చంద్రబాబు ‘అమరావతి’ ఒక అంతులేని అప్పుల ఊబి 

వైయస్.జగన్  ‘మావిగన్’ మాత్రమే ఆచరణాత్మక క్యాపిటల్ గ్రోత్ ఇంజిన్

చర్చను డైవర్ట్ చేసేందుకే ఎల్లో మీడియా ద్వారా ‘వ్యక్తిత్వ హననం’

స్పష్టీకరించిన వైయ‌స్ఆర్‌సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి

తాడేపల్లి లోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి.

అమరావతి చంద్రబాబు అవినీతి కామధేనువు 

అది 40 ఏళ్లయినా పూర్తికాదు

ప్రజలకూ నివాసయోగ్యం కాదు

10 శాతం ఖర్చుతోనే ‘మావిగన్’ సాధ్యం

వైయస్.జగన్ ప్రతిపాదనతో బాబులో వణుకు

చంద్రబాబుకు అమరావతి ఒక ‘అవినీతి గని’.

భావితరాల నెత్తిన లక్షల కోట్ల భారం

రూ. లక్షల కోట్ల అప్పుకు ఏటా  రూ.20 వేల కోట్ల వడ్డీ

మావిగన్ ఒక ‘క్యాపిటల్ గ్రోత్ ఇంజిన్’..

అమరావతి కేవలం కాంట్రాక్టర్ల ‘కామధేనువు’.

తేల్చి చెప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి

ఆడబిడ్డలపై రాధాకృష్ణ  వ్యాఖ్యలు హేయం

వాటిని సమర్థించడం కూటమి నేతల దౌర్భాగ్యం.

మావిగన్ పై ప్రజల్లో విస్తృతంగా చర్చ

పక్కదారి పట్టించేందుకే డైవర్షన్ పాలిటిక్స్

ఆగ్రహం వ్యక్తం చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి

తాడేపల్లి: "ప్రపంచ స్థాయి రాజధాని పేరిట సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కోలుకోలేని ఆర్థిక సంక్షోభంలోకి నెడుతున్నారని వైయ‌స్ఆర్‌సీపీ  స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం తాడేపల్లిలో మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు బదులిస్తూ...  చంద్రబాబు ప్రతిపాదిస్తున్న అమరావతి నిర్మాణం మరో 30-40 ఏళ్లయినా పూర్తి కాదని, ఒకవేళ పూర్తయినా అది సామాన్యులకు నివాసయోగ్యం కాదని తేల్చి చెప్పారు. ఈ నేపధ్యంలో వైయస్.జగన్ 'మావిగన్' (మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు) కాన్సెప్ట్ అమరావతికి అయ్యే ఖర్చులో కేవలం 10 శాతంతోనే సాధ్యమవుతుందని, ఇది ఇప్పటికే ఉన్న మౌలిక వసతులతో రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తుందని స్పష్టం చేశారు. వైయస్.జగన్ ఈ ఆచరణాత్మక ఆలోచనకు ప్రజల నుంచి వస్తున్న మద్దతును చూసి చంద్రబాబులో వణుకు మొదలైందని, అందుకే ఎల్లో మీడియా ద్వారా వైయ‌స్ఆర్‌సీపీ నేతల కుటుంబాలపై నీచమైన రాతలు రాయిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంటి వారి రాతలను సమర్థిస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల ద్వంద్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని.. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము ఈ అప్పుల రాజధానిపై పోరాటం కొనసాగిస్తామని సజ్జల స్పష్టం చేశారు." ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే...

 
- అమరావతి వర్సెస్ నవ రాయ్‌పూర్ – నివాసయోగ్యం కాని నగరం..

