా? దాంతో పాటు, రూ.236 కోట్లు చెక్కుల రూపంలో ఇచ్చింది నిజం కాదా? 
    ఈడీ అటాచ్‌మెంట్‌లో ఉన్న కంపెనీ షేర్స్‌ బదలాయించకూడదని, అలా బదలాయిస్తే జగన్‌ బెయిల్‌ రద్దయ్యే ప్రమాదముందని, సుప్రీంకోర్టు జడ్జిలు లిఖితపూర్వక ఒపీనియన్‌ ఇచ్చినప్పటికీ దానిని బేఖాతరు చేసి.. జగన్‌గారి దగ్గరే ఉన్న షేర్స్‌ సర్టిఫికెట్స్‌ పోయినట్లుగా ఏకంగా తప్పుడు అఫిడవిట్‌ ఇచ్చి మరీ షేర్స్‌ బదలాయించారు. ఇది తప్పు కాదా?
    అసలు మీడియాకు ఎక్కుతున్నది ఎవరు? ఆస్తుల వ్యవహారానికి సంబంధించి మొదటిసారిగా చంద్రబాబు ద్వారా, టీడీపీ మీడియా ద్వారా షర్మిల తన అన్నకు రాసిన లేఖను ఎవరు లీక్‌ చేశారు?.
    టీటీడీ కల్తీ నెయ్యి, హెరిటేజ్‌ తప్పులు, బీఆర్‌ నాయుడు తప్పులు, పుట్టా మహేష్‌ డ్రగ్స్‌ వ్యవహారం నేపథ్యంలో ఇరకాటంలో పడిన చంద్రబాబు, వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి, టాపిక్‌ డైవర్ట్‌ చేయడానికి చేస్తున్న ప్రయత్నం కాదా ఇది? కాదని చెప్పగలరా? అంటూ షర్మిల, సునీతకు వరుదు కళ్యాణి చురకలంటించారు.

Back to Top