తాడేపల్లి: గుంటూరులో మహిళను వివస్త్రను చేసి దాడి చేసిన దారుణ ఘటనకు నిరసనగా వైయస్సార్‌సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో చేపట్టిన నిరసన కార్యక్రమాలు విజయవంతమయ్యాయని వైయస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో మహిళలపై దాడులు, అఘాయిత్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. మహిళల భద్రతను గాలికి వదిలేసి రాష్ట్రంలో దుశ్శాసన పర్వాన్ని తలపించే పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. - మహిళల భద్రతను గాలికి వదిలేశారు రాష్ట్రంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కనపెట్టి రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. పోలీసు వ్యవస్థను ప్రతిపక్ష నేతలపై రాజకీయ కక్షసాధింపులకు ఉపయోగిస్తూ ప్రజల రక్షణను, ముఖ్యంగా మహిళల భద్రతను గాలికి వదిలేశారు. గుంటూరు నడిబొడ్డున రూ.10 వేల లంచం ఇవ్వలేదన్న కారణంతో ఒక మహిళను వివస్త్రను చేసి దాడి చేయడం సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన. ఈ ఘటనలో టీడీపీ వార్డు సెక్రటరీ ప్రమేయం ఉండటం మరింత దారుణం. బద్వేలు, కావలి, మైలవరం సహా రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై వరుసగా దాడులు జరుగుతున్నా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం లేదు. నిందితులపై చర్యలు తీసుకోకపోవడంతోనే కూటమి నేతలు, వారి అనుచరులు మరింత రెచ్చిపోతున్నారు. బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి బాధితులపైనే కేసులు పెట్టే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. - హోంమంత్రి అనిత, పవన్ కళ్యాణ్ మౌనం ఎందుకు? గుంటూరు ఘటనపై మహిళా హోంమంత్రి అనిత ఎందుకు స్పందించడం లేదు? ఇంతటి దారుణం జరిగినా బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం, భరోసా ఎందుకు ఇవ్వలేదు? నిందితుడు టీడీపీ కార్యకర్త అయితే చర్యలు తీసుకోరా? గతంలో నేరస్తులను బహిరంగంగా ఎగ్జిబిట్ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గుతోంది? గుంటూరు ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఎలా బయటకు వచ్చాయనే దానిపై దృష్టి పెట్టడం కాదు.. బాధితురాలికి న్యాయం చేయడంపై దృష్టి పెట్టాలి. బద్వేలు, కావలి సహా మహిళలపై జరిగిన ఘటనల్లో నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోతే మహిళలకు రక్షణ ఎలా లభిస్తుంది? మహిళల భద్రతకు పెద్దపీట వేస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ కూడా ఇన్ని దారుణాలు జరుగుతున్నా ఎందుకు మౌనంగా ఉన్నారు? ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ కనీసం మహిళల భద్రతను ఎందుకు గాలికి వదిలేశారని చంద్రబాబును ప్రశ్నించాలి. - దిశను నిర్వీర్యం చేసి మహిళలకు రక్షణ లేకుండా చేశారు శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి దిశ వ్యవస్థను సమర్థంగా అమలు చేశారు. ఇప్పుడు ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసి మహిళలకు అత్యవసర పరిస్థితుల్లో సకాలంలో రక్షణ అందకుండా చేశారు. పోలీసు వ్యవస్థను రాజకీయ కక్షసాధింపులకు కాకుండా ప్రజలు, మహిళల రక్షణ కోసం ఉపయోగించాలి. శాంతిభద్రతలను కాపాడటంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దీని ప్రభావం రాష్ట్ర ప్రతిష్ఠతో పాటు పెట్టుబడులపైనా పడుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి మహిళలపై జరుగుతున్న అరాచకాలకు అడ్డుకట్ట వేయాలి. నేరస్తులు ఏ పార్టీకి చెందిన వారైనా కఠినంగా శిక్షించాలి. పోలీసు వ్యవస్థను పటిష్టం చేసి రాష్ట్రంలోని ప్రతి మహిళకు భద్రత కల్పించాలి’’ అని వరుదు కళ్యాణి స్పష్టం చేశారు. ------------------- - విజయవాడలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మాట్లాడిన ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయి. