పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పాలకొల్లులో వైయ‌స్ఆర్‌సీపీ నిరసన

పాల‌కొల్లు: పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ సోమవారం పాలకొల్లు పట్టణంలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పాలకొల్లు నియోజకవర్గ ఇంచార్జ్ గుడాల శ్రీహరి గోపాలరావు (గోపి) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు కలిసి పాలకొల్లు ఎంఆర్ఓ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి వినతిపత్రం సమర్పించారు. పెరిగిన ఇంధన ధరల కారణంగా సామాన్య ప్రజలు, రైతులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించి ప్రజలకు ఊరట కల్పించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో పాలకొల్లు నియోజకవర్గ పరిశీలకులు పెరిచర్ల విజయ నర్సింహా రాజు, స్టేట్ సెక్రటరీ యడ్ల తాతాజీ, వైయ‌స్ఆర్‌సీపీ సీనియర్ నాయకులు గుణ్ణం నాగబాబు, మాజీ ఎమ్మెల్సీ మేక శేషుబాబు, ఎస్సీ కమిషన్ సభ్యులు చెల్లం ఆనంద్ ప్రకాష్, జడ్పీటీసీ నడపన గోవిందరాజు, పాలకొల్లు పట్టణ అధ్యక్షులు కోరాడ శ్రీనివాస్, యలమంచిలి మండల అధ్యక్షులు ఉచ్చుల స్టాలిన్, మద్దా చంద్రకళ, కర్ర జయసరిత, ఎంపీపీ ధనలక్ష్మి రవికుమార్‌తో పాటు వైయ‌స్ఆర్‌సీపీ పట్టణ, గ్రామ నాయకులు, కార్యకర్తలు, వివిధ విభాగాల అనుబంధ అధ్యక్షులు, ప్రజలు పాల్గొన్నారు.
 

Back to Top