చంద్రబాబు ప్రతిపాదించిన అమరావతి నిర్మాణం పూర్తి కావడానికి మరో 30-40 ఏళ్లు పడుతుంది, ఒకవేళ పూర్తయినా అది జనం నివసించడానికి వీలులేని నగరంలా మారుతుంది. "ఛత్తీస్‌గఢ్‌లో కేవలం రూ. 4-5 వేల కోట్లతో కట్టిన నవ రాయ్‌పూర్ నేటికీ నిర్మానుష్యంగా ఉంది. మరి రూ. 3 లక్షల కోట్లతో కట్టే అమరావతిలో సామాన్యులు ఎలా నివసిస్తారు? జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ రేట్లు పెట్టి, ఎలాంటి మౌలిక సదుపాయాలు లేని చోటికి ప్రజలు ఎందుకు వస్తారు?". 20-30  ఏళ్లపాటు రూ.2-3 లక్షల కోట్లు కేవలం మౌలిక సదుపాయాలకోసమే పెడితే.. ఇంకా మిగిలిన సపోర్టింగ్ సిస్టమ్ అభివృద్ధికి ఎన్ని లక్షల కోట్లు పెట్టాలి?. ప్రజలు అక్కడికి రాకుండా అది లైవ్‌ సిటీ ఎలా అవుతుంది?  చంద్రబాబు నడిపిస్తున్న హెరిటేజ్‌ కంపెనీని కూడా అమరావతి లాంటి ఆలోచనలతోనే నడుపుతారా?. వస్తున్న ఆదాయం, ఖర్చులు చూసుకుని వచ్చిన మిగులు లోంచి   ఈ రకమైన ఖర్చులు పెడతాడా? లేదంటే కంపెనీ నెట్ వర్త్, మొత్తం లోన్లు తెచ్చి, ఆకాశహర్మ్యం కట్టి నడుపుతాడా?. హెరిటేజ్‌ నిర్వహణలో తీసుకున్న జాగ్రత్తలను చంద్రబాబు రాజధాని విషయంలో ఎందుకు తీసుకోవడంలేదు?. 

- మావిగన్ – 10 శాతం ఖర్చుతోనే అద్భుత రాజధాని..

వైయస్. జగన్ ప్రతిపాదించిన మావిగన్ (మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు) ప్రతిపాదన అత్యంత సహేతుకమైనది. అమరావతికి పెట్టే ఖర్చులో కేవలం 10 శాతంతోనే మావిగన్ ప్రాంతం గర్వించదగ్గ రాజధానిగా మారుతుంది. ఇప్పటికే ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లతో ప్రపంచంతో అనుసంధానమై ఉన్న ఈ ప్రాంతం తక్షణమే 'క్యాపిటల్ గ్రోత్ ఇంజిన్' అవుతుంది. మావిగన్ అనే నినాదం చంద్రబాబుకు తగలాల్సిన చోటే తగిలింది.. అందుకే ఆయనకు వణుకు మొదలైంది.

- అమరావతి- చంద్రబాబు అవినీతికి ‘కామధేనువు’

రాష్ట్రానికి ధర్మకర్తగా ఉండాల్సిన ముఖ్యమంత్రి, రాజధాని పేరుతో విచ్చలవిడిగా అప్పులు చేస్తూ కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారు. మూడు రోజులుగా వైయస్.జగన్ పైనా ,వైయ‌స్ఆర్‌సీపీ నేతలపైనా అసంబద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. సైకో అంటూ ఇష్టాను సారం మాట్లాడుతున్నారు. చంద్రబాబుగారికి ఆ వ్యాఖ్యలు వర్తిస్తాయి. టీడీపీ వాళ్లు అంటున్న మాటలు చంద్రబాబుకే పూర్తిగా వర్తిస్తాయి. రాజధానిపేరుతో అవినీతి యజ్ఞం చేస్తున్న చంద్రబాబుకే ఇవి వర్తిస్తాయి. రాజధాని పేరుతో రాష్ట్రాన్ని ముంచే అవినీతియజ్ఞం చేస్తున్నందుకు ఈ వ్యాఖ్యలు చంద్రబాబుకే వర్తిస్తాయి. ఇవన్నీ నిజమా? కాదా?  ఒకవైపు రూ.50 వేల కాంట్రాక్టులు ఇచ్చామంటూనే రూ.3 లక్షల కోట్లు కావాలని చెబుతున్నాడు.  ఒక్కొక్కటికి 2 నుంచి 5 వేల ఎకరాలు అంటే రైల్వే స్టేషన్, స్పోర్ట్స్ కోసం అంటూ నోటికొచ్చినట్లు చెబుతున్నాడు. ప్రపంచబ్యాంకు నుంచి వేల కోట్లు రుణాలు తీసుకుని రూపాయికి రూ.100 పెంచి టెండర్లు పిలుస్తున్నారు. అడుగడుగునా దోపిడీ. కంపచెట్లు తొలగించే పనికి కూడా కోట్లాది రూపాయలు నామినేషన్ ప్రాతిపదికన కేటాయిస్తున్నారు.కంప చెట్లు తొలగించే పనికి కూడా నామినేషన్ పద్ధతిలో కోట్లు కేటాయిస్తున్నారు. ఇది రాజధాని నిర్మాణం కాదు.. బాబు మనుషులు కుబేరులు అవ్వడానికి జరుగుతున్న 'అవినీతి యజ్ఞం'. ప్రజల సొమ్ము వృధా కాకూడదన్నదే వైయ‌స్ఆర్‌సీపీ ధ్యేయం.

