పెట్రోల్, డీజిల్ కొరతపై కంగాటి శ్రీదేవమ్మ ఆగ్రహం 

పత్తికొండ: రాష్ట్రంలో కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ కొరతపై మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత పాలన పూర్తిగా వైఫల్యానికి దారి తీసిందని ఆమె విమర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పక్క రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఇంధన కొరత నెలకొనడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. రాష్ట్రంలోని అన్ని పెట్రోల్ బంకుల్లో సమృద్ధిగా ఇంధనం అందుబాటులో ఉందని చెప్పడం ద్వారా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. వెంటనే ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం పత్తికొండలోని పలు పెట్రోల్ బంకులను పార్టీ కార్యకర్తలతో కలిసి ఆమె సందర్శించారు. అక్కడ కనిపించిన ‘నో స్టాక్’ పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. బంకుల వద్ద వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. ప్రజలు పడుతున్న కష్టాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని పెట్రోల్, డీజిల్ సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావాలని కంగాటి శ్రీదేవమ్మ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
 

Back to Top