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కనపెట్టి రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. గుంటూరులో ఒక మహిళను నడిరోడ్డుపైకి తీసుకొచ్చి వివస్త్రను చేసి అవమానించడం అత్యంత దారుణం. ఘటన జరిగిన వెంటనే చర్యలు తీసుకోకుండా రెండు రోజుల తర్వాత స్పందించడం మహిళల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యాన్ని తెలియజేస్తోంది. మహిళా ఎమ్మెల్యే, మహిళా హోంమంత్రి ఉన్న రాష్ట్రంలోనే మహిళలకు రక్షణ లేకపోవడం బాధాకరం. బాధిత మహిళకు న్యాయం జరిగే వరకు వైయస్సార్‌సీపీ మహిళా విభాగం పోరాటం కొనసాగిస్తుంది. హోంమంత్రి అనిత ఇప్పటికైనా మహిళల రక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. మహిళలు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేస్తే స్థానిక రాజకీయ నాయకుల అనుమతి కోసం ఎదురుచూడకుండా వెంటనే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, హోంమంత్రి అనిత రాష్ట్రంలో మహిళలపై ఎక్కడ దాడి జరిగినా తక్షణమే స్పందించాలి. మహిళలపై చేయి వేస్తే అదే నేరస్తుడికి ఆఖరి రోజు అని చెప్పే మాటలను ఆచరణలో చూపించాలి. గుంటూరు ఘటనలో బాధిత మహిళకు న్యాయం చేసి, ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి’’ అని కల్పలతారెడ్డి డిమాండ్ చేశారు. ---------------- - మచిలీపట్నంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మాట్లాడిన కృష్ణా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక నిన్న గుంటూరులో జరిగిన దారుణ ఘటనలో బాధిత మహిళను పరామర్శించి, జరిగిన విషయాలను తెలుసుకున్నాం. ఆమెతో పాటు భర్త, కుమారుడు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. బాధితురాలు ముందుగానే పోలీసులకు ఫిర్యాదు చేసినా వెంటనే చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇంతటి దారుణం జరిగింది. రాష్ట్రంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరుగుతున్నా హోంమంత్రి స్పందించడం లేదు. దిశ యాప్‌ను తీసేసి శక్తి యాప్ తెచ్చామని చెప్పడం తప్ప మహిళలకు రక్షణ కల్పించలేకపోయారు. బాధితురాలికి అండగా నిలవాల్సిన స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి, పరామర్శించడానికి వెళ్లిన వారిని జైల్లో వేయిస్తామని బెదిరించడం దారుణం. కూటమి ప్రభుత్వ మహిళా ఎమ్మెల్యేల్లో ఒక్కరు కూడా బాధితురాలికి సంఘీభావం తెలపకపోవడం బాధాకరం. సంక్షేమం, అభివృద్ధితో పాటు శాంతిభద్రతలను కూడా ప్రభుత్వం గాలికి వదిలేసింది. మహిళలపై అమానుషంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకుని, పోలీసు వ్యవస్థను పటిష్టం చేసి మహిళలకు రక్షణ కల్పించాలి. --------------- - నెల్లూరులో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మాట్లాడిన వైయస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత కూటమి పాలన మొదలైనప్పటి నుంచి రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైంది. మహిళలపై దాడులు, అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గుంటూరులో బాధిత మహిళను మేమంతా కలిసి పరామర్శించి ధైర్యం చెప్పాం. కానీ ప్రభుత్వం తరఫున ఒక్కరైనా ఆమెను పరామర్శించారా? బాధితురాలికి న్యాయం చేయకుండా, మేము ప్రశ్నిస్తే రాజకీయ అంశంగా చిత్రీకరించి ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిందితులను రిమాండ్‌కు పంపితేనే న్యాయం చేసినట్లు కాదు.. వారికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో దిశ వ్యవస్థ, మహిళా పోలీసులతో మహిళలకు రక్షణ, ఆత్మస్థైర్యం ఉండేది. ఇప్పుడు ఆ వ్యవస్థలను నిర్వీర్యం చేసి మహిళలకు భద్రత లేకుండా చేశారు. ఇంతటి దారుణం జరిగినా మహిళా హోంమంత్రి, కూటమి మహిళా నేతలు స్పందించకపోవడం బాధాకరం. గుంటూరు బాధిత మహిళకు న్యాయం జరిగే వరకు వైయస్సార్‌సీపీ వెనక్కి తగ్గదు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కేసును వ్యక్తిగతంగా తీసుకుని నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి’’ అని కాకాణి పూజిత స్పష్టం చేశారు.