లోకమాన్య బాల గంగాధర్ తిలక్‌కు వైయస్‌ జగన్‌ నివాళి

తాడేపల్లి:  స్వాతంత్ర్య సమరయోధుడు లోకమాన్య బాల గంగాధర్ తిలక్ జయంతి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. 
‘‘స్వరాజ్యం నా జన్మహక్కు.. దానిని సాధించి తీరుతాను అనే నినాదంతో యావత్ భారత జాతిని స్వాతంత్ర్యోద్యమ బాటలో నడిపించిన మహనీయుడు లోకమాన్య బాల గంగాధర్ తిలక్. ప్రజల్లో ఆత్మగౌరవాన్ని, చైతన్యాన్ని మేల్కొలిపి బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా ఆయన సాగించిన రాజీలేని పోరాటం తరతరాలకు స్ఫూర్తిదాయకం. నేడు బాల గంగాధర్ తిలక్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులు’’ అని వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు.
 

Back to Top