పశ్చిమగోదావరి: తాడేపల్లిగూడెంలో హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్ వడ్డి రఘురామ్ నాయుడు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నిరసన చేపట్టారు. రాష్ట్రంలో కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ కొరతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. ఇంధన కొరతతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం వెంటనే గుర్తించాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ సరఫరాలో అంతరాయం లేకుండా తక్షణ చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించాలని వైయస్ఆర్‌సీపీ నేతలు కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.