రాచూరు గ్రామంలో ‘కాఫీ విత్ క్యాడర్’ 

ప్రజలతో మమేకమైన ఉషశ్రీ చరణ్

శ్రీ సత్యసాయి జిల్లా : పెనుకొండ నియోజకవర్గంలో వైయ‌స్ఆర్‌సీపీ కార్యకలాపాలు మరింత చురుకుగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు, పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీ చరణ్ రొద్దం మండలంలోని నారనాగేపల్లి పంచాయతీ రాచూరు గ్రామంలో ‘కాఫీ విత్ క్యాడర్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలతో కలిసి ఇంటింటికీ వెళ్లి పలకరించడంతో పాటు, స్థానిక సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని గత ప్రభుత్వం కాలంలో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు చేరాయని, ప్రజలకు ఎలాంటి లోటు లేకుండా పరిపాలన సాగిందని గుర్తుచేశారు. ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతోందని విమర్శించారు. ఈ విషయాలను ప్రతి ఇంటికి వెళ్లి వివరించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రొద్దం మండల ప్రజాప్రతినిధులు, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అలాగే నారనాగేపల్లి పంచాయతీకి చెందిన గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
 

Back to Top