మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్టు అప్రజాస్వామికం.

సీదిరి అప్పలరాజు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం.

వైయస్సార్సీపీ పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంతీయ సమన్వయకర్త, మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్. 

విశాఖ‌: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం  ఏర్పడిన నాటి నుంచి ప్రజాసమస్యలను గాలికొదిలేసి, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై రాజకీయ కక్షసాధింపు చర్యలకే ప్రాధాన్యమిస్తోందని వైఎస్సార్‌సీపీ పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంతీయ సమన్వయకర్త, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాక్షేత్రంలో వైఎస్సార్‌సీపీని ఎదుర్కొలేక తీవ్ర అభద్రతాభావంతో ఉన్న కూటమి పెద్దలు, పోలీసు వ్యవస్థను తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి, బీసీ నాయకుడు సీదిరి అప్పలరాజు అక్రమ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించిన ఆయన... రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలు రోజురోజుకూ బయటపడుతుండటంతో, ప్రజల దృష్టిని మళ్లించేందుకే మా నాయకులపై పగబట్టినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.  ఇటీవల జరిగిన ఒక దురదృష్టకర రోడ్డు ప్రమాద ఘటనకు ఉద్దేశపూర్వకంగా రాజకీయ రంగు పులమడం సిగ్గుచేటన్నారు. ఈ ఘటనతో నేరుగా ఎలాంటి సంబంధం లేని మాజీ మంత్రి అప్పలరాజు పై  రాజకీయ కుట్రలో భాగంగానే తీవ్రమైన కేసులు మోపి అరెస్టు చేయడాన్ని తప్పుపట్టారు. దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చట్టపరంగా పోరాటం చేస్తుందని, అదే విధంగా డాక్టర్ అప్పలరాజు కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని అమర్నాధ్  ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

Back to Top