కడప జిల్లా రైల్వే అభివృద్ధిపై కేంద్ర మంత్రికి ఎంపీ అవినాష్‌రెడ్డి వినతి

 

 యర్రగుంట్ల స్టేషన్‌ను అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద అభివృద్ధి చేయాలి

 కడప రైల్వే స్టేషన్‌లో రెండు షిఫ్టుల్లో రిజర్వేషన్ కౌంటర్ ఏర్పాటు చేయాలి

 పలు రైల్వే స్టేషన్లలో మరిన్ని రైళ్లకు నిలుపుదల కల్పించాలని విజ్ఞప్తి

ఢిల్లీ: కడప జిల్లా రైల్వే అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలను పరిష్కరించాలని కోరుతూ వైయ‌స్సార్‌సీపీ ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ఢిల్లీలో కలిశారు. ఈ మేరకు పలు అంశాలను ప్రస్తావిస్తూ కేంద్ర మంత్రికి లేఖలు అందజేశారు. యర్రగుంట్ల రైల్వే స్టేషన్‌ను అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద అభివృద్ధి చేసి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. కడప రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రిజర్వేషన్ కౌంటర్‌ను రెండు షిఫ్టుల్లో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అదేవిధంగా కడప జిల్లాలోని పలు రైల్వే స్టేషన్లలో మరిన్ని రైళ్లకు నిలుపుదల కల్పించాలని కోరారు. జిల్లా ప్రజలకు మెరుగైన రైల్వే సేవలు, సౌకర్యాలు అందేలా ఈ అంశాలపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
 

Back to Top