24 గంటల్లోగా పంచదార్ల క్షేత్రంను ఖాళీ చేయాలి

యంత్రాలు, పరికరాలను తక్షణమే తరలించాలి

లేకుంటే మైనింగ్ జరిగిన చోటే ధర్నాకు దిగుతాం

శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అల్టిమేటమ్

పంచదార్ల మైనింగ్ బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి

నో మైనింగ్ జోన్ గా ప్రకటించే వరకు వైఎస్సార్ సీపీ పోరాటం ఆగదు

రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, అక్రమాలు ప్రధాని మోడి దృష్టికి

బొత్స సత్యనారణ స్పష్టీకరణ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు చలో పంచదార్ల పేరిట చేపట్టిన కార్యక్రమంలో భాగంగా  అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం పంచదార్లలో జరుగుతున్నఅక్రమ మైనింగ్ పరిసరాలను మాజీ మంత్రులు, బొత్స సత్యనారాయణ ,  కురసాల కన్నబాబు, గుడివాడ అమర్ నాథ్, మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీ, భక్తులు, ప్రజాసంఘాలు, ఇతర నేతలతో కలసి పరిశీలన

పంచదార్లను నో మైనింగ్ జోన్ గా ప్రకటిస్తూ జీఓ విడుదల చేయాలి

అప్పటి వరకు వైెఎస్సార్ సీపీ పోరాటం ఆగబోదు

సమగ్ర దర్యాప్తు చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

రుషికొండపై భవనాలు నిర్మిస్తే రుషులు తిరిగే ప్రామంతని నాడు చంద్రబాబు నానా యాగీ

మరి పవిత్ర దివ్యక్షేత్రం  పంచదార్ల కొండపై రాక్షసులు తిరుగుతున్నారా?

వైఎస్సార్ సీపీ రీజనల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి కునరసాల కన్నబాబు ఆగ్రహం
 
సీఎం రమేశ్ అంటే.. కరప్షన్ మ్యాన్ రమేశ్..!

అనకాపల్లి ఎంపీగా గెలిపిస్తే సంపదను దోచుకోవాడినికి బ్లాంక్ చెక్ ఇచ్చినట్లు కాదు

పంచదార్లను దోచేసి, అయోథ్యకు రైలు వస్తే చేసిన పాపం పోయి పుణ్యం రాదు

వైఎస్సార్ సీపీ రీజనల్ కో అర్డినేటర్ , మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ మండిపాటు

పంచదార్ల (అనకాపల్లి జిల్లా):   అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలోని పంచదార్ల పుణ్యక్షేత్రంలో సాగుతున్న అక్రమ మైనింగ్ పరిసరాలను తక్షణమే ఖాళీ చేయాలని,  24 గంటల్లోగా  యంత్రాలు, పరికరాలను తరలించాలని, ఈ మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని శాసన మండలి విపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ అల్టిమేటమ్ జారీ చేసారు. లేకుంటే ఇదే పంచదార్ల క్షేత్రంలో మళ్లీ తాము ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.  అంతేగాక పవిత్ర పుణ్యక్షేత్రంలో అక్రమ మైనింగ్ సాగించిన బాధ్యలపై కేసులు నమోదు చేసి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసారు. మైనింగ్ ను పూర్తిగా నిలిపివేసినట్లు, బాధ్యులపై  తీసుకుంటున్న చర్యలను  ప్రభుత్వం ప్రకటించే వరకు పంచదార్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా పోరాటం ఆగబోదని బొత్స సత్యనారాయణ స్పష్టం చేసారు. పంచదార్ల కొండల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఛలో పంచదార్ల కార్యక్రమానికి పిలుపునిచ్చింది. వేలాది మంది భక్తులు,  ప్రజాసంఘాల ప్రతినిధులు,  కార్యకర్తలు పంచదార్లకు క్షేత్రానికి బైక్ ర్యాలీతో చేరుకున్నారు. దారిపోడవునా కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తండంతో  ఆ ప్రాంతాలన్నీజనంతో కిక్కిరిసిపోయాయి.  అనంతరం    మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, గుడివాడ అమర్, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఇతర నేతలు కే కే రాజు, బొడ్డేటి ప్రసాద్ కలసి పంచదార్లలో తవ్వకాలు జరిగిన ప్రదేశాలను పరిశీలించారు.  కొండను పూర్తిగా తొలిచి వేసేలా సాగిన ప్రాంతాన్ని చూసి ఆవేదనకు గురయ్యారు. అలాగే ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయ క్షేత్రంలో బురద నీరు వస్తున్న పరిస్థితులను చూసారు. స్థానికంగా ఉన్న పలువురు భక్తులు వైసీపీ నేతలను  కలసి మైనింగ్ తవ్వకాల వలన జరుగుతున్న నష్టాలను  వివరించారు. 

