నుదుటిపై 'వైయస్ జగన్' పచ్చబొట్టు.. 

జగనన్నపై అభిమానాన్ని చాటిన వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త 

 కర్నూలు జిల్లా: క్రిష్ణగిరి మండలం లక్కసాగరం పంచాయతీ పరిధిలోని లాల్మాన్‌పల్లె గ్రామానికి చెందిన వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త ఉప్పరి మహేంద్ర, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిపై తనకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. తన నుదుటిపై 'వైయస్ జగన్` అనే పచ్చబొట్టును వేయించుకుని జగనన్నపై తన అభిమానాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉప్పరి మహేంద్ర పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మను ఆమె స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నుదుటిపై 'వైయస్ జగన్' పేరుతో పచ్చబొట్టు వేయించుకుని పార్టీ నాయకత్వంపై తన అభిమానాన్ని చాటిన మహేంద్రను శ్రీదేవమ్మ అభినందించారు. పార్టీపై, వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కార్యకర్తలు చూపుతున్న విశ్వాసం, అభిమానానికి ఉప్పరి మహేంద్ర నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తల అంకితభావమే ప్రధాన బలమని ఈ సందర్భంగా శ్రీదేవమ్మ అన్నారు. 

Back to Top