విశాఖే ఏకైక గ్రోత్ ఇంజిన్..
రాజధానికి కావాల్సిన అన్ని వసతులు ఉన్న ఏకైక నగరం విశాఖపట్నం.వైయస్. జగన్ విశాఖను రాజధానిగా ప్రకటించి రాష్ట్రాన్ని 15 ఏళ్లు ముందుకు తీసుకెళ్లాలని చూశారు. కానీ కోర్టుల ద్వారా చంద్రబాబు అడ్డంకులు సృష్టించారు. ఇప్పుడు మావిగన్ ప్రతిపాదనతో అమరావతి అసలు రంగు బయటపడటంతో చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టారు".

- ఆంధ్రజ్యోతి ‘టెర్రరిజం’ – కూటమి నేతల ద్వంద్వ వైఖరి..

హైదరాబాద్‌ లోని ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద వైయ‌స్ఆర్‌సీపీ నేతలు చేసిన నిరసన అత్యంత శాంతియుతమైనది. "రాధాకృష్ణ వైయ‌స్ఆర్‌సీపీ నేతలను, వారి కుటుంబ సభ్యులను, మహిళలను ఉద్దేశించి చేసిన నీచ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా మా నేతలు 'ధర్మాగ్రహం' వ్యక్తం చేశారు. రాధాకృష్ణ ఏకంగా భార్యలను తారుస్తారనే సారాంశంతో వ్యాఖ్యలు చేశారు.  అలాంటి వ్యాఖ్యలకు నిరసన తెలియజేయాలా వద్దా? మీడియాలో టెర్రరిస్టులు లాంటి వ్యక్తులు వీళ్లు. ఇలాంటి దుర్మార్గ వ్యాఖ్యలను చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌, లోకేష్‌ సమర్థించడం ఘోరం. ట్వీట్ ల రూపంలో ఏకంగా ఆర్టికల్సే రాశారు.  పైగా వైయ‌స్ఆర్‌సీపీపీ నేతలు దాడిచేశారని మాపై తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. మరోవైపు ఏబీఎన్‌ రాధాకృష్ణ దుర్మార్గ వ్యాఖ్యలను చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌, లోకేష్‌లు సమర్థించడం ఘోరం. గతంలో తన తల్లిని అన్నారని ఏకంగా ఏబీయన్ ను బ్యాన్ చేయాలన్న పవన్ కళ్యాణ్  ఇప్పుడు రాధాకృష్ణ నీచ వ్యాఖ్యలను ఎలా సమర్థిస్తారు? మీ ఇంటి వరకు వస్తే ఒక నీతి.. పక్కవారికి మరో నీతా?.

- వ్యక్తిత్వ హననం – ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్ర..

మావిగన్ చర్చ నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే చంద్రబాబు వైయస్సార్ మరణం, వివేకానంద రెడ్డి హత్య వంటి అంశాలను మళ్ళీ తెరపైకి తెస్తున్నారు. ఇది వారికి నిత్యకృత్యం. చంద్రబాబు అనుకూల వాయిద్యాల్లో షర్మిల ఒకరు.షర్మిల వైయస్.జగన్ ని తిడితే ఎల్లో మీడియాలో వేస్తారు. అదే చంద్రబాబును తిడితే మాత్రం వేయరు. మావిగన్‌ పేరు వింటే చంద్రబాబు భయపెడుతున్నాడు. మావిగన్‌ ఆచరణాత్మక ఆలోచన అని ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఆ ఆలోచన బయటకు రావడంతోనే  చంద్రబాబు ఉలికిపడుతున్నాడు. దాన్నుంచి ప్రజల ఆలోచనలను మార్చడానికే ఈ అంశాలన్నీ తెరపైకి తీసుకువస్తున్నారు. కూటని ప్రభుత్వం ఎన్ని కుతంత్రాలు చేసినా మావిగన్ ఆచరణాత్మక ఆలోచన అని ప్రజలు గుర్తించారని, రాష్ట్ర ప్రయోజనాల కోసం, భావితరాల భవిష్యత్తు కోసం వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం కొనసాగుతుంది" అని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

Back to Top