రాయలసీమకు జ‌రుగుతున్న అన్యాయంపై ఐక్య ఉద్యమాలే మార్గం

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి
 

అనంతపురం: రాయలసీమకు సాగు, తాగు నీటి విష‌యంలో జ‌రుగుతున్న అన్యాయంపై ఐక్య ఉద్యమాలే మార్గమ‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అభిప్రాయ‌ప‌డ్డారు.  అనంత‌పురంలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. రాయలసీమలో సాగు, తాగునీటి సమస్యలను తీర్చిన ఘనత వైయ‌స్ రాజశేఖరరెడ్డిదేనని గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చేపట్టారని పేర్కొన్నారు. అయితే రాయలసీమకు అడుగడుగునా అన్యాయం చేసిన నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుఅని విమర్శించారు. హైకోర్టు, ఎయిమ్స్ వంటి కీలక ప్రాజెక్టులను ఇతర ప్రాంతాలకు తరలించడం ద్వారా సీమ అభివృద్ధిని దెబ్బతీశారని ఆరోపించారు. రాయలసీమ అభివృద్ధిపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు నిజమైన చిత్తశుద్ధి ఉందా అని ప్రశ్నించారు.

సీమ ప్రజలు టీడీపీ కూటమికి పట్టం కట్టినప్పటికీ, ప్రస్తుతం ఆ ప్రభుత్వం చేస్తున్న పనులు ప్రజలను నిరాశపరుస్తున్నాయని అన్నారు. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల తర్వాతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు ఆగిపోయిన విషయం బయటపడిందని చెప్పారు. టీడీపీ కూటమి వైఖరికి వ్యతిరేకంగా సీమ ప్రజలు ఐక్యంగా ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని, రాయలసీమ హక్కుల కోసం పోరాటం మరింత ఉధృతం చేయాలని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పిలుపునిచ్చారు.
 

Back to Top