 అనంతరం మీడియా సమావేశంలో  బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ,   చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు, దౌర్జన్యాలు దేశ ప్రజలకు కూడా తెలియాలని. అవసరమైతే ఈ అంశాన్ని దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  దృష్టికి కూడా తీసుకెళ్తామని స్పష్టం చేసారు. ధర్మం పేరుతో మాట్లాడే ప్రభుత్వం, ధర్మాన్ని కాపాడాల్సిన సందర్భంలో ఎందుకు మౌనంగా ఉంటోందో, అక్రమార్కులకు ఎందుకు  కొమ్ము కాస్తుందో  ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు.   పంచదార్లలోని ఉమా ధర్మలింగేశ్వర స్వామి దేవాలయం నిర్వహణ విషయంలో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల పేర్లు వినిపిస్తుంటే,   వెంటనే సమగ్ర విచారణ జరిపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా అని బొత్స ఆగ్రహం వ్యక్తం చేసారు.   ధర్మాన్ని కాపాడాల్సిన ముఖ్యమంత్రి  మౌనంగా ఉంటే ప్రజల్లో అనుమానాలు మరింత పెరుగుతాయని,    రాజకీయ లాభనష్టాల కంటే ధర్మం ముఖ్యమనే అంశాన్ని వైఎస్సార్ సీపీ విశ్వసిస్తోందని స్పష్టం చేసారు.   దేవాలయాల పవిత్రతను కాపాడటం ప్రతి ప్రభుత్వ బాధ్యతగా ఉన్నప్పటికీ,  కూటమి ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని ఆవేదన వ్యక్తం చేసారు.  పంచదార్లలో అక్రమమైనింగ్ కు  బాధ్యులు ఎవరైనా సరే చట్టం ముందు నిలబెట్టాలని బొత్స డిమాండ్ చేసారు.   ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అక్రమాన్ని ప్రజలు గమనిస్తున్నారని,  ఎవరు ఏమి చేస్తున్నారో ప్రజలకు తెలుసునని,  అధికారాన్ని అడ్డుపెట్టుకుని దేవాలయాలను, ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు ఎంతకాలం కొనసాగవని బొత్స హెచ్చరించారు.  రాష్ట్రంలో చట్టబద్దమైన పాలన లేనందునే  వేలాది మంది భక్తులతో కలిసి  పంచదార్లకు  రావడానికి కారణమని వివరించారు.   ప్రభుత్వానికి  చేతనైతే అక్రమాలను అరికట్టాలి. చేతకాకపోతే ప్రజలకు  వాస్తవాలు చెప్పి క్షమాపణలు కోరాలని హితవు పలికారు.  . ఈ సమావేశంలో బొత్స సత్యనారాయణ ఇంకా ఏం మాట్లాడారంటే... 

