పుంగనూరు మండల వైయ‌స్ఆర్‌సీపీ ఎస్టీ సెల్ కమిటీ నియామకం

ఘ‌నంగా సన్మాన కార్యక్రమం 

అన్న‌మ‌య్య జిల్లా: సుగాలిమిట్టలోని వైయ‌స్ఆర్‌సీపీ పార్టీ కార్యాలయంలో పుంగనూరు మండల వైయ‌స్ఆర్‌సీపీ  ఎస్టీ సెల్ కమిటీ నియామకంతో పాటు నూతన సభ్యుల సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ కమిటీని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా పుంగనూరు మండలం ఎస్టీ సెల్ అధ్యక్షునిగా బి. వాసు నాయక్‌ను, ప్రధాన కార్యదర్శులుగా శీనా నాయక్, నాగరాజు నాయక్‌లను నియమించగా, కార్యదర్శులు మరియు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులుగా దాదాపు 15 మందిని ఎంపిక చేశారు.

కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ  రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాణావత్ మునీంద్ర నాయక్, జిల్లా కార్యదర్శి శ్రీరాములు నాయక్‌లు నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అదేవిధంగా, కూటమి ప్రభుత్వంలో గిరిజనులకు 50 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ అందించాలని, గిరిజన యువతకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు శ్రీనివాసులు నాయక్, రామయ్య, వెంకటరమణ నాయక్, యూత్ ప్రెసిడెంట్ మనోజ్ కుమార్ నాయక్, ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి చిన్న రాయలు, వెంకటస్వామి తదితర వైయ‌స్ఆర్‌సీపీ  నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
 

Back to Top