రెండో రోజు కూడా అదే నినాదం..

డీఎస్సీ–2025 అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాల్సిందే

అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి

ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలి

నిరుద్యోగ భృతి సహా ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలి

రాష్ట్రవ్యాప్తంగా రెండో రోజు ఉధృతంగా కొనసాగిన వైయ‌స్సార్‌సీపీ రిలే నిరాహార దీక్షలు

 తాడేపల్లి: డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై స్వతంత్ర సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైయ‌స్సార్‌సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా రెండో రోజు కూడా రిలే నిరాహార దీక్షలు ఉధృతంగా కొనసాగాయి. తిరుపతి నుంచి శ్రీకాకుళం వరకు, అనంతపురం నుంచి కోనసీమ వరకు దాదాపు అన్ని జిల్లాల్లో యువత, విద్యార్థులు, నిరుద్యోగులు, పార్టీ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని కూటమి ప్రభుత్వ వైఖరిని నిరసించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఎన్నికల్లో ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీతో పాటు ఇతర ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

- డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ తప్పనిసరి

రాష్ట్రవ్యాప్తంగా జరిగిన అన్ని దీక్షల్లో నాయకులు ఒకే డిమాండ్‌ను వినిపించారు. డీఎస్సీ–2025 నియామక ప్రక్రియపై తీవ్ర అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో స్వతంత్ర సీబీఐ విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని కోరారు. ప్రభుత్వం తప్పు చేయకపోతే సీబీఐ విచారణకు ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించారు. స్పోర్ట్స్ కోటాతో పాటు మొత్తం డీఎస్సీ నియామక ప్రక్రియపై నిష్పాక్షిక దర్యాప్తు జరిపి, అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 

- తిరుపతి

తిరుపతిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, భూమన అభినయ్‌రెడ్డి, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు తదితరులు రెండో రోజు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ నియామకాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపి నిజాలు వెలికితీయాలని, మంత్రి లోకేష్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Image

- కుప్పం

కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ భరత్ మాట్లాడుతూ డీఎస్సీ అక్రమాలకు బాధ్యులను శిక్షించి, నిరుద్యోగులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

- పలమనేరు

మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ ఆధ్వర్యంలో జరిగిన దీక్షల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వెంకటేగౌడ మాట్లాడుతూ డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణతో పాటు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

- నగరి

నగరిలో వైయ‌స్సార్‌సీపీ అర్బన్, రూరల్ నాయకులు, యువజన, విద్యార్థి విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ డీఎస్సీ అక్రమాలపై స్వతంత్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

- రాయచోటి

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన దీక్షల్లో యువత, విద్యార్థులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. గడికోట శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగ యువత భవిష్యత్తుతో చెలగాటం ఆడిన ప్రభుత్వాన్ని ప్రజలు క్షమించరని అన్నారు.

- పుంగనూరు

మాజీ ఎంపీ రెడ్డెప్ప ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్షల్లో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. రెడ్డెప్ప మాట్లాడుతూ డీఎస్సీ వ్యవహారంలో లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

- గూడూరు

గూడూరు నియోజకవర్గ ఇన్‌చార్జి బూదూరు గురవయ్య ఆధ్వర్యంలో యువత, విద్యార్థులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. బూదూరు గురవయ్య మాట్లాడుతూ సీబీఐ విచారణ జరిగే వరకు ఉద్యమం ఆగదన్నారు.

- పి.గన్నవరం

ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, మాజీ ఎంపీ చింతా అనూరాధ, నియోజకవర్గ సమన్వయకర్త గన్నవరపు శ్రీనివాసరావు పాల్గొన్నారు. బొమ్మి ఇజ్రాయిల్ మాట్లాడుతూ డీఎస్సీ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి యువతకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

- కదిరి

బీఎస్ మక్బూల్ ఆధ్వర్యంలో యువజన, విద్యార్థి విభాగాల నాయకులు పాల్గొన్నారు. బీఎస్ మక్బూల్ మాట్లాడుతూ డీఎస్సీ అక్రమాలకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

- జీడీ నెల్లూరు

నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి ఆధ్వర్యంలో దీక్షలు జరిగాయి. కృపాలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం నిరుద్యోగుల భవిష్యత్తుతో రాజకీయాలు చేయడం మానుకోవాలని అన్నారు.

- పీలేరు

మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ డీఎస్సీ నియామకాలపై పారదర్శక విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

- ఆదోని

మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు వైయ‌స్సార్‌సీపీ ఉద్యమం కొనసాగుతుందని చెప్పారు.