- ఆలయాలను రాజకీయ వేదికగా మార్చొద్దు

 రాష్ట్రంలోని కూటమి  ప్రభుత్వం ప్రతిరోజూ ధర్మపాలన గురించి గొప్పలు చెబుతోంది.   దేవాలయాల పరిరక్షణ తమ ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని ప్రచారం చేస్తోంది తప్పితే,  వాస్తవ పరిస్థితులు చూస్తే చెబుతున్న మాటలకు, ఆచరణకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. ఇవాళ పంచదార్ల దివ్యక్షేత్రానికి  మేము రాజకీయాల కోసం   రాలేదు. ఒక పవిత్రమైన దేవాలయం చుట్టూ జరుగుతున్న అక్రమాలు, అరాచకాలను, దోపిడీలను  ప్రజల దృష్టికి తీసుకురావడానికి, భక్తుల తరఫున ప్రశ్నించడానికి వచ్చాం. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలిగించడం, మార్గాలను మూసివేయడం వంటి అనేక అక్రమ వ్యవహారాలు ఆలయ పరిసరాల్లో జరుగుతున్నా,  ప్రభుత్వం  స్పందించకుండా మౌనం వహించడమేంటి.   గతంలో ఈ ప్రాంతంలో ఇలాంటి దుర్భరమై పరిస్థితులు ఎప్పుడూ  రాలేదు? ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? అధికార యంత్రాంగంపై ప్రభుత్వానికి పట్టు ఉంటే భక్తులకు ఇలాంటి ఇబ్బందులు ఎందుకు ఎదురవుతున్నాయి?   దేవాలయాలను రాజకీయాలకు వేదికగా మార్చకండి. భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీయకండి. ధర్మం గురించి మాట్లాడే ముందు, ధర్మాన్ని ఆచరణలో చూపి చిత్తశుద్ధిని చాటుకోవాలి.    ఈ ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలి. భక్తులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా దర్శన సౌకర్యాలు కల్పించాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్పష్టం చేస్తున్నాం... ధర్మం కోసం, దేవాలయాల పవిత్రత కోసం, భక్తుల హక్కుల కోసం మా పోరాటం నిరంతరం కొనసాగుతుంది. ప్రజల విశ్వాసాన్ని కాపాడే వరకు వైఎస్సార్ సీపీ  గళం వినిపిస్తూనే ఉంటుంది.

- నో మైనింగ్ జోన్ గా ప్రకటిస్తూ జీఓ విడుదల చేయాల్సిందే..
 - రీజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు

పంచదార్ల పుణ్యక్షేత్రానికి  కనీసం 30 కిలోమీటర్ల పరిధిలో 'నో మైనింగ్ జోన్' గా ప్రకటించాలని మేము మరోసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ మేరకు ప్రభుత్వం స్పష్టమైన జీవో విడుదల చేసే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజలతో కలిసి ఉద్యమాన్ని కొనసాగిస్తుంది. అక్రమ మైనింగ్‌పై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. పంచదార్లలో  సుమారు 120 అడుగుల లోతు వరకు కొండను తవ్వి, సహజసిద్ధమైన జల వనరులను, పర్యావరణాన్ని నాశనం చేశారు. ఇది ప్రజల ఆస్తి పైనా, ప్రకృతి సంపదపైన జరిగిన దోపిడీ. ఈ దోపిడీ వెనుక సామాన్యులు లేరు. అధికార పార్టీకి చెందిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్, స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ల ప్రముఖుల కంపెనీలు ఉన్నాయని స్థానిక ప్రజలు చెబుతున్నారు. ఐదు ఎకరాలకు అనుమతి తీసుకుని, దానికి పదిరెట్లు అధికంగా తవ్వకాలు జరగడం దోపిడీకి నిదర్శనం. ప్రభుత్వ వ్యవస్థల వైఫల్యానికి నిదర్శనం.  స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు, వైఎస్సార్‌సీపీ నాయకులు ఈ అక్రమాలపై ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగడం, అధికారులు ఫిర్యాదులను పట్టించుకోకపోవడం అత్యంత ఆందోళనకరం. కలెక్టర్ నుంచి మైనింగ్ అధికారులు, పోలీసులు వరకు స్పందించకపోవడం చూస్తే అధికార యంత్రాంగం మొత్తం అధికార పార్టీ నేతలకు అనుకూలంగా మారి తొత్తులుగా పనిచేస్తున్నారనే  అనుమానాలు బలపడుతున్నాయి.  
 
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంపదను, ప్రకృతి సంపదను విచక్షణారహితంగా దోచుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తానని చెప్పారు. కానీ సీఎం అయ్యాక తన పార్టీ నేతలకు సంపదను, వనరులను దోచి పెడుతున్నారు. అందుకు పంచదార్ల కొండల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్ ప్రత్యక్ష నిదర్శనం. ఇది కేవలం ఒక కొండను తవ్విన వ్యవహారం కాదు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ధర్మలింగేశ్వర స్వామి ఆలయం పరిసరాల పవిత్రతను, ప్రకృతి సమతుల్యతను ధ్వంసం చేసిన దురాగతం.   పంచదార్ల కొండలు సాధారణ భూభాగం కాదు. ధర్మలింగేశ్వర స్వామి ఆలయం సుమారు 1200 సంవత్సరాల చరిత్ర కలిగిన పవిత్ర క్షేత్రం. అలాంటి ప్రాంతాన్ని కూడా వదలకుండా మైనింగ్ పేరుతో ధ్వంసం చేయడం కూటమి ప్రభుత్వ దుర్మార్గ వైఖరిని బయటపెడుతోంది.

