విజయనగరం: పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని వైయస్ఆర్‌సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) సూచించారు. విజయనగరం జిల్లా వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సమావేశం, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులతో సమీక్ష సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశానికి విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్, వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, గ్రామ స్థాయి నుంచి పార్టీ కార్యక్రమాల అమలు, కార్యకర్తల సమన్వయం, ప్రజా సమస్యలపై పార్టీ తరఫున చేపట్టాల్సిన కార్యాచరణ తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని చిన్న శ్రీను పిలుపునిచ్చారు. ప్రజల్లో పార్టీ సిద్ధాంతాలు, వైయస్ఆర్‌సీపీ చేపడుతున్న కార్యక్రమాలను విస్తృతంగా తీసుకెళ్లాలని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగించాలని సూచించారు. ప్రతి మండలం, గ్రామ స్థాయిలో పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్టీ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.