వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, సానుభూతిపరులపై కక్షసాధింపు 

నంద్యాల జిల్లా:  కోవెలకుంట్ల మండలం కంపమల్ల గ్రామంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, సానుభూతిపరులపై కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. గ్రామంలోని బీసీ కాలనీ సమీపంలో ఉన్న పెద్ద ఊరకుంట చెరువులో టీడీపీ నాయకులు అధికారుల సహకారంతో తవ్వకాలు చేపడుతున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు. 
గ్రామంలోని సర్వే నంబర్ 308 పరిధిలో ఉన్న పెద్ద ఊరకుంట సమీపంలోని బీసీ కాలనీలో గుంతలు తీయడానికి పొక్లైన్‌లు, ట్రాక్టర్లు మోహరించారని తెలిపారు. కాలనీ వాసులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా తవ్వకాలు ప్రారంభించడంపై స్థానిక ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ తవ్వకాలను అడ్డుకున్న గ్రామస్తులు మైనర్ ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువులో ప్రస్తుతం సమృద్ధిగా నీరు ఉన్నప్పటికీ మట్టి తరలింపుకు ఎలా అనుమతులు ఇచ్చారంటూ ప్రశ్నించారు. తవ్వకాలు కొనసాగితే బీసీ కాలనీలోని సుమారు 70 కుటుంబాలు జలమయం అయ్యే ప్రమాదం ఉందని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే తవ్వకాలను నిలిపివేసి ప్రజలకు న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
 

Back to Top