- నరసన్నపేట

మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రజలను మోసం చేసిన ప్రభుత్వానికి యువతే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.

- అవనిగడ్డ

వైయ‌స్సార్‌సీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో జరిగిన దీక్షల్లో పార్టీ నాయకులు పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు.

- పులివెందుల

వైయస్ మధురెడ్డి ఆధ్వర్యంలో డీఎస్సీ అభ్యర్థులు, విద్యార్థి సంఘాలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. మధురెడ్డి మాట్లాడుతూ అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు.

- విశాఖ ఉత్తరం

జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు ఆధ్వర్యంలో దీక్షలు జరిగాయి. కె.కె.రాజు మాట్లాడుతూ లోకేష్ రాజీనామా చేసే వరకు వైయ‌స్సార్‌సీపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

- పాలకొండ

ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, సీతంపేట, భామిని మండలాల నాయకులు పాల్గొన్నారు. పాలవలస విక్రాంత్ మాట్లాడుతూ డీఎస్సీ స్పోర్ట్స్ కోటా అక్రమాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

- అనంతపురం

జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో దీక్షలు జరిగాయి. ఆయన మాట్లాడుతూ డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలని కోరారు.

Image

- నూజివీడు

నూజివీడులో వైయ‌స్సార్‌సీపీ నాయకులు, యువజన, విద్యార్థి విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ నిరుద్యోగుల భవిష్యత్తును కాపాడాలంటే సీబీఐ విచారణ తప్పనిసరి అని పేర్కొన్నారు.

Image

- నందిగామ

మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్‌మోహన్‌రావు ఆధ్వర్యంలో దీక్షలు జరిగాయి. ఆయన మాట్లాడుతూ డీఎస్సీ అక్రమాలను ప్రభుత్వం దాచిపెట్టలేదని, సత్యం బయటపడుతుందని అన్నారు.

- ఆత్మకూరు (శ్రీశైలం)

మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నార్పల సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ సీబీఐ విచారణకు ప్రభుత్వం భయపడడం వెనుక పెద్ద కుట్ర ఉందని విమర్శించారు.

- కోడుమూరు

కర్నూలు పార్లమెంట్ ఇన్‌చార్జి బుట్టా రేణుక, నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్, యువజన నాయకులు సోమశేఖర్‌రెడ్డి, ఎంకే వెంకటేష్ పాల్గొన్నారు. బుట్టా రేణుక మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలంటే డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరగాల్సిందేనని అన్నారు.

- రామచంద్రపురం

నియోజకవర్గ కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాశ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, మహిళా, యువజన, విద్యార్థి విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. పిల్లి సూర్యప్రకాశ్ మాట్లాడుతూ డీఎస్సీ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి ఎన్నికల హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

- వేమూరు

వేమూరు నియోజకవర్గ నాయకులు, యువజన, విద్యార్థి విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ యువతకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు.

- పొన్నూరు (ఇంకొల్లు కేంద్రం)

ఇంకొల్లులో జరిగిన రిలే దీక్షల్లో పొన్నూరు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ డీఎస్సీ నియామకాలపై సీబీఐ దర్యాప్తు జరిపి నిజాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

- నంద్యాల (గోస్పాడు)

గోస్పాడులో వైయ‌స్సార్‌సీపీ నాయకులు, యువజన కార్యకర్తలు నిరసనలో పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ నిరుద్యోగుల ఆశలతో చెలగాటం ఆడిన ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు.

- విజయవాడ సెంట్రల్

మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. మల్లాది విష్ణు మాట్లాడుతూ శాంతియుత నిరసనలపై దాడులు చేసినా డీఎస్సీ అక్రమాలపై పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

- పూతలపట్టు 

పూతలపట్టు నియోజకవర్గంలో డీఎస్సీ–2025 నియామకాలలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజకీయ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రెండో రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. వైయ‌స్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు, జిల్లా రీజినల్ కోఆర్డినేటర్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మార్గదర్శకత్వంలో, ఉమ్మడి చిత్తూరు–తిరుపతి జిల్లాల పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి నాయకత్వంలో, పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సునీల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.  

- వినుకొండ‌
నూజెండ్ల మండలంలో డీఎస్సీ–2025 నియామకాలలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజకీయ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైయ‌స్సార్‌సీపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షల్లో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ, డీఎస్సీ అక్రమాలపై శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వైయ‌స్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై అధికార పార్టీ దాడులకు పాల్పడటం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు.  

Image

Back to Top