గతంలో ఋషికొండ  విషయంలో  వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పర్యాటక భవనాలు నిర్మిస్తే రుషులు తిరిగిన నేలలో ధ్వంసం జరిగిపోతోందని  అని  పెద్ద నీతులు చెప్పిన చంద్రబాబు నాయుడు  , ఇప్పుడు విశాఖ జిల్లాలోని పవిత్ర కొండలను, ప్రకృతి సంపదను ఎందుకు కాపాడటం లేదు? ఒకవైపు సింహాచలం కొండలు, మరోవైపు పంచదార్ల కొండలు, ఇంకో వైపు ఇతర కొండ ప్రాంతాలు మైనింగ్ మాఫియా చేతిలో నాశనమవుతుంటే ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది?  పర్యావరణ పరిరక్షణ గురించి గొప్పలు చెప్పిన నాయకులు, గత ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన వారు ఇప్పుడు ప్రజలకు సమాధానం చెప్పాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని విలువలను పక్కనబెట్టి ప్రకృతి విధ్వంసానికి సహకరించడం దురదృష్టకరం.  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి  ఆదేశాల మేరకు ప్రజల పక్షాన పంచదార్ల కొండ పరిరక్షణ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. అక్రమాలు చేసిన వారు ఎంత పెద్దవారైనా చట్టం ముందు నిలబడాల్సిందే. ప్రజల హక్కులను కాపాడటం, పర్యావరణాన్ని రక్షించడం, పవిత్ర ధర్మలింగేశ్వర స్వామి ఆలయ గౌరవాన్ని నిలబెట్టడం కోసం వైఎస్సార్‌సీపీ నిరంతర పోరాటం చేస్తుంది.

- సీఎం రమేశ్  అంటే.. కరప్షన్ మ్యాన్ రమేశ్.. 
: మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్

పంచదార్లలోని  ఉమా ధర్మలింగేశ్వర స్వామి వారి పవిత్ర ఫుణ్యక్షేత్రం పరిసరాల నుంచి తట్టడు మట్టి కూడా ఎత్తుకెళ్లేందుకు  వీలు లేదు.  అనకాపల్లి ఎంపీ   సీఎం రమేష్ కు తన పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల పేర్లు కూడా తెలియవు,  ఊరు హద్దులు తెలియవు,   కేవలం  అనకాపల్లి ప్రాంతంలోని వనరులను, ప్రకృతి సంపదను  దోచుకోవడానికే సీఎం రమేశ్ కడప నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నాడని ఎన్నికలపుడే ప్రజలకు హెచ్చరించాం అప్రమత్తంగా ఉండండి, ఓటు వేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయండి  అని హితవు పలికినా  మాట వినలేదు. భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో అనకాపల్లిలో ఏ పార్లమెంట్ సభ్యుడికి ఇవ్వనటువంటి   3 లక్షల మంది మెజారిటీని సీఎం రమేశ్ కు  ఇచ్చారు. దీంతో ఇక్కడి వనరులను దోచుకోవడానికి  ప్రజలు తనకు బ్లాంక్  చెక్‌ని ఇచ్చారని భావించి  దోచుకుంటున్నారు. సీఎం అంటే ఎవరికీ తెలియదు. సీఎం అంటే కరప్షన్ మ్యాన్ రమేష్ అని అర్థం. ఆయన ఇంటి పేరులోనే అవినీతి పెట్టుకొని మన దగ్గరికి వచ్చాడు, అది మనం గమనించలేదు, ఓటు వేసి గెలిపించాం. ఈరోజు కొండలు దోచుకుపోతున్నాడు, గుడిని, గుడిలో లింగాన్ని దోచుకుపోయేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాడు.   అనకాపల్లి నుంచి అయోధ్యకి రైలు వేసాడంట. ఇక్కడ గుడిని, గుడిలో లింగాన్ని మింగేసాడు, అక్కడ అయోధ్య రాముణ్ణి ఇక్కడి నుంచి దోచుకుపోయినటువంటి సొమ్ముతో ఆ భక్తుల్ని తీసుకెళ్తే,  ఏ రకమైనటువంటి పుణ్యం రాదు... అని సీఎం రమేష్   ను  హెచ్చరిస్తున్నా.

