తాడేపల్లి గూడెం: రాష్ట్రంలో వెన్నుపోటు పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అరాచకాలు, వేధింపులు ఆందోళన కలిగిస్తున్నాయని, ఇటువంటి సమయంలో గతంలో ఎంతో మందిని కాపాడిన ’దిశ’ వ్యవస్థను రద్దు చేయడాన్ని మాజీ హోం మంత్రి తానేటి వనిత తీవ్రంగా తప్పుపట్టారు. కేవలం జగన్‌గారిపై ఉన్న రాజకీయ కక్షతోనే రాష్ట్రంలో మహిళల రక్షణకు, భద్రతకు అండగా ఉన్న వ్యవస్థను కూటమి ప్రభుత్వం రద్దు చేస్తోందని ఆమె మండిపడ్జారు. మహిళలు, యువతుల రక్షణ కోసం గత ప్రభుత్వంలో ప్రభావవంతంగా పని చేస్తూ.. లక్షలాది మందికి అభయహస్తంగా నిలిచిన ఈ వ్యవస్థను తొలగించడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వైయస్సార్సీపీ అధికారంలోకి రాగనే దిశ వ్యవస్థను పునరుద్ధరిస్తామని తాడేపల్లిగూడెంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి తానేటి వనిత తేల్చి చెప్పారు. ప్రెస్‌మీట్‌లో మాజీ హోం మంత్రి తానేటి వనిత ఇంకా ఏం మాట్లాడారంటే..: నాడు 31 వేల మందిని కాపాడిన దిశ వ్యవస్థ: మహిళలను, యువతులను, చిన్నారులను కాపాడటంలో కీలక పాత్ర పోషించిన దిశ వ్యవస్థను రద్దు చేయడం అంటే ఈ రాష్ట్రంలో ఉన్న కామాందులకు, అరాచక శక్తులకు స్వేచ్ఛనివ్వడమే. ఒక మహిళగా ఉండి హోంశాఖ నిర్వహిస్తున్న అనిత గారు, చట్టాలను మరింత బలోపేతం చేయాల్సింది పోయి ఉన్న వ్యవస్థలను రద్దు చేయడానికి ముందు వరుసలో నిలవడం బాధాకరం. గత జగనన్న ప్రభుత్వంలో తెచ్చిన దిశా యాప్‌ను దాదాపు 1.5 కోట్ల మంది యువత, మహిళలు, డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఆపదలో ఉన్నప్పుడు ఎస్‌ఓఎస్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా లేదా ఫోన్ 5 సార్లు షేక్ చేయడం ద్వారా పోలీసుల నుండి తక్షణ సహాయం అందింది. దాదాపు 31వేల మంది మహిళలకు ఈ యాప్ ద్వారా రక్షణ లభించింది. రాష్ట్రవ్యాప్తంగా 18 దిశ పోలీస్ స్టేషన్లు, 13 ప్రత్యేక పోక్సో కోర్టులు, 12 ప్రత్యేక మహిళా కోర్టులు మరియు వేగవంతమైన డిఎన్‌ఏ పరీక్షల కోసం ప్రత్యేక ఫోరెన్సిక్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసి దర్యాప్తును వేగవంతం చేశాం. స్పష్టమైన ఆధారాలు ఉన్న కేసుల్లో 21 రోజుల్లోనే నిందితుడికి శిక్ష పడేలా దిశా బిల్లులో చట్టబద్ధత కల్పించాం. ఇది నేరస్థులలో భయం తెచ్చింది. పేర్లు మార్చుకోవడంపై ఉన్న శ్రద్ధ.. మహిళల భద్రతపై ఏది?: గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన సంక్షేమ పథకాలకు, వ్యవస్థలకు పేర్లు మార్చడంపై ఉన్న శ్రద్ధ కూటమి ప్రభుత్వానికి శాంతిభద్రతలపై లేదు. దిశా టూ శక్తి యాప్ నాడు దిశ యాప్‌ను అవహేళన చేసిన అనిత గారే, నేడు దానిని ’శక్తి యాప్’గా పేరు మార్చి ప్రచారం చేసుకున్నారు. సరే.. పేరు మార్చినా మహిళలకు ఉపయోగపడితే సంతోషమే అనుకుంటే, ఇప్పుడు ఏకంగా మొత్తం దిశా వ్యవస్థనే రద్దు చేసే కుట్ర చేస్తున్నారు. జగనన్న పర్యటనలకు భద్రత కరవు.. ప్రశ్నించే వారిపై దాడులు: ఒక మాజీ ముఖ్యమంత్రి, జెడ్ కేటగిరీ రక్షణ ఉన్న జగన్‌గారికి సరైన భద్రత కల్పించడంలో హోం శాఖ పూర్తిగా విఫలమైంది. యువతను అవమానించడమే సరిపోతుంది. వైయస్.జగన్ పర్యటనల్లో పాల్గొంటున్న నేటి తరం (’ఎ్ఛn ో’) యువతను ‘గాంజా బ్యాచ్‘ అని సంబోధిస్తూ అవమానించడం తగదు. మరోవైపు డీఎస్సీ అవకతవకలపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్షు తో పాటు వైయస్సార్సీపీ శిబిరంపై టిడిపి శాసనసభ్యుడు బోండా ఉమా ఆధ్వర్యంలో రాళ్ళు, కోడిగుడ్లతో దాడులు చేస్తే వారిపై కేసులు ఎందుకు పెట్టలేదు? చట్టం అందరికీ ఒకేలా ఎందుకు అమలు కావడం లేదు? రాష్ట్రంలో వెన్నుపోటు పార్టీ కూటమి ప్రజా ప్రతినిధులు, నాయకులు మహిళలపై చేస్తున్న వేధింపుల వివరాలన్నీ స్పష్టంగా ఉన్నాయని, కాబట్టి వారిపై వెంటనే చర్య తీసుకోవాలని మాజీ హోం మంత్రి తానేటి వనిత డిమాండ్ చేశారు.