అరకు: అరకు వ్యాలీ మండలంలో అధికార తెలుగు దేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. పెదలబుడు గ్రామపంచాయతీ పరిధిలో టీడీపీకి చెందిన 60 కుటుంబాలు వైయస్ఆర్‌సీపీ పార్టీలో చేరాయి. గరడగూడ, పెదలబుడు, కరసలి గూడ గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఈ సందర్భంగా పార్టీ మారారు. వైయస్ఆర్‌సీపీ సీనియర్ నాయకుడు మురళి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం సమక్షంలో టీడీపీ పిసా కమిటీ అధ్యక్షుడు జన్ని సూరిబాబు, జన్ని గురుమూర్తి, రామూర్తి, కామేశ్వరావు, సోమెలి రాజు తదితరులు వైయస్ఆర్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. కొత్తగా చేరిన వారిని సాదరంగా ఆహ్వానిస్తూ, వారి సమస్యల పరిష్కారానికి పార్టీ కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణక్య, బూత్ కమిటీ ఇన్చార్జ్ విజయ్ పాంగి, ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు కమ్మిడి అశోక్, మండల పార్టీ అధ్యక్షుడు స్వాభి రామ్మూర్తి, సూపర్ ఎంపీపీ నరసింహమూర్తి, యువజన విభాగం అధ్యక్షుడు బోయి కిరణ్ కుమార్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు పాంగి నగేష్, డుంబ్రిగూడ మండల అధ్యక్షుడు పాంగి పరుశురాం, వైస్ ఎంపీపీ కిల్లో రామన్న, సుంకర మెట్ట గ్రామపంచాయతీ అధ్యక్షుడు కొర్ర అర్జున్ రావు తదితరులు పాల్గొన్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.