 దాదాపు 10-12 శతాబ్దాల నుంచి ఉన్నటువంటి పంచదారల ఆలయానికి సంబంధించినటువంటి ఆ నీటి ప్రవాహం  నుంచి  పవిత్రమైనటువంటి జలాలు వచ్చేవి. అటువంటిది ఇప్పుడు  బురద నీరు అందులో నుంచి వస్తా ఉంది. దీనికి  సంబంధించి పురావస్తు శాఖకు  మైనింగ్ డిపార్ట్మెంట్‌కి సంబంధించినటువంటి అధికారులు, ఉమ్మడిగా సర్వే నిర్వహించగా,   పంచదార్లలో జరుగుతున్న మైనింగ్ వల్ల వస్తున్నటువంటి వైబ్రేషన్స్ వల్ల, చేస్తున్నటువంటి డ్రిల్లింగ్ వల్ల  బురద నీరు  వస్తోందని  రిపోర్ట్స్ ఇచ్చారు. రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత ఈ అంశంపై స్థానిక ప్రజలతో కలసి వైఎస్సార్ సీపీ నేత కరణం ధర్మశ్రీ పోరాటం  చేస్తే, దాన్ని టెంపరరీగా ఆపమని చెప్పి అధికారులు ఆర్డర్స్ ఇచ్చారని గుర్తు చేసారు. వైసీపీ  అధికారుల వైఖరిని నిరసిస్తూ  నిరహార దీక్షలు చేపట్టిన తర్వాత కూడా వందలాది లారీలు మైనింగ్ చేసుకుంటూ పోయారు. అంటే మేము ఎవరికీ భయపడం, ప్రజలకి భయపడం, దేవుడికి భయపడం.. అనే రీతిలో వ్యవహరిస్తున్నారు.  మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అకస్మాతుగా డీఆర్సీ సమావేశం నిర్వహించి  అది నో మైనింగ్ జోన్‌గా చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం  అని ప్రకటించారు.   ఆయన ఆలోచనలు ఎవరికీ అవసరం లేదు. నో మైనింగ్ జోన్ గా  జీవో రూపంలో రాకపోతే, ఈ పోరాటం మరింత ఉధృత రూపం దాల్చుతుంది

- తీర్మానాలతో మభ్య పెడితే సహించం
 - మంత్రి కొల్లు రవీంద్రకు మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీ హెచ్చరిక

ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయ పవిత్రతను కాపాడేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్మ పోరాటానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించడం ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిది.   ఈ ఉద్యమం ప్రారంభించిన రోజు నుంచి ప్రభుత్వం ముందుగా బెదిరింపులకు పాల్పడింది, ఇప్పుడు ప్రజల ఆగ్రహాన్ని చూసి బతిమాలుకునే పరిస్థితికి వచ్చింది.   "ప్రజాస్వామ్యబద్ధంగా నిరాహార దీక్షలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించాలంటే డీఎస్పీలు, సీఐలు సహా మొత్తం పోలీసు యంత్రాంగాన్ని మోహరించి అడ్డుకుంటున్నారు. కానీ రాత్రింబవళ్లు వందలాది లారీలతో పవిత్ర కొండలను తవ్వి తరలిస్తున్న అక్రమ మైనింగ్ మాత్రం పోలీసులకు కనిపించడం లేదా?"  ఒక రైతు కొద్దిగా మట్టి తవ్వినా కేసులు పెడతారని, ఓవర్‌లోడ్‌తో వాహనం నడిపినా కేసులు నమోదు చేస్తారు, కానీ దేవాలయ కొండలను ధ్వంసం చేస్తున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. అధికార పార్టీ ఎంపీ సీఎం రమేశ్ కి ఒక చట్టం, సామాన్య ప్రజలకు మరో చట్టమా?    పంచదార్లలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ సాగిస్తున్న  అక్రమ దోపిడీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి బాధ్యత వహించాలని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి   దేవాలయాల పరిరక్షణ గురించి గొప్పలు చెప్పే కూటమి నాయకులు, దేవాలయ ఆస్తులనే దోపిడీ చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు. 
హిందూ ధర్మ పరిరక్షణ పేరుతో రాజకీయాలు చేసే బీజేపీ కూడా ఈ అంశంపై తన వైఖరిని స్పష్టం చేయాలి  బీజేపీకి చెందిన ప్రజాప్రతినిధి పరిధిలోనే హిందూ దేవాలయానికి సంబంధించిన పవిత్ర కొండలు ధ్వంసమవుతుంటే ఆ పార్టీ ఎందుకు స్పందించడం లేదు ?
 
  డీఆర్‌సీ సమావేశంలో మైన్స్ శాఖకు  చెందిన మంత్రి కొల్లు రవీంద్ర చేసిన ప్రకటనను    నమ్మే పరిస్థితి లేదు   ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయం చుట్టూ 30 కిలోమీటర్ల పరిధిని 'నో మైనింగ్ జోన్'గా ప్రకటిస్తూ ప్రభుత్వం వెంటనే జీవో జారీ చేయాలి కేవలం తీర్మానాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు మానుకుని, చట్టబద్ధమైన ఉత్తర్వులు జారీ చేసి శాశ్వత రక్షణ కల్పించాలి భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా ఈ పవిత్ర కొండపై ఒక్క గుప్పెడు మట్టిని కూడా తవ్వలేని విధంగా చట్టపరమైన రక్షణ కల్పించాలి. ప్రభుత్వం జీవో విడుదల చేసే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధర్మ పోరాటం కొనసాగుతుందని, అవసరమైతే దశలవారీగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. రాజకీయాలకు అతీతంగా దేవాలయ పరిరక్షణ కోసం ఉద్యమానికి మద్దతు తెలిపిన ప్రజలకు, భక్తులకు, వివిధ ప్రజాసంఘాలకు  కృతజ్ఞతలు. 

 ప్రకృతి సమతుల్యత ధ్వంసం - బొడ్టేటి ప్రసాద్ , అనకాపల్లి జిల్లా అధ్యక్షులు

 పంచదారల కొండల చుట్టూ స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ , ఎంపీ సీఎం రమేష్ కలిసి సాగిస్తున్న అక్రమ మైనింగ్‌కు  సహకరిస్తున్న అధికారులకు  త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారు.  పంచదారల కొండ సాధారణ కొండ కాదు. ఇది చారిత్రక, ఆధ్యాత్మిక, పర్యావరణ పరంగా ఎంతో విశిష్టమైన పుణ్యక్షేత్రం. పాండవులతో సంబంధం ఉన్న ప్రాంతంగా, ధర్మలింగేశ్వరస్వామి ఆలయం, ఐదు సహజ జలధారలతో ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. శాస్త్రీయంగా కూడా ఆ జలధారల మూలాన్ని ఇప్పటివరకు నిర్ధారించలేకపోయారు. అయితే అనూహ్యంగా మైనింగ్ కారణంగా ఐదు ధారల్లో కొన్ని ఎండిపోవడం, మరికొన్ని బురద నీటితో కలుషితమవడం అత్యంత ఆందోళనకర విషయం. ప్రకృతి సమతుల్యతను ధ్వంసం చేసే పనులు నిలిపివేయాలి.  పంచదారల కొండను రక్షించాలని ఇప్పటికే ప్రజా సంఘాలు, హిందూ ధార్మిక సంస్థలు, పర్యావరణవేత్తలు, కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వారి డిమాండ్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు తెలుపుతోంది.  పంచదారల కొండ పరిసరాలను వెంటనే **'నో మైనింగ్ జోన్'**గా ప్రకటించి, అక్రమ మైనింగ్‌ను పూర్తిగా నిలిపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.  

 
 ప్రజా ఉద్యమాన్ని చూసైనా బుద్ధి తెచ్చుకోవాలి
 - కే కే రాజు, విశాఖ జిల్లా అధ్యక్షులు

 కూటమి లోని ప్రజాప్రతినిధులు బరితెగించి వ్యవహరిస్తున్నారు. భవిష్యత్తులో అధికారంలోకి రాము.. ఇప్పుడు ఉన్నంత దోచుకోవాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు. నిబంధనలను తుంగలోకి తొక్కి పవిత్ర పుణ్యక్షేత్రం పంచదార్లలో మైనింగ్ చేస్తున్నారు. కొంతమంది అధికారులు ప్రజల పక్షాన నిలవాల్సి ఉండగా, ప్రజాప్ర్తినిధులుకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా సరే ప్రజా ఉద్యమాన్ని చవి చూసిన తర్వాత బుద్ధి తెచ్చుకోవాలి. నో మైనింగ్ జోన్ గా పంచదార్లను ప్రకటించాలి. కొండను ఇప్పటికే పిండి చేసిన అనకొండలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి.

Back to Top